నోటిఫికేషన్స్‌

భారత ఆహార సంస్థలో 5043 నాన్‌ ఎగ్జిక్యూటివ్‌లు ఫుడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎఫ్‌సీఐ) జోన్ల వారీగా 5043 నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్టుల భర్తీకి ఆన్‌లైన్‌ దరఖాస్తులు కోరుతోంది.

Published : 05 Sep 2022 01:25 IST

ఉద్యోగాలు

భారత ఆహార సంస్థలో 5043 నాన్‌ ఎగ్జిక్యూటివ్‌లు

ఫుడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎఫ్‌సీఐ) జోన్ల వారీగా 5043 నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్టుల భర్తీకి ఆన్‌లైన్‌ దరఖాస్తులు కోరుతోంది.

జూనియర్‌ ఇంజినీర్‌ (సివిల్‌ ఇంజినీరింగ్‌)

* జూనియర్‌ ఇంజినీర్‌ (ఎలక్ట్రికల్‌, మెకానికల్‌ ఇంజినీరింగ్‌)

* స్టెనోగ్రాఫర్‌ గ్రేడ్‌-2

అసిస్టెంట్‌ గ్రేడ్‌-3(జనరల్‌)

* అసిస్టెంట్‌ గ్రేడ్‌-3(అకౌంట్స్‌)

అసిస్టెంట్‌ గ్రేడ్‌-3(టెక్నికల్‌)

* అసిస్టెంట్‌ గ్రేడ్‌-3(డిపో)

*అసిస్టెంట్‌ గ్రేడ్‌-3(హిందీ)

అర్హత: పోస్టును అనుసరించి డిగ్రీ, బీకాం, బీఎస్సీ (అగ్రికల్చర్‌/ బోటనీ/ జువాలజీ/ బయో-టెక్నాలజీ/ బయో-కెమిస్ట్రీ/ మైక్రోబయాలజీ/ ఫుడ్‌ సైన్స్‌), బీఈ, బీటెక్‌ (ఫుడ్‌ సైన్స్‌/ ఫుడ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ/ అగ్రికల్చరల్‌ ఇంజినీరింగ్‌/ బయో-టెక్నాలజీ/ సివిల్‌), డిప్లొమా (సివిల్‌/ మెకానికల్‌)/ ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌) ఉత్తీర్ణులై ఉండాలి.

ఎంపిక: ఆన్‌లైన్‌ పరీక్ష (ఫేజ్‌-1, ఫేజ్‌-2 పరీక్షలు), స్కిల్‌/ టైపింగ్‌ టెస్ట్‌(స్టెనో పోస్టులకు) ఆధారంగా.

దరఖాస్తు రుసుము: రూ.500 (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు దరఖాస్తు రుసుము లేదు).

ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభం: 06.09.2022.

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 05.10.2022.

ఆన్‌లైన్‌ పరీక్ష: జనవరి, 2023.

వెబ్‌సైట్‌: https://recruitmentfci.in/


3068 ట్రేడ్స్‌మ్యాన్‌, ఫైర్‌మ్యాన్‌ పోస్టులు

సికింద్రాబాద్‌లోని సెంట్రల్‌ రిక్రూట్‌మెంట్‌ సెల్‌- ఆర్మీ ఆర్డినెన్స్‌ కార్ప్స్‌ సెంటర్‌... ఏవోసీ రీజియన్లలో 3068 ట్రేడ్స్‌మ్యాన్‌ మేట్‌, ఫైర్‌మ్యాన్‌, జేఏవో పోస్టుల భర్తీకి ఆన్‌లైన్‌ దరఖాస్తులు కోరుతోంది.

ట్రేడ్స్‌మ్యాన్‌ మేట్‌: 2313 పోస్టులు

ఫైర్‌మ్యాన్‌: 656 పోస్టులు

జూనియర్‌ ఆఫీస్‌ అసిస్టెంట్‌: 99 పోస్టులు

అర్హత: పోస్టును అనుసరించి పదోతరగతి, పన్నెండో తరగతి, ఐటీఐ తదితర కోర్సుల్లో ఉత్తీర్ణులై ఉండాలి.

వయసు: 18 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి.

ఎంపిక: ఫిజికల్‌/ ప్రాక్టికల్‌/ స్కిల్‌ పరీక్షలు, రాత పరీక్ష, మెడికల్‌ ఫిట్‌నెస్‌ టెస్ట్‌, ధ్రువపత్రాల పరిశీలన ద్వారా ఎంపిక చేస్తారు.

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: ఉద్యోగ ప్రకటన ప్రచురితమైన తేదీ (సెప్టెంబరు 1) నుంచి 21 రోజుల్లోగా దరఖాస్తు చేయాలి.

వెబ్‌సైట్‌: https://joinindianarmy.nic.in/Authentication.aspx


ఎస్‌బీఐలో స్పెషలిస్ట్‌ కేడర్‌ ఆఫీసర్‌ కొలువులు

స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) దేశవ్యాప్తంగా ఉన్న వివిధ బ్రాంచీల్లో 714 స్పెషలిస్ట్‌ కేడర్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి ఆన్‌లైన్‌ దరఖాస్తులు కోరుతోంది.

పోస్టులు: మేనేజర్‌, రిలేషన్‌ మేనేజర్‌, ఇన్వెస్ట్‌మెంట్‌ ఆఫీసర్‌, సీనియర్‌ రిలేషన్‌ మేనేజర్‌, రీజనల్‌ హెడ్‌, అసిస్టెంట్‌ మేనేజర్‌, డిప్యూటీ మేనేజర్‌, స్పెషల్‌ ఎగ్జిక్యూటివ్‌ తదితరాలు.

విభాగాలు: డాట్‌నెట్‌ డెవలపర్‌, జావా డెవలపర్‌, బిజినెస్‌ ప్రాసెస్‌, ఆపరేషన్స్‌ టీమ్‌, బిజినెస్‌ డెవలప్‌మెంట్‌ తదితరాలు.

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో డిగ్రీ/ బీటెక్‌/ బీఈ/ ఎంటెక్‌/ ఎంఈ/ ఎంసీఏ/ ఎంఎస్సీ (కంప్యూటర్‌ సైన్స్‌/ ఇంజినీరింగ్‌/ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ/ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరింగ్‌/ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజినీరింగ్‌)/ ఎంబీఏ/ పీజీ/ పీజీడీఎం ఉత్తీర్ణత.

వయసు: పోస్టును అనుసరించి 01.04.2022 వరకు 20-50 ఏళ్లు ఉండాలి.

పని అనుభవం: సంబంధిత స్పెషలైజేషన్‌లో 2 ఏళ్ల నుంచి 12 ఏళ్లు పని అనుభవం ఉండాలి.

ఎంపిక: షార్ట్‌లిస్టింగ్‌, ఆన్‌లైన్‌ పరీక్ష, ఇంటర్వ్యూలో మెరిట్‌ ఆధారంగా. మేనేజర్‌, ఇంజినీర్‌ ఉద్యోగాలకు మాత్రం దరఖాస్తులను షార్ట్‌ లిస్ట్‌ చేసి, అభ్యర్థులను ఇంటర్వ్యూలకు పిలుస్తారు. అందులో ప్రతిభ ఆధారంగా నియామకాలు చేపడతారు.

దరఖాస్తు రుసుము: రూ.750.

దరఖాస్తు చివరి తేదీ: 20.09.2022.

వెబ్‌సైట్‌: https://sbi.co.in/web/careers


ప్రవేశాలు

ఏపీ రిసెర్చ్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని 16 విశ్వవిద్యాలయాల్లో పరిశోధన కోర్సుల్లో చేరాలనుకునే విద్యార్థుల కోసం ఏపీ రిసెర్చ్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (ఏపీఆర్‌సెట్‌)-2022 ప్రకటన వెలువడింది.

విభాగాలు: సైన్స్‌, ఆర్ట్స్‌, హ్యుమానిటీస్‌, సోషల్‌ సైన్స్‌, ఫైన్‌ ఆర్ట్స్‌, ఎడ్యుకేషన్‌, ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌, కామర్స్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌ స్టడీస్‌, ఇంజినీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ, ఆర్కిటెక్చర్‌ అండ్‌ ప్లానింగ్‌, లా అండ్‌ ఫార్మాస్యూటికల్‌ సైన్సెస్‌ తదితరాలు.

అర్హత: 55 శాతం మార్కులతో మాస్టర్స్‌ డిగ్రీ(సైన్స్‌, ఆర్ట్స్‌, మేనేజ్‌మెంట్‌, కామర్స్‌, లా, ఫార్మసీ, ఇంజినీరింగ్‌ తదితర కోర్సులు) ఉత్తీర్ణులై ఉండాలి. బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఇతర రిజర్వేషన్‌ కేటగిరీ అభ్యర్థులు 50శాతం మార్కులు సాధించాలి. పీజీ చివరి సంవత్సరం ఫలితాల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులూ అర్హులే.

ఎంపిక: ప్రవేశ పరీక్షలో సాధించిన మార్కులు, ఇంటర్వ్యూలో చూపిన ప్రతిభ ఆధారంగా.

దరఖాస్తు రుసుము: సబ్జెక్టుకు రూ.1500(బీసీ అభ్యర్థులు రూ.1300, ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులు రూ.1000 చెల్లించాలి).

ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌, దరఖాస్తులకు చివరి తేదీ: 24-09-2022.

పరీక్ష తేదీలు: 16-10-2022 నుంచి 19-10-2022 వరకు.

వెబ్‌సైట్‌: https://cets.apsche.ap.gov.in/RCET/RCET/RCET_HomePage.aspx


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని