ఉద్యోగాలు

న్యూదిల్లీలోని ఎన్‌టీపీసీ లిమిటెడ్‌ 864 ఇంజినీరింగ్‌ ఎగ్జిక్యూటివ్‌ ట్రైనీ ఖాళీల భర్తీకి అర్హులైన గ్రాడ్యుయేట్‌ ఇంజినీర్ల నుంచి ఆన్‌లైన్‌ దరఖాస్తులు కోరుతోంది.

Published : 17 Oct 2022 00:12 IST

864 ఇంజినీరింగ్‌ ఎగ్జిక్యూటివ్‌ ట్రైనీలు

న్యూదిల్లీలోని ఎన్‌టీపీసీ లిమిటెడ్‌ 864 ఇంజినీరింగ్‌ ఎగ్జిక్యూటివ్‌ ట్రైనీ ఖాళీల భర్తీకి అర్హులైన గ్రాడ్యుయేట్‌ ఇంజినీర్ల నుంచి ఆన్‌లైన్‌ దరఖాస్తులు కోరుతోంది.
విభాగాలు: ఎలక్ట్రికల్‌, మెకానికల్‌, ఎలక్ట్రానిక్స్‌, ఇన్‌స్ట్రుమెంటేషన్‌, సివిల్‌, మైనింగ్‌.
అర్హత: కనీసం 65 శాతం మార్కులతో (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు 55 శాతం) బ్యాచిలర్‌ డిగ్రీ(ఇంజినీరింగ్‌/ టెక్నాలజీ) ఉత్తీర్ణతతో పాటు గేట్‌-2022కి హాజరై ఉండాలి.
వయసు: ఆన్‌లైన్‌ దరఖాస్తు గడువు నాటికి 27 ఏళ్లు మించకూడదు.
ఎంపిక: గేట్‌-2022 స్కోరు తదితరాల ఆధారంగా.
ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభం: 28.10.2022.
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 11.11.2022.

వెబ్‌సైట్‌: https://careers.ntpc.co.in/openings.php


ఎంటీఎస్‌, ల్యాబ్‌ టెక్నీషియన్‌ పోస్టులు

దిల్లీ/ఎన్‌సీఆర్‌/ ఝజ్జర్‌లోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఔట్‌సోర్స్‌ ప్రాతిపదికన కింది ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నారు.
1. ఎంటీఎస్‌(ఫిమేల్‌): 10 పోస్టులు
2. ల్యాబ్‌ టెక్నీషియన్‌: 02 పోస్టులు
3. ఆపరేషన్‌ థియేటర్‌ అసిస్టెంట్‌: 03 పోస్టులు

అర్హత: పోస్టును అనుసరించి మెట్రిక్యులేషన్‌, 10+2, డిప్లొమా, బీఎస్సీ, బీఎస్సీ(ఎంఎల్‌టీ) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం.  
ఎంపిక: రాత పరీక్ష, స్కిల్‌ టెస్ట్‌, ఇంటర్వ్యూ ఆధారంగా.
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 27.10.2022.

వెబ్‌సైట్‌: https://www.becil.com/


రైల్వేలో స్పోర్ట్స్‌ పర్సన్‌ ఖాళీలు

గువాహటిలోని నార్త్‌ ఈస్ట్‌ ఫ్రాంటియర్‌ రైల్వే 16 స్పోర్ట్స్‌ పర్సన్‌ పోస్టుల నియామకానికి దరఖాస్తులు కోరుతోంది.
ఈవెంట్‌లు: అథ్లెటిక్స్‌, అర్చరీ, టెన్నిస్‌, బాస్కెట్‌బాల్‌, టేబుల్‌ టెన్నిస్‌, వాలీబాల్‌, బాక్సింగ్‌, వెయిట్‌ లిఫ్టింగ్‌, క్రికెట్‌.
అర్హత: 12వ తరగతి, ఐటీఐ ఉత్తీర్ణతతోపాటు వివిధ స్థాయుల క్రీడాంశాల్లో అర్హత సాధించి ఉండాలి.
వయసు: 18 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి.
ఎంపిక: ట్రయల్‌ ఆఫ్‌ స్పోర్ట్స్‌ పెర్ఫార్మెన్స్‌, ఇంటర్వ్యూ, క్రీడాంశాల్లో ప్రతిభ, విద్యార్హత తదితరాల ఆధారంగా.
దరఖాస్తు: ఆఫ్‌లైన్‌ దరఖాస్తులను పోస్టు ద్వారా సీనియర్‌ పర్సనల్‌ ఆఫీసర్‌ (రిక్రూట్‌మెంట్‌), నార్త్‌ ఈస్ట్‌ ఫ్రాంటియర్‌ రైల్వే హెచ్‌క్యూ, మాలిగావ్‌, గువాహటి, అసోం చిరునామాకు పంపాలి.
దరఖాస్తుకు చివరి తేదీ: 07.11.2022.

వెబ్‌సైట్‌: https://nfr.indianrailways.gov.in/


నైనిటాల్‌ బ్యాంకులో మేనేజ్‌మెంట్‌ ట్రైనీలు

నైనిటాల్‌ బ్యాంక్‌ లిమిటెడ్‌ ఉత్తరాఖండ్‌, ఉత్తరప్రదేశ్‌, దిల్లీ, హరియాణా, రాజస్థాన్‌లోని ఎన్‌బీఎల్‌ శాఖల్లో 40 మేనేజ్‌మెంట్‌ ట్రైనీ ఖాళీల భర్తీకి  దరఖాస్తులు కోరుతోంది.
అర్హత: కనీసం 50% మార్కులతో గ్రాడ్యుయేషన్‌/ పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌. కంప్యూటర్‌ ఆపరేషన్స్‌పై అవగాహన తప్పనిసరి. బ్యాంకింగ్‌/ ఫైనాన్షియల్‌/ ఇన్‌స్టిట్యూషన్స్‌/ ఎన్‌బీఎఫ్‌సీలలో 1-2 సంవత్సరాల అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యం ఉంటుంది.
వయసు: 30.09.2022 నాటికి 21- 33 సంవత్సరాల మధ్య ఉండాలి.
ఎంపిక: ఆన్‌లైన్‌ రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు ఫీజు: రూ.1000.
ఆన్‌లైన్‌ దరఖాస్తు, ఫీజు చెల్లింపు చివరి తేదీ: 25.10.2022.
పరీక్ష నిర్వహణ తేదీ: 13.11.2022.

వెబ్‌సైట్‌: ‌ www.nainitalbank.co.in


మేనేజ్‌మెంట్‌ ట్రైనీ, మేనేజర్‌ ఖాళీలు

ముంబయిలోని ఎక్స్‌పోర్ట్‌-ఇంపోర్ట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా మేనేజ్‌మెంట్‌ ట్రైనీల నియామకానికి ఎస్సీ, ఎస్టీ, ఇతర వెనుకబడిన తరగతుల కోసం స్పెషల్‌ రిక్రూట్‌మెంట్‌ డ్రైవ్‌ నిర్వహిస్తోంది.
1. మేనేజర్‌(లా): 02 పోస్టులు
2. మేనేజర్‌(ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ): 02 పోస్టులు
3. మేనేజ్‌మెంట్‌ ట్రైనీ(కార్పొరేట్‌ లోన్‌లు అండ్‌ అడ్వాన్స్‌లు/ ప్రాజెక్ట్‌ ఫైనాన్స్‌/ క్రెడిట్‌ లైన్స్‌/ ఇంటర్నల్‌ క్రెడిట్‌ ఆడిట్‌/ రిస్క్‌ మేనేజ్‌మెంట్‌/ కంప్లయన్స్‌/ ట్రెజరీ అండ్‌ అకౌంట్స్‌/ రికవరీ తదితరాలు): 41 పోస్టులు
అర్హత:  బ్యాచిలర్స్‌ డిగ్రీ(లా), బీఈ, బీటెక్‌, ఎంబీఏ, పీజీడీబీఏ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం.
ఎంపిక: ఆన్‌లైన్‌ టెస్ట్‌, పర్సనల్‌ ఇంటర్వ్యూ ఆధారంగా.
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 04-11-2022.
ఆన్‌లైన్‌ పరీక్ష తేదీలు: నవంబర్‌ - డిసెంబర్‌ 2022.
ఇంటర్వ్యూ తేదీలు: జనవరి - ఫిబ్రవరి 2023.

వెబ్‌సైట్‌: https://www.eximbankindia.in/


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని