నోటిఫికేషన్స్‌

ముంబయి ప్రధానకేంద్రంగా ఉన్న ఇండస్ట్రియల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఐడీబీఐ) అసిస్టెంట్‌ మేనేజర్లు, ఎగ్జిక్యూటివ్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

Updated : 02 Jun 2022 02:23 IST

ఉద్యోగాలు


ఐడీబీఐలో 1544 పోస్టులు

ముంబయి ప్రధానకేంద్రంగా ఉన్న ఇండస్ట్రియల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఐడీబీఐ) అసిస్టెంట్‌ మేనేజర్లు, ఎగ్జిక్యూటివ్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

మొత్తం ఖాళీలు: 1544. ఎగ్జిక్యూటివ్‌లు-1044, అసిస్టెంట్‌ మేనేజర్లు-500

అర్హత: ఏదైనా గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణతతో పాటు కంప్యూటర్‌ నాలెడ్జ్‌ ఉండాలి.

ఎంపిక: ఆన్‌లైన్‌ టెస్ట్‌, డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌, ప్రీ రిక్రూట్‌మెంట్‌ మెడికల్‌ టెస్ట్‌ ఆధారంగా.

దరఖాస్తు: ఆన్‌లైన్‌ ద్వారా. దరఖాస్తులు: 2022, జూన్‌ 03 నుంచి స్వీకరిస్తారు.

దరఖాస్తులకు చివరి తేది: 2022, జూన్‌ 17.

పరీక్ష తేదీలు: ఎగ్జిక్యూటివ్‌ పోస్టులకు 2022, జులై 09, అసిస్టెంట్‌ మేనేజర్‌ పోస్టులకు 2022, జులై 23.

వెబ్‌సైట్‌: ‌www.idbibank.in/


ఈసీఐఎల్‌, హైదరాబాద్‌లో...

కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఎలక్ట్రానిక్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (ఈసీఐఎల్‌), హైదరాబాద్‌ కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 40. ఎలక్ట్రానిక్స్‌ మెకానిక్‌, ఫిట్టర్‌, ఎలక్ట్రీషియన్‌, మెషినిస్ట్‌, టర్నర్‌.

అర్హత: పదో తరగతితో పాటు సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణత, ఏడాది అనుభవం.

వయసు: 28 ఏళ్లు మించకుండా ఉండాలి.

ఎంపిక: రాత పరీక్ష/ డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌/ ట్రేడ్‌ టెస్ట్‌ ఆధారంగా.

దరఖాస్తు: ఆన్‌లైన్‌ ద్వారా. దరఖాస్తులు: 2022, జూన్‌ 04 నుంచి స్వీకరిస్తారు.

దరఖాస్తులకు చివరి తేది: 2022, జూన్‌ 25.

వెబ్‌సైట్‌: https://careers.ecil.co.in/


ప్రవేశాలు
ఎంఎస్‌ఎంఈ టూల్‌ రూమ్‌, హైదరాబాద్‌లో...

భారత ప్రభుత్వ ఎంఎస్‌ఎంఈ మంత్రిత్వశాఖకు చెందిన హైదరాబాద్‌లోని ఎంఎస్‌ఎంఈ టూల్‌ రూమ్‌ కింది ప్రోగ్రాములో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.

* పోస్ట్‌ డిప్లొమా ఇన్‌ టూల్‌ డిజైన్‌ (పీడీటీడీ)

కోర్సు వ్యవధి: ఏడాది (రెండు సెమిస్టర్లు)

మొత్తం సీట్లు: 60 అర్హత: మెకానికల్‌ ఇంజినీరింగ్‌లో డిప్లొమా/ తత్సమాన ఉత్తీర్ణత.

వయసు: 27 ఏళ్లు మించకూడదు.

ఎంపిక: ప్రవేశ పరీక్ష ఆధారంగా.

దరఖాస్తు: ఆన్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తులకు చివరి తేది: 2022, జూన్‌ 30.

వెబ్‌సైట్‌: https://citdindia.org/


ఓయూలో డిప్లొమా కోర్సు

హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని యూనివర్సిటీ కాలేజ్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌

అండ్‌ సోషల్‌ సైన్సెస్‌కు చెందిన ఫ్రెంచ్‌, జర్మన్‌ విభాగాలు 2022-2023 విద్యాసంవత్సరానికి కింది డిప్లొమా ప్రోగ్రాములో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతున్నాయి.

* డిప్లొమా కోర్సులు (ఫారిన్‌ లాంగ్వేజెస్‌)

కోర్సు వ్యవధి: 4 నెలలు. అర్హత: ఇంటర్మీడియట్‌/ తత్సమాన ఉత్తీర్ణత.

ఎంపిక: స్పెషల్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ ఆధారంగా.

దరఖాస్తు: ఆన్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తులకు చివరి తేది: 2022, జులై 02.

వెబ్‌సైట్‌:www.osmania.ac.in/


నీలిట్‌లో ఎంటెక్‌ ప్రోగ్రాములు

కేంద్ర ప్రభుత్వానికి చెందిన నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ (నీలిట్‌) కాలికట్‌ (కేరళ) 2022 - 2024 విద్యాసంవత్సరానికి కింది ప్రోగ్రాములో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.

* మాస్టర్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఎంటెక్‌)

అందిస్తున్న ప్రోగ్రాములు: ఎలక్ట్రానిక్స్‌ డిజైన్‌ టెక్నాలజీ, ఎంబడెడ్‌ సిస్టమ్స్‌

అర్హత: ఇంజినీరింగ్‌ డిగ్రీ (బీటెక్‌)/ తత్సమాన ఉత్తీర్ణత.

ఎంపిక: గేట్‌ స్కోర్‌తో. అది లేని వారికి అకడమిక్‌ మెరిట్‌ ద్వారా ప్రవేశాలు కల్సిస్తారు.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 2022, జులై 12.

వెబ్‌సైట్‌: https://nielit.gov.in/


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని