ఉద్యోగాలు

భోపాల్‌లోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రిసెర్చ్‌(ఐసర్‌) 77 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

Published : 17 May 2023 00:09 IST

ఐసర్‌-భోపాల్‌లో నాన్‌టీచింగ్‌ స్టాఫ్‌

భోపాల్‌లోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రిసెర్చ్‌(ఐసర్‌) 77 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

పోస్టులు: లైబ్రేరియన్‌, సూపరింటెండింగ్‌ ఇంజినీర్‌, డిప్యూటీ రిజిస్ట్రార్‌, ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌, అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌, మెడికల్‌ ఆఫీసర్‌, జూనియర్‌ ఇంజినీర్‌, టెక్నికల్‌ అసిస్టెంట్‌ తదితరాలు.

అర్హత: పోస్టును అనుసరించి మెట్రిక్యులేషన్‌/ బీఎస్సీ/ బీఈ/ బీటెక్‌/ బ్యాచిలర్స్‌ డిగ్రీ/  డిప్లొమా/ ఎంబీబీఎస్‌/ ఎంసీఏ/ మాస్టర్స్‌డిగ్రీ/ పీహెచ్‌డీ.

ఎంపిక: స్క్రీనింగ్‌ టెస్ట్‌/ ఇంటర్వ్యూ ఆధారంగా.

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 14.06.2023.

వెబ్‌సైట్‌: https://www.iiserb.ac.in/


ప్రవేశాలు

జేఎన్‌ఏఎఫ్‌ఏయూలో బీఎఫ్‌ఏ, బీడిజైన్‌  

హైదరాబాద్‌లోని జవహర్‌లాల్‌ నెహ్రూ ఆర్కిటెక్చర్‌ అండ్‌ ఫైన్‌ ఆర్ట్స్‌ యూనివర్సిటీ జేఎన్‌ఏఎఫ్‌ఏయూ, అనుబంధ కళాశాలల్లో బ్యాచిలర్‌ ఆఫ్‌ ఫైన్‌ ఆర్ట్స్‌, బ్యాచిలర్‌ ఆఫ్‌ డిజైన్‌ ప్రోగ్రాంలలో ప్రవేశాలకు సంబంధించి ఫైన్‌ ఆర్ట్స్‌ అండ్‌ డిజైన్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామినేషన్‌ (ఎఫ్‌ఏడీఈఈ) నిర్వహిస్తోంది.  

కోర్సు సీట్లు          

1. బీఎఫ్‌ఏ (అప్లైడ్‌ ఆర్ట్‌): 50

2. బీఎఫ్‌ఏ (పెయింటింగ్‌): 35  

3. బీఎఫ్‌ఏ (స్కల్ప్‌చర్‌): 20

4. బీఎఫ్‌ఏ (యానిమేషన్‌): 60  

5. బీఎఫ్‌ఏ (ఫొటోగ్రఫీ): 50  

6. బీడిజైన్‌(ఇంటీరియర్‌ డిజైన్‌): 60  

అర్హత: ఇంటర్మీడియట్‌ లేదా తత్సమాన పరీక్ష ఉత్తీర్ణులై ఉండాలి.

ప్రోగ్రాం వ్యవధి: నాలుగేళ్లు

ఎంపిక: ప్రవేశ పరీక్ష, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ ఆధారంగా.

రిజిస్ట్రేషన్‌ ఫీజు: రూ.1,800 (ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.900).

ఆన్‌లైన్‌ దరఖాస్తు, ఫీజు చెల్లింపు చివరి తేదీ: 05-06-2023.రూ.2,000 ఆలస్య రుసుముతో దరఖాస్తుకు చివరి తేదీ: 12-06-2023.

ప్రవేశ పరీక్ష తేదీలు: 17-06-2023, 18-06-2023.

వెబ్‌సైట్‌: https://jnafauadmissions.com/


పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో పీహెచ్‌డీ ప్రోగ్రాం

తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం పీహెచ్‌డీ ప్రోగ్రాంలో ప్రవేశాలకు మహిళా అభ్యర్థుల నుంచి ఆఫ్‌లైన్‌ దరఖాస్తులు కోరుతోంది.

అర్హత: పీజీతో పాటు యూజీసీ-నెట్‌/ యూజీసీ- సీఎస్‌ఐఆర్‌ నెట్‌/ గేట్‌/ సీఈఈడీ తదితర జాతీయస్థాయి అర్హత పరీక్షల్లో ఉత్తీర్ణులై ఉండాలి.

సైన్సెస్‌: అప్లైడ్‌ మైక్రోబయాలజీ, ఇండస్ట్రియల్‌ మైక్రోబయాలజీ, బయోటెక్నాలజీ, బయోకెమిస్ట్రీ, కంప్యూటర్‌ సైన్స్‌, హోమ్‌ సైన్స్‌, ఫుడ్‌ టెక్నాలజీ, ఫుడ్‌ న్యూట్రిషన్‌ అండ్‌ డైటెటిక్స్‌, బోటనీ, జువాలజీ, సెరికల్చర్‌, ఫార్మాస్యూటికల్‌ సైన్సెస్‌, కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌.

సోషల్‌ సైన్సెస్‌: బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌, కమ్యూనికేషన్‌ అండ్‌ జర్నలిజం, ఎడ్యుకేషన్‌, ఇంగ్లిష్‌, లా, మ్యూజిక్‌, డ్యాన్స్‌, ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌, సోషల్‌ వర్క్‌, తెలుగు, ఎకనామిక్స్‌, ఉమెన్స్‌ స్టడీస్‌.

ఎంపిక: ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా.

దరఖాస్తు రుసుము: జనరల్‌ అభ్యర్థులకు రూ.2000; ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.1300.

ఆఫ్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 31-05-2023.

వెబ్‌సైట్‌: https://www.spmvv.ac.in/


ఐఐఎస్‌ఈఆర్‌ మొహాలిలో ..

పంజాబ్‌ రాష్ట్రంలోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రిసెర్చ్‌ (ఐఐఎస్‌ఈఆర్‌) మొహాలి 15 ట్రేడ్‌ అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

అర్హతలు: 10+2, బీకాం/ బీఏ/ బీబీఏ/ బీసీఏ/బీఎస్సీ/ డిగ్రీ/ పీజీ డిప్లొమా/ డిప్లొమా.

వయసు: 18-25 సంవత్సరాల మధ్య ఉండాలి.

నెలవారీ స్టైపెండ్‌: రూ.14,000.

దరఖాస్తు: ఆఫ్‌లైన్‌ దరఖాస్తులను ‘ది రిక్రూట్‌మెంట్‌ సెల్‌, ఐఐఎస్‌ఈఆర్‌, సెక్టార్‌-81, మనౌలీ, మొహాలి, పంజాబ్‌’కు పంపించాలి.

దరఖాస్తుకు చివరి తేదీ: 22.05.2023.

www.iisermohali.ac.in/


అప్రెంటిస్‌

గ్రాడ్యుయేట్‌/ టెక్నీషియన్‌  

హైదరాబాద్‌లోని నేషనల్‌ రిమోట్‌ సెన్సింగ్‌ సెంటర్‌ ఏడాది అప్రెంటిస్‌షిప్‌ కోసం దరఖాస్తులు కోరుతోంది.

గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌: 17

టెక్నీషియన్‌ అప్రెంటిస్‌: 30 

డిప్లొమా అప్రెంటిస్‌: 23  

మొత్తం ఖాళీలు: 70.

విభాగాలు: ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజినీరింగ్‌, కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజినీరింగ్‌, ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ ఇంజినీరింగ్‌, సివిల్‌ ఇంజినీరింగ్‌, మెకానికల్‌ ఇంజినీరింగ్‌, కమర్షియల్‌ అండ్‌ కంప్యూటర్‌ ప్రాక్టీస్‌.

అర్హత: కనీసం 60 శాతం మార్కులతో బీఈ/ బీటెక్‌, డిప్లొమా ఇంజినీరింగ్‌ (కమర్షియల్‌ ప్రాక్టీస్‌) ఉత్తీర్ణులై ఉండాలి.

నెలవారీ స్టైపెండ్‌: గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌లకు రూ.9000; టెక్నీషియన్‌/డిప్లొమా అప్రెంటిస్‌లకు రూ.8000.

ఎంపిక: డిగ్రీ/ డిప్లొమాలో అభ్యర్థుల అకడమిక్‌ స్కోరు ఆధారంగా.

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 02.06.2023.

వెబ్‌సైట్‌: https://www.nrsc.gov.in/


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని