ఉద్యోగాలు

సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, హ్యూమన్‌ క్యాపిటల్‌ మేనేజ్‌మెంట్‌ డిపార్ట్‌మెంట్‌ దేశవ్యాప్తంగా ఉన్న బ్యాంకు శాఖల్లో  మిడిల్‌ మేనేజ్‌మెంట్‌ గ్రేడ్‌ స్కేల్‌-2 మేనేజర్‌ (మెయిన్‌ స్ట్రీమ్‌) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. 

Updated : 10 Jul 2023 05:16 IST

సెంట్రల్‌ బ్యాంకులో 1000 మేనేజర్‌లు

సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, హ్యూమన్‌ క్యాపిటల్‌ మేనేజ్‌మెంట్‌ డిపార్ట్‌మెంట్‌ దేశవ్యాప్తంగా ఉన్న బ్యాంకు శాఖల్లో  మిడిల్‌ మేనేజ్‌మెంట్‌ గ్రేడ్‌ స్కేల్‌-2 మేనేజర్‌ (మెయిన్‌ స్ట్రీమ్‌) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది.  

అర్హత: ఏదైనా డిగ్రీ. సీఏఐఐబీ ఉత్తీర్ణులై ఉండాలి. పీఎస్‌బీ/ ప్రైవేట్‌ సెక్టార్‌ బ్యాంక్‌/ ఆర్‌ఆర్‌బీలో ఆఫీసర్‌గా మూడేళ్ల పని అనుభవం. లేదా పీఎస్‌బీ/ ప్రైవేట్‌ సెక్టార్‌ బ్యాంక్‌/ ఆర్‌ఆర్‌బీలో క్లర్క్‌గా ఆరేళ్ల పని అనుభవంతోపాటు సంబంధిత విభాగంలో ఎంబీఏ/ ఎంసీఏ/ పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి.

వయసు: 31.05.2023 నాటికి 32 ఏళ్లు మించకూడదు.

పే స్కేల్‌: నెలకు రూ.48,170-రూ.69,810.

పోస్టింగ్‌ స్థలం: దేశవ్యాప్తంగా ఉన్న సెంట్రల్‌ బ్యాంక్‌ శాఖల్లో.

ఎంపిక: ఆన్‌లైన్‌ రాత పరీక్ష, పర్సనల్‌ ఇంటర్వ్యూ ద్వారా.

దరఖాస్తు రుసుము: రూ.850; ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళలకు రూ.175.

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 15.07.2023.

ఆన్‌లైన్‌ పరీక్ష తేదీ: ఆగస్టు రెండు/ మూడో వారం, 2023.

వెబ్‌సైట్‌: https://www.centralbankofindia.co.in/en


ప్రవేశాలు

అంబేడ్కర్‌ వర్సిటీలో పీజీ కోర్సులు

శ్రీకాకుళంలోని డా.బి.ఆర్‌.అంబేడ్కర్‌ యూనివర్సిటీ, బొల్లినేని మెడ్‌స్కిల్స్‌ సహకారంతో 2023-24 విద్యా సంవత్సరానికి పీజీ కోర్సులను అందిస్తోంది.

1. మాస్టర్‌ ఆఫ్‌ హెల్త్‌కేర్‌ అడ్మినిస్ట్రేషన్‌ (రెండేళ్లు): 40 సీట్లు

2. పీజీ డిప్లొమా ఇన్‌ మెడికల్‌ రికార్డ్స్‌ అండ్‌ హెల్త్‌ ఇన్ఫర్మేషన్‌ (ఏడాది): 40 సీట్లు

అర్హత: ఎంబీబీఎస్‌/ బీడీఎస్‌/బీఎస్సీ/బీఫార్మసీ/బీఎస్సీ నర్సింగ్‌/ బీఏఎంఎస్‌/ బీహెచ్‌ఎంఎస్‌/ బీఏ/ బీకాం/ ఏదైనా డిగ్రీ.  

వయసు: 20 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉండాలి.

దరఖాస్తు: ఆఫ్‌లైన్‌ దరఖాస్తులను ‘డైరెక్టర్‌ ఆఫ్‌ అడ్మిషన్స్‌, డా.బి.ఆర్‌.అంబేడ్కర్‌ యూనివర్సిటీ, శ్రీకాకుళం’ చిరునామాకు పోస్టు ద్వారా లేదా వ్యక్తిగతంగా పంపాలి.

దరఖాస్తుకు చివరి తేదీ: 11-08-2023.

ఆలస్య రుసుము రూ.500తో: 20-08-2023.

వెబ్‌సైట్‌: http://www.brau.edu.in/index.aspx


ఉర్దూ యూనివర్సిటీలో బీఈడీ (ఓడీఎల్‌)  

హైదరాబాద్‌లోని మౌలానా ఆజాద్‌ నేషనల్‌ ఉర్దూ యూనివర్సిటీ (మనూ) 2023-24 విద్యా సంవత్సరానికి ఓపెన్‌ అండ్‌ డిస్టెన్స్‌ లెర్నింగ్‌ విధానంలో బీఈడీ ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.

అర్హత: డిగ్రీ/ పీజీ. ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌లో శిక్షణ పొందిన ఇన్‌సర్వీస్‌ ఉపాధ్యాయులు అర్హులు.

బోధనా మాధ్యమం: ఉర్దూ. ప్రోగ్రామ్‌ వ్యవధి: రెండేళ్లు (4 సెమిస్టర్లు). సీటు కేటాయింపు: ప్రవేశ పరీక్ష ఆధారంగా.

రిజిస్ట్రేషన్‌ ఫీజు: రూ.1,000.

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 25-07-2023.

ప్రవేశ పరీక్ష: 06-08-2023.

ప్రవేశ పరీక్ష ఫలితాలు: 09-08-2023.

వెబ్‌సైట్‌: https://manuu.edu.in/


దూరవిద్యలో యూజీ, పీజీ

హైదరాబాద్‌లోని మౌలానా ఆజాద్‌ నేషనల్‌ ఉర్దూ యూనివర్సిటీ (మనూ), డైరెక్టరేట్‌ ఆఫ్‌ డిస్టెన్స్‌ ఎడ్యుకేషన్‌ ఓపెన్‌ అండ్‌ డిస్టెన్స్‌ లెర్నింగ్‌ విధానంలో యూజీ, పీజీ ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.

1. పీజీ: ఎంఏ ఉర్దూ, ఇస్లామిక్‌ స్టడీస్‌, ఇంగ్లిష్‌, అరబిక్‌, హిందీ.

2. యూజీ: బీఏ, బీకాం, బీఎస్సీ (ఫిజికల్‌ సైన్సెస్‌)/ బీఎస్సీ (లైఫ్‌ సైన్సెస్‌)

3. డిప్లొమా: టీచ్‌ ఇంగ్లిష్‌, జర్నలిజం అండ్‌ మాస్‌ కమ్యూనికేషన్‌, ఎర్లీ చైల్డ్‌హుడ్‌ కేర్‌ అండ్‌ ఎడ్యుకేషన్‌, స్కూల్‌ లీడర్‌షిప్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌

4. సర్టిఫికెట్‌: ఫంక్షనల్‌ ఇంగ్లిష్‌, ప్రొఫిషియన్సీ ఇన్‌ ఉర్దూ త్రూ ఇంగ్లిష్‌

అర్హత: కోర్సును అనుసరించి ఇంటర్మీడియట్‌, డిగ్రీ, 10వ తరగతి.

రిజిస్ట్రేషన్‌ ఫీజు: రూ.300

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 25-08-2023.

వెబ్‌సైట్‌: https://manuu.edu.in/


వాక్‌ ఇన్స్‌

ఈఎస్‌ఐసీ వైద్య కళాశాలలో ఫ్యాకల్టీ

హైదరాబాద్‌ సనత్‌నగర్‌లోని ఈఎస్‌ఐసీ మెడికల్‌ కాలేజ్‌, మెడికల్‌ కాలేజ్‌ హాస్పిటల్‌ కాంట్రాక్టు ప్రాతిపదికన 94 పోస్టుల భర్తీకి వాక్‌-ఇన్‌ ఇంటర్వ్యూ నిర్వహిస్తోంది.

ప్రొఫెసర్‌: 10

అసోసియేట్‌ ప్రొఫెసర్‌: 29 

అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌: 38 

సూపర్‌ స్పెషలిస్ట్‌: 01

స్పెషలిస్ట్‌: 01  

సీనియర్‌ రెసిడెంట్‌: 15  

స్పెషాలిటీలు: రేడియాలజీ, ఈఎన్‌టీ, ప్లాస్టిక్‌ సర్జరీ, అనస్థీషియా, పీడియాట్రిక్స్‌, ఆర్థోపెడిక్స్‌, ఆఫ్తాల్మాలజీ, డెర్మటాలజీ, పాథాలజీ తదితరాలు.

అర్హతలు: సంబంధిత స్పెషాలిటీలో ఎంబీబీఎస్‌, పీజీ.

ఇంటర్వ్యూ తేదీలు: జులై 13, 14, 17, 18, 19, 20, 21, 22, 24.

వేదిక: అకడమిక్‌ బ్లాక్‌, ఈఎస్‌ఐసీ మెడికల్‌ కాలేజీ, సనత్‌నగర్‌, హైదరాబాద్‌.

వెబ్‌సైట్‌: https://www.esic.gov.in/


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని