నోటిఫికేషన్స్‌

న్యూదిల్లీలోని నేషనల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఎడ్యుకేషనల్‌ రిసెర్చ్‌ అండ్‌ ట్రైనింగ్‌.. అజ్‌మేర్‌, భోపాల్‌, భువనేశ్వర్‌, మైసూరు, షిల్లాంగ్‌లలో ఉన్న ఎన్‌సీఈఆర్‌టీ యూనిట్లలో డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ప్రాతిపదికన 292 అకడమిక్‌ పోస్టుల భర్తీకి ఆన్‌లైన్‌ దరఖాస్తులు కోరుతోంది.

Published : 11 Oct 2022 00:18 IST

ఉద్యోగాలు
ఎన్‌సీఈఆర్‌టీలో 292 అకడమిక్‌ పోస్టులు

న్యూదిల్లీలోని నేషనల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఎడ్యుకేషనల్‌ రిసెర్చ్‌ అండ్‌ ట్రైనింగ్‌.. అజ్‌మేర్‌, భోపాల్‌, భువనేశ్వర్‌, మైసూరు, షిల్లాంగ్‌లలో ఉన్న ఎన్‌సీఈఆర్‌టీ యూనిట్లలో డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ప్రాతిపదికన 292 అకడమిక్‌ పోస్టుల భర్తీకి ఆన్‌లైన్‌ దరఖాస్తులు కోరుతోంది.

పోస్టులు: ప్రొఫెసర్‌, అసోసియేట్‌ ప్రొఫెసర్‌, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌, లైబ్రేరియన్‌, అసిస్టెంట్‌ లైబ్రేరియన్‌, ఆఫీస్‌ మేనేజ్‌మెంట్‌/ స్టెనోగ్రఫీ.
అర్హతలు: సంబంధిత విభాగంలో పీజీ, పీహెచ్‌డీ, నెట్‌, స్లెట్‌, సెట్‌ ఉత్తీర్ణతతో పాటు పరిశోధన/ బోధన అనుభవం ఉండాలి.
దరఖాస్తు రుసుము: రూ.1000 (మహిళలు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజు మినహాయింపు ఉంటుంది).
ఎంపిక: ఇంటర్వ్యూ ఆధారంగా.  
ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌, దరఖాస్తుకు చివరి తేదీ: 28.10.2022.
వెబ్‌సైట్‌: 
https://ncert.nic.in/


సశస్త్ర సీమ బల్‌లో 399 కానిస్టేబుల్‌ పోస్టులు

కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన న్యూదిల్లీలోని డైరెక్టరేట్‌ జనరల్‌, సశస్త్ర సీమ బల్‌ (ఎస్‌ఎస్‌బీ).. తాత్కాలిక ప్రాతిపదికన స్పోర్ట్స్‌ కోటాలో 399 కానిస్టేబుల్‌ పోస్టుల భర్తీకి పురుష, మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

అర్హత: టెన్త్‌ ఉత్తీర్ణత. నిర్దేశించిన క్రీడా ఈవెంట్లలో పాల్గొని ఉండాలి.
వయసు: 18-23 సంవత్సరాల మధ్య ఉండాలి.
ఎంపిక: క్రీడా విజయాలు, రాత పరీక్ష, ఫీల్డ్‌ ట్రయల్‌, స్కిల్‌ టెస్ట్‌, ఫిజికల్‌ స్టాండర్డ్‌ టెస్ట్‌, మెడికల్‌ ఎగ్జామినేషన్‌ ఆధారంగా.
దరఖాస్తు రుసుము: రూ.100 (ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంటుంది).
దరఖాస్తుకు చివరితేదీ: ఎంప్లాయిమెంట్‌ న్యూస్‌లో ఈ ప్రకటన వెలువడిన తేదీ నుంచి 30 రోజుల్లోపు.

వెబ్‌సైట్‌: 
http://www.ssbrectt.gov.in/


ఐఐటీ-తిరుపతిలో 39 వివిధ ఖాళీలు

తిరుపతిలోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఐఐటీ) 39 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

పోస్టులు: అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌, జూనియర్‌ సూపరింటెండెంట్‌, జూనియర్‌ అసిస్టెంట్‌, జూనియర్‌ లైబ్రరీ టెక్నీషియన్‌ తదితరాలు.
విభాగాలు: సివిల్‌, కంప్యూటర్‌ సెంటర్‌ సిస్టమ్‌, కెమికల్‌ ఇంజినీరింగ్‌, వర్క్‌షాప్‌, ఫిజిక్స్‌, లైబ్రరీ, అడ్మినిస్ట్రేషన్‌ తదితరాలు.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో ఎస్‌ఎస్‌ఎల్‌సీ/ ఐటీఐ/ బ్యాచిలర్స్‌ డిగ్రీ/ బీఎస్సీ/ బీసీఏ/ బీఈ/ బీటెక్‌/ డిప్లొమా/ ఎంఎస్సీ/ ఎంసీఏ/ పీజీ ఉత్తీర్ణత.
ఎంపిక: స్క్రీనింగ్‌/ స్కిల్‌ టెస్ట్‌/ ఇంటర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు ఫీజు: రూ.500
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 10.11.2022
వెబ్‌సైట్‌:
https://iittp.ac.in/recruitment


ఇండియన్‌ ఆర్మీలో 128 రెలిజియస్‌ టీచర్‌ పోస్టులు

ఇండియన్‌ ఆర్మీ.. ఆర్‌ఆర్‌టీ 91, 92 కోర్సుల్లో జూనియర్‌ కమిషన్డ్‌ ఆఫీసర్లుగా 128 రెలిజియస్‌ టీచర్ల నియామకానికి సంబంధించి పురుష అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్‌ దరఖాస్తులు కోరుతోంది.

వయసు: 01-10-2022 నాటికి 25 నుంచి 36 సంవత్సరాల మధ్య ఉండాలి.
అర్హత: సంబంధిత విభాగంలో డిప్లొమా/ డిగ్రీ ఉత్తీర్ణత.
ఎంపిక: ఫిజికల్‌ స్టాండర్డ్‌, ఫిట్‌నెస్‌ టెస్ట్‌, మెడికల్‌ టెస్ట్‌, రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా.
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 06-11-2022.
వెబ్‌సైట్‌: 
https://www.joinindianarmy.nic.in/ Authentication.aspx


ఇండియా సెక్యూరిటీ ప్రెస్‌-నాసిక్‌రోడ్‌లో 85 ఖాళీలు

ఇండియా సెక్యూరిటీ ప్రెస్‌(ఐఎస్‌పీ), నాసిక్‌రోడ్‌ 85 జూనియర్‌ టెక్నీషియన్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

విభాగాలు: టెక్నికల్‌, కంట్రోల్‌, మెషిన్‌షాప్‌, ఎలక్ట్రానిక్‌, స్టోర్‌, సీఎస్‌డీ తదితరాలు.
అర్హత: సంబంధిత స్పెషలైజేషన్‌లో ఐటీఐ/ డిప్లొమా ఉత్తీర్ణత.
వయసు: 25 ఏళ్లు మించకూడదు.
పరీక్ష ఫీజు: రూ.600
ఎంపిక: ఆన్‌లైన్‌ పరీక్ష ద్వారా.
పరీక్షలో: జనరల్‌ అవేర్‌నెస్‌, ఇంగ్లిష్‌ ల్యాంగ్వేజి, లాజికల్‌ రీజనింగ్‌, క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌ నుంచి ప్రశ్నలు ఇస్తారు.
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 08.11.2022
వెబ్‌సైట్‌:
https://ispnasik./~pmcil.com/Interface/ JobOpenings.aspx?menue=5


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని