నోటిఫికేషన్స్‌

ఎయిర్‌ ఫోర్స్‌ కామన్‌ అడ్మిషన్‌ టెస్ట్‌ (ఏఎఫ్‌ క్యాట్‌) - 01/2023 ప్రకటన విడుదలైంది.

Updated : 28 Nov 2022 04:57 IST

ప్రభుత్వ ఉద్యోగాలు

ఎయిర్‌ ఫోర్స్‌ కామన్‌ అడ్మిషన్‌ టెస్ట్‌ (ఏఎఫ్‌ క్యాట్‌)

ఎయిర్‌ ఫోర్స్‌ కామన్‌ అడ్మిషన్‌ టెస్ట్‌ (ఏఎఫ్‌ క్యాట్‌) - 01/2023 ప్రకటన విడుదలైంది.

1. ఫ్లయింగ్‌ బ్రాంచి ఖాళీలు : 10 (పురుషులు- 5, మహిళలు- 5)
2. గ్రౌండ్‌ డ్యూటీ(టెక్నికల్‌): 130 (పురుషులు- 117, మహిళలు- 13)
బ్రాంచ్‌: ఏరోనాటికల్‌ ఇంజినీరింగ్‌
3. గ్రౌండ్‌ డ్యూటీ(నాన్‌-టెక్నికల్‌): 118(పురుషులు- 103, మహిళలు- 15)
బ్రాంచ్‌: వెపన్‌ సిస్టమ్‌, అడ్మినిస్ట్రేషన్‌, ఎల్‌జీఎస్‌, అకౌంట్స్‌, ఎడ్యుకేషన్‌, మెటియోరాలజీ
మొత్తం ఖాళీల సంఖ్య: 258.
అర్హతలు: ఫ్లయింగ్‌ బ్రాంచ్‌ పోస్టులకు ఏదైనా సాధారణ డిగ్రీ లేదా బీఈ/ బీటెక్‌ పూర్తిచేసుకున్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంటర్లో మ్యాథ్స్‌, ఫిజిక్స్‌ తప్పనిసరి. ఆఖరు సంవత్సరం కోర్సులు చదువుతున్న విద్యార్థులు కూడా అర్హులే. కనీస ఎత్తు 162.5 సె.మీ ఉండాలి.
* గ్రౌండ్‌ డ్యూటీ టెక్నికల్‌ పోస్టులకు ఏరోనాటికల్‌ ఇంజినీరింగ్‌ (ఎలక్ట్రానిక్స్‌/మెకానికల్‌) విభాగాల్లో లేదా అనుంబంధ బ్రాంచీల్లో బీటెక్‌/బీఈ పూర్తిచేసి ఉండాలి. ఇంటర్‌ ఫిజిక్స్‌, మ్యాథ్స్‌ ఉత్తీర్ణత తప్పనిసరి. పురుషులు 157.5 సెం.మీ., మహిళలు 152.5 సెం.మీ. ఎత్తు ఉండాలి.
* గ్రౌండ్‌ డ్యూటీ (నాన్‌ టెక్నికల్‌) పోస్టుల్లో వివిధ విభాగాలను అనుసరించి ఇంటర్‌లో మ్యాథ్స్‌, ఫిజిక్స్‌ సబ్జెక్టుల్లో ఉత్తీర్ణత, ఏదైనా డిగ్రీ లేదా బీఈ/ బీటెక్‌లేదా బీకాం/ బీఎస్సీ/ బీబీఏ/ సీఏ/ సీఎంఏ/ సీఎస్‌/ సీఎఫ్‌ఏ, పీజీ ఉత్తీర్ణత ఉండాలి. పురుషులు 157.5 సెం.మీ., మహిళలు 152.5 సెం.మీ. ఎత్తు ఉండాలి.
* ఎన్‌సీసీ స్పెషల్‌ ఎంట్రీ విభాగంలో దరఖాస్తు చేసుకున్నవారికి ఎన్‌సీసీ సీనియర్‌ డివిజన్‌ సి సర్టిఫికెట్‌ ఉండాలి.  
వయసు: ఫ్లయింగ్‌ బ్రాంచి పోస్టులకు జనవరి 1, 2024 నాటికి 20 నుంచి 24 ఏళ్లలోపు ఉండాలి. గ్రౌండ్‌ డ్యూటీ టెక్నికల్‌/ నాన్‌ టెక్నికల్‌ బ్రాంచీలకు 20 నుంచి 26 ఏళ్లలోపు ఉండాలి. అవివాహితులకే అవకాశం.
జీత భత్యాలు: శిక్షణ సమయంలో నెలకు రూ.56,100 చొప్పున స్ట్టైపెండ్‌ అందుతుంది. శిక్షణ అనంతరం ఫ్లయింగ్‌ ఆఫీసర్‌ ర్యాంకుతో రూ.56,100 మూలవేతనం,  డీఏ, హెచ్‌ఆర్‌ఎ, ఇతర అలవెన్సులు ఉంటాయి. ఎంఎస్‌పీ రూ.15,500 ఇస్తారు. ఇతర సౌకర్యాలూ ఉంటాయి.
ఎంపిక: పోస్టును అనుసరించి ఆన్‌లైన్‌ పరీక్ష, స్టేజ్‌-1, స్టేజ్‌-2 పరీక్షలు, ఇంటర్వ్యూ, కంప్యూటరైజ్డ్‌ పైలట్‌ సెలక్షన్‌ సిస్టం (సీపీఎస్‌ఎస్‌) పరీక్ష, వైద్య పరీక్షలు, ధ్రువపత్రాల పరిశీలన నిర్వహించి శిక్షణకు ఎంపిక చేస్తారు.  
పరీక్ష రుసుం: రూ.250.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేయాలి.
ఆన్‌లైన్‌ దరఖాస్తు తేదీలు: 01-12-2022 నుంచి 30-12-202 వరకు.
ఆన్‌లైన్‌ పరీక్ష తేదీలు: ఫిబ్రవరి 24, 25, 26.
శిక్షణ ప్రారంభం: జనవరి 2024 నుంచి.
వెబ్‌సైట్‌: https://afcat.cdac.in/AFCAT/


సెయిల్‌, రవుర్కెలాలో మేనేజర్‌ పోస్టులు

ప్రభుత్వ రంగ సంస్థ- స్టీల్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ రవుర్కెలాలోని సెయిల్‌ ప్లాంటు, ఒడిశా గ్రూప్‌ ఆఫ్‌ మైన్స్‌లో 17 మేనేజర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
1. మేనేజర్‌ (బాయిలర్‌ ఆపరేషన్‌): 09 పోస్టులు
2. మేనేజర్‌ (ప్రాజెక్టులు): 04 పోస్టులు
3. మేనేజర్‌ (ఆటోమేషన్‌): 04 పోస్టులు
అర్హత: సంబంధిత విభాగంలో బీఈ/ బీటెక్‌తో పాటు పని అనుభవం.
వయసు: 14/12/2022 నాటికి మేనేజర్‌- బాయిలర్‌ ఆపరేషన్‌ పోస్టులకు 37 ఏళ్లు, మిగిలిన ఖాళీలకు 35 ఏళ్లు మించకూడదు.
జీత భత్యాలు: రూ.80,000 - రూ.2,20,000.
ఎంపిక: రాత పరీక్ష (కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌), ఇంటర్వ్యూ ఆధారంగా .
దరఖాస్తు రుసుము: రూ.700 (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్‌ సర్వీస్‌మెన్‌ అభ్యర్థులకు రూ.200).
దరఖాస్తు: ఆఫ్‌లైన్‌ దరఖాస్తులను ‘డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌ (పి అండ్‌ జి), బ్లాక్‌ ఇ, గ్రౌండ్‌ ఫ్లోర్‌, అడ్మినిస్ట్రేషన్‌ బిల్డింగ్‌, రవుర్కెలా స్టీల్‌ ప్లాంట్‌, రవుర్కెలా, ఒడిశా’ చిరునామాకు పంపించాలి.
దరఖాస్తులకు చివరి తేదీ: 14.12.2022.
వెబ్‌సైట్‌:https://sail.co.in/


సెయిల్‌లో మేనేజ్‌మెంట్‌ ట్రైనీ పోస్టులు

ప్రభుత్వ రంగ సంస్థ- స్టీల్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ దేశ వ్యాప్తంగా ఉన్న సెయిల్‌ ప్లాంట్లు, మైన్స్‌, యూనిట్‌లలో 51 మేనేజ్‌మెంట్‌ ట్రైనీ (అడ్మినిస్ట్రేషన్‌) పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
అర్హత: సంబంధిత విభాగంలో బ్యాచిలర్స్‌ డిగ్రీ/ సీఏ/ సీఎంఏ/ ఎంబీఏ/ పీజీ.
వయసు: 18-12-2022 నాటికి 18 నుంచి 28 సంవత్సరాల మధ్య ఉండాలి.
దరఖాస్తు రుసుము: రూ.700 (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్‌ సర్వీస్‌మెన్‌ ్థలకు రూ.200).
జీత భత్యాలు: నెలకు రూ.6000-1,80,000.
ఎంపిక: ఆన్‌లైన్‌ పరీక్ష, గ్రూప్‌ డిస్కషన్‌, ఇంటర్వ్యూ ఆధారంగా.
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 18.12.2022.
ఆన్‌లైన్‌ పరీక్ష తేదీ: 29.01.2023.
వెబ్‌సైట్‌: https://www.sail.co.in/en/home


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని