నోటిఫికేషన్స్‌

న్యూదిల్లీలోని రాజధాని ఎంటర్‌ప్రైజెస్‌ నోయిడాలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ బయోలాజికల్‌ (ఎన్‌ఐబీ)లో పని చేయటానికి ఒప్పంద ప్రాతిపదికన 59 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

Updated : 19 Apr 2023 06:39 IST

ప్రభుత్వ ఉద్యోగాలు
ఎన్‌ఐబీ-నోయిడాలో 59 పోస్టులు

న్యూదిల్లీలోని రాజధాని ఎంటర్‌ప్రైజెస్‌ నోయిడాలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ బయోలాజికల్‌ (ఎన్‌ఐబీ)లో పని చేయటానికి ఒప్పంద ప్రాతిపదికన 59 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

టెక్నికల్‌ అసోసియేట్‌ - 8

డేటా ఎంట్రీ ఆపరేటర్‌ - 6

ల్యాబొరేటరీ అసిస్టెంట్‌ - 45

విభాగాలు: అడ్మిన్‌, ఫైనాన్స్‌, ప్రొక్యూర్‌మెంట్‌, ఐటీ డివిజన్‌.

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో 10+2/ డిప్లొమా (కంప్యూటర్‌ సైన్స్‌)/ గ్రాడ్యుయేషన్‌ (సైన్స్‌).

* ఇంగ్లిష్‌/ హిందీ టైపింగ్‌ తప్పనిసరి.

అనుభవం: పోస్టును అనుసరించి 1-10 ఏళ్ల పని అనుభవం ఉండాలి.

వయసు: 30-65 ఏళ్లు ఉండాలి.

ఎంపిక: ఇంటర్వ్యూలో మెరిట్‌ ఆధారంగా.

దరఖాస్తు:  అభ్యర్థులు ఈమెయిల్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఈమెయిల్‌:  rajdhanienterprises2007@gmail.com/ rajdhanienterprises338@gmail.com

దరఖాస్తుకు చివరితేదీ: 24.04.2023

వెబ్‌సైట్‌: https://www.nib.gov.in/career1.aspx


ఎన్‌ఎఫ్‌డీసీ-ముంబయిలో..

ముంబయిలోని నేషనల్‌ ఫిల్మ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఎన్‌ఎఫ్‌డీసీ) 12 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

పోస్టులు: హెడ్‌-ఎన్‌ఎంఐసీ, ఫిల్మ్‌ ప్రోగ్రామర్‌, మేనేజర్‌, డైరెక్టర్‌, సీఈఓ తదితరాలు.

విభాగాలు: ప్రోగ్రామింగ్‌, మార్కెటింగ్‌ అండ్‌ పబ్లిక్‌ రిలేషన్‌, లీగల్‌, మీడియా, డిజిటల్‌ మార్కెటింగ్‌, ఇంటర్నేషనల్‌ సినిమా తదితరాలు.

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో గ్రాడ్యుయేషన్‌ డిగ్రీ/ బీటెక్‌/ బీఈ/ ఎంసీఏ/ ఎంఎస్సీ/ ఎంబీఏ/ పీజీ.

వయసు: 45-65 ఏళ్లు ఉండాలి.

దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో పంపాలి.

చిరునామా: General Manager, National Film Development Corporation Ltd., 5th Floor, NMIC Building, NFDC - FD Complex, 24, Pedder Road, Cumballa Hill, Mumbai - 400 026.

దరఖాస్తుకు చివరి తేదీ: 01.05.2023.

వెబ్‌సైట్‌: https://www.nfdcindia.com/


ఐఐసీబీ-కోల్‌కతాలో సైంటిస్ట్‌ పోస్టులు

కోల్‌కతాలోని సీఎస్‌ఐఆర్‌ ఆధ్వర్యంలోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కెమికల్‌ బయాలజీ (ఐఐసీబీ) 12 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

పోస్టులు: సైంటిస్ట్‌, సీనియర్‌ సైంటిస్ట్‌, ప్రిన్సిపల్‌ సైంటిస్ట్‌.

విభాగాలు:  

1. క్యాన్సర్‌ బయాలజీ అండ్‌ ఇన్‌ఫ్లమేటరీ డిజార్డర్‌.

2. సెల్‌ బయాలజీ అండ్‌ ఫిజియాలజీ.

3. ఆర్గానిక్‌ అండ్‌ మెడిసినల్‌ కెమిస్ట్రీ.

4. ఇన్ఫెక్షియస్‌ డిసీజ్‌ అండ్‌ ఇమ్యునాలజీ.

5. మాలిక్యులర్‌ జెనెటిక్స్‌ డివిజన్‌.

6. స్ట్రక్చరల్‌ బయాలజీ అండ్‌ బయోఇన్ఫర్మేటిక్స్‌.

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో ఎండీ/ ఎంవీఎస్సీ/ పీహెచ్‌డీ. వయసు: 32-45 ఏళ్లు ఉండాలి.

ఎంపిక: ఇంటర్వ్యూ ఆధారంగా.

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 15.05.2023.

వెబ్‌సైట్‌: https://iicb.res.in/


నాన్‌ టీచింగ్‌ స్టాఫ్‌ ఖాళీలు

నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) ఆల్‌ ఇండియా కౌన్సిల్‌ ఫర్‌ టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌ (ఏఐసీటీఈ)లో 46 నాన్‌ టీచింగ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

పోస్టుల వారీగా ఖాళీలు:

అకౌంటెంట్‌/ ఆఫీస్‌ సూపరింటెండెంట్‌ కమ్‌ అకౌంటెంట్‌: 10

జూనియర్‌ హిందీ ట్రాన్స్‌లేటర్‌: 01 

అసిస్టెంట్‌: 03

డేటా ఎంట్రీ ఆపరేటర్‌: 21 

ఎల్‌డీసీ: 11

అర్హతలు:  

1. అకౌంటెంట్‌/ ఆఫీస్‌ సూపరింటెండెంట్‌ కమ్‌ అకౌంటెంట్‌: డిగ్రీ (కామర్స్‌).  వయసు: 35 ఏళ్లు మించకూడదు.

2. జూనియర్‌ హిందీ ట్రాన్స్‌లేటర్‌: బ్యాచిలర్స్‌ డిగ్రీ/ డిప్లొమా/ మాస్టర్స్‌ డిగ్రీ. వయసు: 35 ఏళ్లు మించకూడదు.

3. అసిస్టెంట్‌: డిగ్రీ. వయసు: 35 ఏళ్లు మించకూడదు.

4. డేటా ఎంట్రీ ఆపరేటర్‌: డిగ్రీ/ డిప్లొమా. వయసు: 30 ఏళ్లు మించకూడదు.

5. ఎల్‌డీసీ: డిగ్రీ, ఇంగ్లిష్‌ టైపింగ్‌ నైపుణ్యాలు. వయసు: 30 ఏళ్లు మించకూడదు.

ఎంపిక: రాతపరీక్ష/ కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష, స్కిల్‌ టెస్ట్‌ ద్వారా.

* జనరల్‌ నాలెడ్జ్‌, కరెంట్‌ అఫైర్స్‌, రీజనింగ్‌ అండ్‌ మ్యాథమెటికల్‌ ఎబిలిటీ, జనరల్‌ హిందీ అండ్‌ ఇంగ్లిష్‌, కంప్యూటర్‌ నాలెడ్జ్‌, సర్వీస్‌ రూల్స్‌, ఆర్‌టీఐ చట్టం, జీఎఫ్‌ఆర్‌, అకౌంటెన్సీ, ఇన్‌కమ్‌ టాక్స్‌ యాక్ట్‌, బడ్జెట్‌ అండ్‌ జనరల్‌ ఫైనాన్స్‌ తదితర అంశాల నుంచి ప్రశ్నలు అడుగుతారు.

తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్‌.

దరఖాస్తు ఫీజు: రూ.1000.

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 15.05.2023.

వెబ్‌సైట్‌: https://recruitment.nta.nic.in


ఎన్‌హెచ్‌డీసీ-నోయిడాలో ...

నోయిడాలోని నేషనల్‌ హ్యాండ్లూమ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఎన్‌హెచ్‌డీసీ) 14 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

పోస్టులు: సీనియర్‌ మేనేజర్‌, కంపెనీ సెక్రటరీ, జూనియర్‌ ఆఫీసర్‌.

అర్హత: పోస్టును అనుసరించి గ్రాడ్యుయేషన్‌/ సీఏ/ ఎంబీఏ.

వయసు: 25-45 ఏళ్లు ఉండాలి.

ఎంపిక: పోస్టును అనుసరించి రాతపరీక్ష, గ్రూప్‌ డిస్కషన్‌, ఇంటర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తు ఫీజు: రూ.500.

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 15.05.2023.

వెబ్‌సైట్‌: https://nhdc.org.in 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని