Published : 29 Sep 2022 00:57 IST

నోటిఫికేషన్స్‌

ఉద్యోగాలు

మేనేజర్‌, స్టాఫ్‌ అసిస్టెంట్‌ పోస్టులు
తెలంగాణ స్టేట్‌ కో-ఆపరేటివ్‌ అపెక్స్‌ బ్యాంక్‌ లిమిటెడ్‌  తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న టీస్‌సీఏబీ శాఖల్లో 40 మేనేజర్‌, స్టాఫ్‌ అసిస్టెంట్‌ పోస్టుల భర్తీకి వేర్వేరు దరఖాస్తులు కోరుతోంది.
* మేనేజర్‌(స్కేల్‌-1): 27 పోస్టులు *స్టాఫ్‌ అసిస్టెంట్‌: 13 పోస్టులు
అర్హత: 55% మొత్తం మార్కులతో ఏదైనా డిగ్రీ/ డిగ్రీ(కామర్స్‌) ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థులకు తెలంగాణ రాష్ట్ర స్థానికతతో పాటు తెలుగు భాషలో ప్రావీణ్యం అవసరం.
వయసు: 01.09.2022 నాటికి 20 నుంచి 28 సంవత్సరాల మధ్య ఉండాలి.
ఎంపిక: మేనేజర్‌ పోస్టులకు ప్రిలిమినరీ ఎగ్జామినేషన్‌(ఆబ్జెక్టివ్‌), మెయిన్‌ ఎగ్జామినేషన్‌(ఆబ్జెక్టివ్‌ అండ్‌ డిస్క్రిప్టివ్‌) ఆధారంగా. స్టాఫ్‌ అసిస్టెంట్‌ పోస్టుకు ప్రిలిమినరీ ఎగ్జామినేషన్‌(ఆబ్జెక్టివ్‌), మెయిన్‌ ఎగ్జామినేషన్‌(ఆబ్జెక్టివ్‌) ఆధారంగా
దరఖాస్తు రుసుము: రూ.950 (ఎస్సీ, ఎస్టీ, పీసీ అభ్యర్థులకు రూ.250).
పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్‌, కరీంనగర్‌, ఖమ్మం, మహబూబ్‌నగర్‌, నల్గొండ, నిజామాబాద్‌, వరంగల్‌.
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు తుది గడువు: 16.10.2022.
దరఖాస్తు రుసుము చెల్లింపు: 28.09.2022 నుంచి 16.10.2022 వరకు.
ఆన్‌లైన్‌ ప్రిలిమినరీ పరీక్ష: నవంబర్‌, 2022.
వెబ్‌సైట్‌:
 https://tscab.org/

భువనేశ్వర్‌ ఎయిమ్స్‌లో ...
ఒడిశా రాష్ట్రం భువనేశ్వర్‌లోని ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (ఎయిమ్స్‌) 99 సీనియర్‌ రెసిడెంట్స్‌ (నాన్‌-అకడమిక్‌) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
విభాగాలు: అనస్థీషియాలజీ, అనాటమీ, బయోకెమిస్ట్రీ, డెంటిస్ట్రీ, డెర్మటాలజీ, ఎండోక్రినాలజీ, ఈఎన్‌టీ, గ్యాస్ట్రో ఎంటరాలజీ, జనరల్‌ మెడిసిన్‌, జనరల్‌ సర్జరీ, మైక్రోబయాలజీ, ఆప్తాల్మాలజీ, ఆర్థోపెడిక్స్‌, పీడియాట్రిక్‌ సర్జరీ, పీడియాట్రిక్స్‌, పాథాలజీ, ఫార్మకాలజీ తదితరాలు.
అర్హత: ఎంబీబీఎస్‌, ఎంఎస్‌, ఎండీ, డీఎన్‌బీ ఉత్తీర్ణత.
వయసు: 45 సంవత్సరాలు మించకూడదు.
ఎంపిక: రాత పరీక్ష, పర్సనల్‌ ఇంటర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు రుసుము: రూ.1500, ట్రాన్సాక్షన్‌ ఛార్జీలు (ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు రూ.1200, ట్రాన్సాక్షన్‌ ఛార్జీలు, దివ్యాంగులకు దరఖాస్తు రుసుము లేదు)
ఈ-మెయిల్‌: 
academic@aiimsbhubnaeswar.edu.in
ఈ-మెయిల్‌ ద్వారా దరఖాస్తుకు చివరి తేదీ: 30-09-2022
స్పీడ్‌ పోస్టు ద్వారా దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ: 08-10-2022.
వెబ్‌సైట్‌:
 https://www.aiims.edu/en.html

ఐటీబీపీలో హెడ్‌ కానిస్టేబుల్‌ ఖాళీలు
ఇండో-టిబెటన్‌ బోర్డర్‌ పోలీస్‌ ఫోర్స్‌ (ఐటీబీపీ) గ్రూప్‌-సి విభాగంలో హెడ్‌ కానిస్టేబుల్‌ (ఎడ్యుకేషన్‌ అండ్‌ స్ట్రెస్‌ కౌన్సెలర్‌) ఖాళీల నియామకానికి దరఖాస్తులు కోరుతోంది.
హెడ్‌ కానిస్టేబుల్‌ (ఎడ్యుకేషన్‌ అండ్‌ స్ట్రెస్‌ కౌన్సెలర్‌): 23 పోస్టులు (పురుషులు- 20, మహిళలు- 03)
అర్హత: డిగ్రీ(సైకాలజీ) లేదా డిగ్రీ, బ్యాచిలర్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ ఉత్తీర్ణత.
వయసు: 11-11-2022 నాటికి 20 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి.
ఎంపిక: ఫిజికల్‌ ఎఫిషియెన్సీ టెస్ట్‌, ఫిజికల్‌ స్టాండర్డ్‌ టెస్ట్‌, రాత పరీక్ష, డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌, మెడికల్‌ ఎగ్జామినేషన్‌, రివ్యూ మెడికల్‌ ఎగ్జామ్‌ ఆధారంగా.
దరఖాస్తు రుసుము: రూ.100 (ఎస్సీ, ఎస్టీ, మాజీ సైనికోద్యోగులు, మహిళలకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది).
ఆన్‌లైన్‌ దరఖాస్తులు ప్రారంభం: 13-10-2022.
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 11-11-2022.
వెబ్‌సైట్‌: 
https://itbpolice.nic.in/


ప్రవేశాలు

జేఎన్‌టీయూలో ఎంబీఏ

హైదరాబాద్‌లోని జవహర్‌లాల్‌ నెహ్రూ టెక్నలాజికల్‌ యూనివర్సిటీ, యూఎస్‌ఏలోని సెంట్రల్‌ మిచిగాన్‌ విశ్వవిద్యాలయం సహకారంతో 2022-23 విద్యా సంవత్సరానికి ఎంబీఏ ప్రోగ్రాంలో ప్రవేశానికి ఆన్‌లైన్‌ దరఖాస్తులు కోరుతోంది.
సీట్ల సంఖ్య: 20.
అర్హత: బీఈ, బీటెక్‌, బీఫార్మసీ, బీఎస్సీ(అగ్రి), బీడీఎస్‌, ఎంఏ, ఎంకాం, ఎంఎస్సీ ఉత్తీర్ణత.
ప్రవేశం: రాత పరీక్షలో ప్రతిభ ఆధారంగా.
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 21.10.2022.
ప్రవేశ పరీక్ష తేదీ: 04.11.2022.
పరీక్ష కేంద్రం: జేఎన్‌టీయూహెచ్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌, కూకట్‌పల్లి, హైదరాబాద్‌.
వెబ్‌సైట్‌: 
https://doa.jntuh.ac.in/

బెంగళూరు నిమ్‌హాన్స్‌లో ...
బెంగళూరులోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెంటల్‌ హెల్త్‌ అండ్‌ న్యూరోసైన్సెస్‌ 2022-23 విద్యా సంవత్సరంలో సెషన్‌ 2 కింద ఈ కింది కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
విభాగాలు: బయోఫిజిక్స్‌, బయోస్టాటిస్టిక్స్‌, ఛైల్డ్‌ అండ్‌ అడాలసెంట్‌ సైకియాట్రీ, క్లినికల్‌ సైకాలజీ, క్లినికల్‌ సైకోఫార్మకాలజీ అండ్‌ న్యూరోటాక్సికాలజీ, హ్యూమన్‌ జెనెటిక్స్‌, మెంటల్‌ హెల్త్‌ ఎడ్యుకేషన్‌, న్యూరోకెమిస్ట్రీ, న్యూరోఇమేజింగ్‌ అండ్‌ ఇంటర్వెన్షనల్‌ రేడియాలజీ, న్యూరాలజీ, న్యూరోలాజికల్‌ రిహాబిలిటేషన్‌, న్యూరో మైక్రోబయాలజీ, న్యూరో పాథాలజీ, న్యూరో ఫిజియాలజీ, నర్సింగ్‌, సైకియాట్రి తదితరాలు.

పోస్ట్‌ డాక్టోరల్‌ ఫెలోషిప్‌ కోర్సులు:

విభాగాలు: ఎపిలెప్సి, మూవ్‌మెంట్‌ డిజార్డర్స్‌, న్యూరోమస్కులర్‌ డిజార్డర్స్‌.
అర్హత: బీఈ, బీటెక్‌, ఎంబీబీఎస్‌, ఎంఫిల్‌, మాస్టర్స్‌ డిగ్రీ, ఎండీ, డీఎన్‌బీ, ఎంఈ, ఎంటెక్‌
కోర్సు వ్యవధి: 3 నుంచి 5 సంవత్సరాలు.
వయసు: 40 సంవత్సరాలు.
ఎంపిక: ప్రవేశ పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా.
ఆఫ్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 22.10.2022.
ప్రవేశ పరీక్ష తేదీ: 24.11.2022.
వెబ్‌సైట్‌: 
https://nimhans.ac.in/


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts