సీపీసీబీలో 163 పోస్టులు

రాత పరీక్ష, స్కిల్‌/ ట్రేడ్‌ టెస్ట్‌, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. రాత పరీక్షలో కనీసార్హత మార్కులు పొందిన అభ్యర్థులను మాత్రమే తదుపరి దశకు ఎంపికచేస్తారు. 

Published : 16 Mar 2023 00:16 IST

దిల్లీలోని భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన సెంట్రల్‌ పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డ్‌ (సీపీసీబీ)ను కాలుష్య నియంత్రణకు ఏర్పాటుచేశారు. ప్రజల ఆరోగ్యం, పర్యావరణం కాలుష్యం బారినపడకుండా కాపాడటమే దీని లక్ష్యం. ఈ సంస్థ తాజాగా 163 పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది.

రాత పరీక్ష, స్కిల్‌/ ట్రేడ్‌ టెస్ట్‌, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. రాత పరీక్షలో కనీసార్హత మార్కులు పొందిన అభ్యర్థులను మాత్రమే తదుపరి దశకు ఎంపికచేస్తారు. 

ఏ అర్హతలు?

1. సైంటిస్ట్‌-బి పోస్టులకు సివిల్‌/కెమికల్‌/ఎన్విరాన్‌మెంటల్‌ ఇంజినీరింగ్‌లో డిగ్రీ ఉండాలి. ఇంజినీరింగ్‌/టెక్నాలజీలో మాస్టర్స్‌ డిగ్రీ ఉన్నవారికి ప్రాధాన్యం. లేదా కెమిస్ట్రీ/ ఎన్విరాన్‌మెంటల్‌ సైన్స్‌లో మాస్టర్స్‌ డిగ్రీ, నెట్‌ అర్హత/ పీహెచ్‌డీ ఉన్నవారికి ప్రాధాన్యం.

2. సీనియర్‌ సైంటిఫిక్‌ అసిస్టెంట్‌ పోస్టుకు సైన్స్‌లో మాస్టర్స్‌ డిగ్రీ, సంబంధిత రంగంలో రెండేళ్ల అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యం.

3. అప్పర్‌ డివిజన్‌ క్లర్క్‌ పోస్టుకు డిగ్రీ ఉండాలి. కంప్యూటర్‌పై ఇంగ్లిష్‌లో నిమిషానికి 35 పదాలు లేదా హిందీలో 30 పదాలు టైప్‌ చేయగలగాలి.

4. జూనియర్‌ ల్యాబొరేటరీ అసిస్టెంట్‌ పోస్టుకు సైన్స్‌ సబ్జెక్టుతో ఇంటర్మీడియట్‌ పాసవ్వాలి. సైన్స్‌ సబ్జెక్టుతో డిగ్రీ పాసైనవారికి ప్రాధాన్యమిస్తారు.

5. లోయర్‌ డివిజన్‌ క్లర్క్‌ పోస్టుకు ఇంటర్మీడియట్‌/తత్సమాన పరీక్ష పాసవ్వాలి. కంప్యూటర్‌పైన ఇంగ్లిష్‌లో నిమిషానికి 35 పదాలు లేదా హిందీలో 30 పదాలు టైప్‌ చేయగలగాలి.

6. ఫీల్డ్‌ అటెండెంట్‌ పోస్టుకు పదోతరగతి పాసవ్వాలి. సైన్స్‌ సబ్జెక్టుతో ఇంటర్మీడియట్‌ పాసవ్వాలి. ఈత వచ్చిన వారికి ప్రాధాన్యమిస్తారు.

7. మల్టీ టాస్కింగ్‌ స్టాఫ్‌ పోస్టుకు పదోతరగతి పాసవ్వాలి.

వయసు: సైంటిస్ట్‌ ‘బి’ పోస్టుకు గరిష్ఠ వయసు 35 సంవత్సరాలు. అసిస్టెంట్‌ లా ఆఫీసర్‌, అసిస్టెంట్‌ అకౌంట్స్‌ ఆఫీసర్‌, సీనియర్‌ సైంటిఫిక్‌ అసిస్టెంట్‌, టెక్నికల్‌ సూపర్‌వైజర్‌, అసిస్టెంట్‌, అకౌంట్స్‌ అసిస్టెంట్‌ పోస్టులకు గరిష్ఠ వయసు 30 సంవత్సరాలు. జూనియర్‌ టెక్నీషియన్‌, సీనియర్‌ ల్యాబొరేటరీ అసిస్టెంట్‌, అప్పర్‌ డివిజన్‌ క్లర్క్‌, డేటా ఎంట్రీ ఆపరేటర్‌, జూనియర్‌ ల్యాబొరేటరీ అసిస్టెంట్‌, లోయర్‌ డివిజన్‌ క్లర్క్‌, ఫీల్డ్‌ అటెండెంట్‌, మల్టీ టాస్కింగ్‌ స్టాఫ్‌ పోస్టులకు 18- 27 సం. మధ్య ఉండాలి.

రాతపరీక్ష: సైంటిస్ట్‌ బి పోస్టుకు నిర్వహించే రాత పరీక్ష 100 మార్కులకు, వంద ప్రశ్నలు ఉంటాయి. జనరల్‌ సైన్స్‌, జనరల్‌ ఇంగ్లిష్‌, జనరల్‌ ఆప్టిట్యూడ్‌ నుంచి 40 ప్రశ్నలు ఇస్తారు. సబ్జెక్టు ఆధారిత ప్రశ్నలు 60 ఉంటాయి. పరీక్ష సమయం 2 గంటలు.

* అసిస్టెంట్‌ పోస్టుకు నిర్వహించే రాత పరీక్షలో.. జనరల్‌ ఆప్టిట్యూడ్‌, ఎన్విరాన్‌మెంట్‌ జీకే, ఇంగ్లిష్‌, మాథ్స్‌కు సంబంధించిన అంశాల నుంచి ప్రశ్నలు ఇస్తారు. ఎన్‌సీఈఆర్‌టీ పదోతరగతి పాఠ్యపుస్తకాల ప్రామాణికంగా ప్రశ్నపత్రం ఉంటుంది. * సీనియర్‌ ల్యాబొరేటరీ అసిస్టెంట్‌ రాతపరీక్షలో.. కెమిస్ట్రీ, మ్యాథ్స్‌/ బయాలజీ, జనరల్‌ ఆప్టిట్యూడ్‌, ఎన్విరాన్‌మెంట్‌ జీకే, ఇంగ్లిష్‌ అంశాల నుంచి ప్రశ్నలు ఇస్తారు. * రాత పరీక్షకు సంబంధించిన పాత ప్రశ్నపత్రాలు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి.  
దరఖాస్తుకు చివరి తేదీ: 31.03.2023

వెబ్‌సైట్‌: https://cpcb.nic.in/


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని