Updated : 26 Jul 2022 03:40 IST

ఉద్యోగాలు

ఆర్‌సీఎఫ్‌ఎల్‌లో మేనేజ్‌మెంట్‌ ట్రెయినీలు

ముంబయిలోని రాష్ట్రీయ కెమికల్స్‌ అండ్‌ ఫర్టిలైజర్స్‌ లిమిటెడ్‌ (ఆర్‌సీఎఫ్‌ఎల్‌) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మేనేజ్‌మెంట్‌ ట్రెయినీలు

మొత్తం పోస్టులు: 33

విభాగాలు: కెమికల్‌, మెకానికల్‌, బాయిలర్‌, సేఫ్టీ, ఫైర్‌, సీసీ ల్యాబ్‌, ఐటీ.

అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో ఫుల్‌ టైం బీఈ/ బీటెక్‌/ బీఎస్సీ (ఇంజినీరింగ్‌) ఉత్తీర్ణత.

వయసు: 27 ఏళ్లు మించకుండా ఉండాలి.

ఎంపిక: ఆన్‌లైన్‌ టెస్ట్‌, పర్సనల్‌ ఇంటర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తు: ఆన్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 2022, జులై 29.

దరఖాస్తులకు చివరి తేదీ: 2022, ఆగస్టు 18.

వెబ్‌సైట్‌: www.rcfltd.com/


సెంట్రల్‌ ట్రైబల్‌ యూనివర్సిటీ, ఏపీలో...

కేంద్రీయ విశ్వవిద్యాలయమైన విజయనగరం (ఆంధ్రప్రదేశ్‌) లోని సెంట్రల్‌ ట్రైబల్‌ యూనివర్సిటీ వివిధ విభాగాల్లో టీచింగ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టులు: 18. ప్రొఫెసర్లు, అసోసియేట్‌ ప్రొఫెసర్లు, అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు.

విభాగాలు: బయోటెక్నాలజీ, బోటనీ, బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌, కెమిస్ట్రీ, కంప్యూటర్‌ సైన్స్‌ తదితరాలు.

అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో మాస్టర్స్‌ డిగ్రీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణత, నెట్‌/ స్లెట్‌/ సెట్‌ అర్హత, అనుభవం.

ఎంపిక: షార్ట్‌లిస్టింగ్‌, ఇంటర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తు: ఆన్‌లైన్‌/ ఆఫ్‌లైన్‌ ద్వారా.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 2022, ఆగస్టు 23.

దరఖాస్తు హార్డ్‌కాపీల స్వీకరణకు చివరి తేదీ: 2022, సెప్టెంబరు 02.

వెబ్‌సైట్‌:  www.ctuap.ac.in/


ఇస్రో స్పేస్‌ సెంటర్‌లో...

తిరువనంతపురంలోని ఇస్రో-విక్రం సారాభాయ్‌ స్పేస్‌ సెంటర్‌ (వీఎస్‌ఎస్‌సీ) కింది ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

జూనియర్‌ రిసెర్చ్‌ ఫెలో (జేఆర్‌ఎఫ్‌)

మొత్తం ఖాళీలు: 17

అర్హత: ఫిజిక్స్‌లో ఎమ్మెస్సీ/ ఎంటెక్‌ ఉత్తీర్ణత, సీఎస్‌ఐఆర్‌-యూజీసీ నెట్‌/ గేట్‌/ జెస్ట్‌లో అర్హత సాధించి ఉండాలి.

వయసు: 08.08.2022 నాటికి 28 ఏళ్లు మించకుండా ఉండాలి.

ఎంపిక: షార్ట్‌లిస్టింగ్‌, ఇంటర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తులకు చివరి తేదీ: 2022, ఆగస్టు 08.

వెబ్‌సైట్‌: ‌ www.vssc.gov.in/


వాక్‌ఇన్‌

స్పెషలిస్ట్‌ డాక్టర్‌ ఖాళీలు

నంతపురం జిల్లాలోని పీహెచ్‌సీలు/ యూపీహెచ్‌సీల్లో ఒప్పంద ప్రాతిపదికన స్పెషలిస్ట్‌ డాక్టర్‌ ఖాళీల భర్తీకి జిల్లా వైద్యారోగ్య అధికారి కార్యాలయం వాక్‌ ఇన్‌ ఇంటర్వ్యూ నిర్వహిస్తోంది.

మొత్తం పోస్టులు: 86

విభాగాలు: జెరియాట్రిక్‌, ఈఎన్‌టీ, పీడియాట్రిక్స్‌, ఆర్థోపెడిక్స్‌, జనరల్‌ సర్జరీ తదితరాలు.

అర్హత: సంబంధిత విభాగాల్లో మెడికల్‌ పీజీ డిగ్రీ (ఎంఎస్‌/ ఎండీ/ డీజీవో/ డీఎల్‌ఓ/ డీసీహెచ్‌) ఉత్తీర్ణత.

ఎంపిక: అకడమిక్‌ మెరిట్‌, అనుభవం, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ ఆధారంగా.

వాక్‌ఇన్‌ ఇంటర్వ్యూ తేదీ: 2022, జులై 28. వేదిక: జిల్లా వైద్యారోగ్య అధికారి కార్యాలయం, అనంతపురం, ఏపీ.

వెబ్‌సైట్‌: https://ananthapuramu.ap.gov.in/


డీఎంహెచ్‌ఓ, హైదరాబాద్‌లో...

హైదరాబాద్‌ జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి కార్యాలయం (డీఎంహెచ్‌ఓ) ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి వాక్‌ఇన్‌ నిర్వహిస్తోంది.

మొత్తం పోస్టులు: 07

పోస్టులు-ఖాళీలు: ఫిజీషియన్‌-01, మెడికల్‌ ఆఫీసర్లు-06.

అర్హత: పోస్టుల్ని అనుసరించి ఎంబీబీఎస్‌, ఎండీ (జనరల్‌ మెడిసిన్‌) ఉత్తీర్ణత, అనుభవం.

ఎంపిక: వాక్‌ఇన్‌ ఇంటర్వ్యూ ఆధారంగా.

వాక్‌ఇన్‌ తేదీ: 2022, జులై 27.

వేదిక: డీఎంహెచ్‌ఓ, హైదరాబాద్‌, మీటింగ్‌ హాల్‌, నాలుగో అంతస్తు, జీహెచ్‌ఎంసీ బిల్డింగ్‌, ప్యాట్నీ, సికింద్రాబాద్‌.

వెబ్‌సైట్‌: https://hyderabad.telangana.gov.in/


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని