నోటిఫికేషన్స్‌

హైదరాబాద్‌లోని మౌలానా ఆజాద్‌ జాతీయ ఉర్దూ విశ్వవిద్యాలయం ప్రధాన క్యాంపస్‌తో పాటు అనుబంధ క్యాపస్‌లలో 2023-24 విద్యా సంవత్సరానికి రెగ్యులర్‌ విధానంలో కోర్సులను అందిస్తోంది.

Published : 08 May 2023 00:18 IST

ప్రవేశాలు

ఉర్దూ విశ్వవిద్యాలయంలో పీజీ, పీహెచ్‌డీ

హైదరాబాద్‌లోని మౌలానా ఆజాద్‌ జాతీయ ఉర్దూ విశ్వవిద్యాలయం ప్రధాన క్యాంపస్‌తో పాటు అనుబంధ క్యాపస్‌లలో 2023-24 విద్యా సంవత్సరానికి రెగ్యులర్‌ విధానంలో కోర్సులను అందిస్తోంది. అర్హులైన అభ్యర్థులు పీజీ, పీహెచ్‌డీ, డిప్లొమా, సర్టిఫికెట్‌లలో ప్రవేశాలు పొందవచ్చు.

ప్రవేశ పరీక్ష ద్వారా ప్రవేశాలు కల్పించే కోర్సులు

1. పీహెచ్‌డీ: ఉర్దూ, అరబిక్‌, ఇంగ్లిష్‌, హిందీ, పర్షియన్‌, ట్రాన్స్‌లేషన్‌ స్టడీస్‌, విమెన్‌ స్టడీస్‌, పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌, పొలిటికల్‌ సైన్స్‌, సోషల్‌ వర్క్‌, ఇస్లామిక్‌ స్టడీస్‌, హిస్టరీ, ఎకనామిక్స్‌, సోషియాలజీ, డెక్కన్‌ స్టడీస్‌, ఎడ్యుకేషన్‌ తదితరాలు.

2. పీజీ: ఎంబీఏ, ఎంసీఏ, ఎంటెక్‌ (సీఎస్‌), ఎంఈడీ, బీఈడీ.

3. యూజీ: బీటెక్‌ (సీఎస్‌), బీటెక్‌ (సీఎస్‌) లేటరల్‌ ఎంట్రీ

4. ప్రొఫెషనల్‌ డిప్లొమా: డీఈఎల్‌ఈడీ, పాలిటెక్నిక్‌- డిప్లొమా, పాలిటెక్నిక్‌- డిప్లొమా లేటరల్‌ ఎంట్రీ.

మెరిట్‌ ద్వారా ప్రవేశాలు కల్పించే కోర్సులు

1. పీజీ ప్రోగ్రాం (పార్ట్‌ టైమ్‌): ఎంఏ, ఎంఎస్సీ, ఎంకాం, ఎంఒకేషనల్‌,  పీజీ డిప్లొమా.

2. పీజీ డిప్లొమా ప్రోగ్రాం (పార్ట్‌ టైమ్‌)

3. డిప్లొమా ప్రోగ్రాం (పార్ట్‌ టైమ్‌)

4. సర్టిఫికెట్‌ ప్రోగ్రాం (పార్ట్‌ టైమ్‌)

అర్హత: కోర్సును అనుసరించి పదో తరగతి, ఇంటర్‌, డిగ్రీ, పీజీ.

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ (పీహెచ్‌డీ): 28-05-2023.

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ (ప్రవేశ పరీక్ష ఆధారిత- ప్రొఫెషనల్‌/ టెక్నికల్‌/ ఒకేషనల్‌ ప్రోగ్రాం): 28-05-2023.

ప్రవేశ పరీక్ష తేదీలు: 20, 21, 22-06-2023.

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ (మెరిట్‌ ఆధారిత పీజీ (జనరల్‌/ ప్రొఫెషనల్‌) ప్రోగ్రాం): 24-07-2023.

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ (పార్ట్‌-టైమ్‌ ప్రోగ్రాం): 30-09-2023.

వెబ్‌సైట్‌: https://manuucoe.in/regularadmission/


ఎన్‌ఐఏఎంటీ, రాంచీలో ...

ఝార్ఖండ్‌ రాష్ట్రం రాంచీలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ అడ్వాన్స్‌డ్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ టెక్నాలజీ 2023 విద్యా సంవత్సరానికి అడ్వాన్స్‌డ్‌ డిప్లొమా కోర్సులో ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

ఫౌండ్రీ టెక్నాలజీ- 58 సీట్లు; ఫోర్జ్‌ టెక్నాలజీ- 57 సీట్లు.

అర్హత: డిప్లొమా, బీఈ, బీటెక్‌ (ఆటోమొబైల్‌/ మెకానికల్‌/ మెటలర్జికల్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌/ ప్రొడక్షన్‌/ ఇండస్ట్రియల్‌ ఇంజినీరింగ్‌) లేదా బీఎస్సీ (ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్‌).

ఎంపిక: విద్యార్హత మార్కులు, కౌన్సెలింగ్‌, పరీక్షలు, మెడికల్‌ టెస్ట్‌ ఆధారంగా.

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 31-05-2023.

దరఖాస్తు హార్డ్‌ కాపీని పంపడానికి చివరి తేదీ: 09-06-2023.

వెబ్‌సైట్‌: http://www.niamt.ac.in/


ఏపీ బీసీ గురుకులాల్లో ఇంటర్‌ ప్రవేశాలు

విజయవాడలోని మహాత్మా జ్యోతిబా ఫులే వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ నిర్వహించే 14 బీసీ బాలబాలికల జూనియర్‌ కళాశాల్లో 2023-24 విద్యాసంవత్సరానికి గాను ఇంటర్‌మీడియట్‌ (ఇంగ్లిష్‌ మీడియం) ప్రవేశ ప్రకటన వెలువడింది. అర్హులైన బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ విద్యార్థులు మే 18లోగా దరఖాస్తులు సమర్పించవచ్చు.
మహాత్మా జ్యోతిబా ఫులే ఏపీ బీసీ రెసిడెన్షియల్‌ జూనియర్‌ కాలేజెస్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌-2023

విద్యార్హత: విద్యార్ధులు సంబంధిత జిల్లాల్లోని ప్రభుత్వ లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలలో పదో తరగతి మార్చి 2023 ఉత్తీర్ణులై ఉండాలి. విద్యార్థి తల్లిదండ్రుల వార్షికాదాయం రూ.లక్షకు మించకూడదు.

వయసు: 31.08.2023 నాటికి 17 ఏళ్లు మించకూడదు.

ప్రవేశ పరీక్ష: ప్రవేశ పరీక్ష ఆబ్జెక్టివ్‌ పద్ధతిలో ఓఎంఆర్‌ షీట్‌ విధానంలో 100 మార్కులకు నిర్వహిస్తారు. ప్రశ్నపత్రం ఆంగ్ల మాధ్యమాల్లో ఉంటుంది. మ్యాథ్స్‌(20 మార్కులు), ఫిజికల్‌ సైన్స్‌(20 మార్కులు), బయోసైన్స్‌(20 మార్కులు), సోషల్‌ సైన్స్‌(15 మార్కులు), ఇంగ్లిష్‌(15 మార్కులు), లాజికల్‌ రీజనింగ్‌(10 మార్కులు) సబ్జెక్టుల్లో పదో తరగతి స్థాయిలో ప్రశ్నలు అడుగుతారు.

ఎంపిక: అర్హులైన అభ్యర్థులకు ప్రవేశ పరీక్షలో ప్రతిభ, రిజర్వేషన్‌, ప్రత్యేక కేటగిరీ (అనాథ/ మత్స్యకార) ఆధారంగా సీటు కేటాయిస్తారు.

దరఖాస్తు రుసుము: రూ.250.

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 18-05-2023.

ప్రవేశ పరీక్ష తేదీ: 28-05-2023. 

ఫలితాల ప్రకటన: 10-06-2023.

వెబ్‌సైట్‌: https://mjpapbcwreis.apcfss.in/


ఐఐఎంలో ఎగ్జిక్యూటివ్‌ పీజీ డిప్లొమా

ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ రోహ్‌తక్‌ 2023-25 విద్యా సంవత్సరానికి స్పోర్ట్స్‌ మేనేజ్‌మెంట్‌లో ఎగ్జిక్యూటివ్‌ పీజీ డిప్లొమా  ప్రవేశానికి అనుభవజ్ఞులైన మేనేజ్‌మెంట్‌ నిపుణులు, క్రీడా ఔత్సాహికులు, స్పోర్ట్స్‌ అడ్మినిస్ట్రేటర్‌ల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

అర్హత: కనీసం 50% మార్కులతో ఏదైనా విభాగంలో బ్యాచిలర్‌ డిగ్రీ లేదా తత్సమానం. సంబంధిత రంగంలో అనుభవానికి ప్రాధాన్యం.

ఎంపిక: స్పోర్ట్స్‌ ఆప్టిట్యూడ్‌ అసెస్‌మెంట్‌ టెస్ట్‌, ఇంటర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తు రుసుము: రూ.1000.

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 18-07-2023.

స్పోర్ట్స్‌ ఆప్టిట్యూడ్‌ అసెస్‌మెంట్‌ టెస్ట్‌ తేదీ: 29-07-2023.

ఇంటర్వ్యూ తేదీ: 29-07-2023.

ఫలితాల ప్రకటన: 12-08-2023.

వెబ్‌సైట్‌: https://www.iimrohtak.ac.in/


ఏపీ ఆదర్శ పాఠశాలల్లో ఆరో తరగతి ...

పీ డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ స్కూల్‌ ఎడ్యుకేషన్‌, ఏపీ మోడల్‌ స్కూల్‌ సొసైటీ... 2023-24 విద్యా సంవత్సరానికి ఆదర్శ పాఠశాలల్లో ఆరో తరగతి(ఆంగ్ల మాధ్యమం)లో ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

ఏపీ మోడల్‌ స్కూల్స్‌ ఆరో తరగతి ప్రవేశ పరీక్ష-2023

అర్హత: సంబంధిత జిల్లాలో ప్రభుత్వ లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో 2022-23 విద్యాసంవత్సరంలో అయిదో తరగతి చదివి ఉండాలి.

వయసు: ఓసీ, బీసీ విద్యార్థులు 01-09-2011 నుంచి 31-08-2013 మధ్య; ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు 01-09-2009 నుంచి 31-08-2013 మధ్య జన్మించి ఉండాలి.

ఎంపిక: ప్రవేశ పరీక్షలో ప్రతిభ, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ ఆధారంగా.

పరీక్ష రుసుము: ఓసీ, బీసీలకు రూ.150; ఎస్సీ, ఎస్టీలకు రూ.75.

ఆన్‌లైన్‌ దరఖాస్తులు ప్రారంభం: 09-05-2023.

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 25-05-2023.

ప్రవేశ పరీక్ష తేదీ: 11-06-2023.

వెబ్‌సైట్‌: https://apms.ap.gov.in/apms/


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని