నోటీస్‌బోర్డు

జవహర్‌లాల్‌ నెహ్రూ సెంటర్‌ ఫర్‌ అడ్వాన్స్‌డ్‌ సైంటిఫిక్‌ రిసెర్చ్‌ 2024-25 విద్యాసంవత్సరానికి పీహెచ్‌డీ, రిసెర్చ్‌ ప్రోగ్రామ్‌ల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.

Published : 14 Mar 2024 00:04 IST

ప్రవేశాలు
జేఎన్‌సీఏఎస్‌ఆర్‌లో పీహెచ్‌డీ

జవహర్‌లాల్‌ నెహ్రూ సెంటర్‌ ఫర్‌ అడ్వాన్స్‌డ్‌ సైంటిఫిక్‌ రిసెర్చ్‌ 2024-25 విద్యాసంవత్సరానికి పీహెచ్‌డీ, రిసెర్చ్‌ ప్రోగ్రామ్‌ల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది. 

1. రిసెర్చ్‌ ప్రోగ్రామర్‌ (పీహెచ్‌డీ/ ఎంఎస్‌ (ఇంజినీరింగ్‌)/ ఎంఎస్‌ (రిసెర్చ్‌)) 2. మాస్టర్‌ ఆఫ్‌ సైన్స్‌ (ఎమ్మెస్సీ) ఇన్‌ కెమిస్ట్రీ 3. మాస్టర్‌ ఆఫ్‌ సైన్స్‌ (ఎమ్మెస్సీ) ఇన్‌ ఇంటర్‌ డిసిప్లినరీ బయోసైన్స్‌ 4. ఇంటిగ్రేటెడ్‌ పీహెచ్‌డీ (ఇంటర్‌ డిసిప్లినరీ పీహెచ్‌డీ) 5. పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ డిప్లొమా ఇన్‌ మెటీరియల్‌ సైన్స్‌ (పీజీడిఎంఎస్‌)

అర్హత: ప్రోగ్రామ్‌లను అనుసరించి 55 శాతం మార్కులతో సైన్స్‌ విభాగంలో డిగ్రీ, కెమిస్ట్రీ తప్పనిసరి సబ్జెక్టుగా ఉండాలి. బీఎస్సీ/ఎమ్మెస్సీ, బీఈ/ బీటెక్‌/ బీఎస్‌ లేదా ఎంఈ/ ఎంటెక్‌ లేదా బీవీఎస్సీ/ ఎంవీఎస్సీ/ ఎంబీబీఎస్‌, ఎండీతో పాటు-

  • గేట్‌/ జేఈఎస్‌టీ/ జీపీఏటీ/ యూజీసీ/ -జేఆర్‌ఎఫ్‌/ సీఎస్‌ఐఆర్‌- జేఆర్‌ఎఫ్‌/ - నెట్‌-జేఆర్‌ఎఫ్‌/ ఐసీఎంఆర్‌- జేఆర్‌ఎఫ్‌/ ఇన్‌స్పైర్‌ స్కోరు- జేఆర్‌ఏఫ్‌, జేఏఎం ఏదైనా ఒక ప్రవేశ పరీక్షలో స్కోరు సాధించి ఉండాలి.

ఎంపిక: షార్ట్‌ లిస్ట్‌, ఇంటర్వ్యూల ఆధారంగా.
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 15-04-2024.
వెబ్‌సైట్‌:https://www.jncasr.ac.in/


ప్రభుత్వ ఉద్యోగాలు
విద్యుత్‌ నియంత్రణ మండలిలో..

తెలంగాణ రాష్ట్ర విద్యుత్‌ నియంత్రణ మండలి వివిధ విభాగాల్లో 28 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

  • జాయింట్‌ డైరెక్టర్‌/ ఇంజినీరింగ్‌: 01
  • డిప్యూటీ డైరెక్టర్‌/ ట్రాన్స్‌మిషన్‌: 01 
  • డిప్యూటీ డైరెక్టర్‌ / డిస్ట్రిబ్యూషన్‌: 01
  • డిప్యూటీ డైరెక్టర్‌ / లా: 01
  • డిప్యూటీ డైరెక్టర్‌ / లీగల్‌ ప్రొసీజర్‌: 01
  • డిప్యూటీ డైరెక్టర్‌ / టారిఫ్‌ (అకౌంట్స్‌ అండ్‌ ఫైనాన్షియల్‌ అనాలిసిస్‌): 01
  • డిప్యూటీ డైరెక్టర్‌ - టారిఫ్‌ (ఎకనామిక్స్‌): 01
  • డిప్యూటీ డైరెక్టర్‌ - టారిఫ్‌ (ఇంజినీరింగ్‌): 01
  • డిప్యూటీ డైరెక్టర్‌ / ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ: 01
  • డిప్యూటీ డైరెక్టర్‌ / పే అండ్‌ అకౌంట్స్‌: 01
  • డిప్యూటీ© డైరెక్టర్‌ / కన్సూమర్‌ అసిస్టెంట్‌: 01
  • అకౌంట్‌ ఆఫీసర్‌: 01
  • క్యాషియర్‌: 01
  • లైబ్రేరియన్‌: 01
  • స్టెనో కమ్‌ కంప్యూటర్‌ ఆపరేటర్‌: 02
  • క్లర్క్‌ కమ్‌ కంప్యూటర్‌ ఆపరేటర్‌: 04
  • పర్సనల్‌ అసిస్టెంట్‌: 02
  • రిసెప్షనిస్ట్‌: 01
  • ఆఫీస్‌ సబార్డినేట్స్‌: 05

అర్హత: పోస్టును బట్టి టెన్త్‌, డిప్లొమా ఇంజినీరింగ్‌, లా. ఎలక్ట్రికల్‌/ పవర్‌ ఇంజినీరింగ్‌, అకౌంటింగ్‌/ కామర్స్‌, ఎకనామిక్స్‌, ఎలక్ట్రికల్‌/ కంప్యూటర్‌ ఇంజినీరింగ్‌లో డిగ్రీతో పాటు కంప్యూటర్‌ పరిజ్ఞానం, పని అనుభవం. ఆఫీస్‌ సబార్డినేట్స్‌ పోస్టుకు లైట్‌ వెహికల్‌ లైసెన్స్‌, డ్రైవింగ్‌ అనుభవం ఉండాలి. వయసు: 46 ఏళ్లు మించరాదు.
ఎంపిక: రాత పరీక్ష లేదా ఇంటర్వ్యూ ఆధారంగా దరఖాస్తు ఫీజు: రూ.120 చిరునామా: కమిషన్‌ సెక్రటరీ, డోర్‌. నెం 11-4-660, ఐదో అంతస్తు, సింగరేణి భవన్‌, రెడ్‌ హిల్స్‌, హైదరాబాదు. దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా.
దరఖాస్తుకు చివరి తేదీ: 01-04-2024.
వెబ్‌సైట్‌: https://tserc.gov.in/


ఏపీలో ఫారెస్ట్‌ రేంజ్‌ ఆఫీసర్లు

ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ 37 ఫారెస్ట్‌ రేంజ్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
అర్హత: డిగ్రీ. అగ్రికల్చర్‌, బోటనీ, కెమిస్ట్రీ, కంప్యూటర్‌ అప్లికేషన్స్‌ / కంప్యూటర్‌ సైన్స్‌, ఇంజినీరింగ్‌ (అగ్రికల్చర్‌/ కెమికల్‌ / సివిల్‌ / కంప్యూటర్‌ / ఎలక్ట్రికల్‌ / ఎలక్ట్రానిక్స్‌ /మెకానికల్‌) పర్యావరణ శాస్త్రం, ఫారెస్ట్రీ, జాగ్రఫీ, హార్టీకల్చర్‌, మ్యాథమెటిక్స్‌, ఫిజిక్స్‌, స్టాటిస్టిక్స్‌, వెటర్నరీ సైన్స్‌, జువాలజీ విద్యార్హతతో పాటు నిర్దిష్ట శారీరక/ వైద్య ప్రమాణాలు.  
వయసు: 18 నుంచి 30 ఏళ్లు.
దరఖాస్తు ఫీజు: రూ.250 అప్లికేషన్‌ ప్రాసెసింగ్‌ ఫీజుతో పాటు, పరీక్ష ఫీజు రూ.120 చెల్లించాలి. (ఎస్సీ/ ఎస్టీ, బీసీ/ ఎక్స్‌ సర్విస్‌మెన్‌ తదితరులకు పరీక్ష ఫీజు మినహాయింపు ఉంది). ఎంపిక: స్క్రీనింగ్‌ అండ్‌ మెయిన్స్‌ పరీక్షల ఆధారంగా.
ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభ తేదీ: 15-04-2024.
దరఖాస్తుకు చివరి తేదీ: 05-05-2024.
వెబ్‌సైట్‌:: https://psc.ap.gov.in/


వాక్‌ ఇన్‌
ప్రాజెక్ట్‌ టెక్నికల్‌ సపోర్ట్‌ పోస్టులు

ఐసీఎంఆర్‌కు చెందిన నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ రిసెర్చ్‌ ఇన్‌ ట్యూబర్‌ క్యులోసిస్‌ (ఎన్‌ఐఆర్‌టీ) కింది విభాగాల్లో 16 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

  • ప్రాజెక్ట్‌ రిసెర్చ్‌ సైంటిస్ట్‌ 2 (మెడికల్‌): 01
  • ప్రాజెక్ట్‌ టెక్నికల్‌ సపోర్ట్‌ 3 (ఫీల్డ్‌ ఇన్వెస్టిగేటర్‌): 01 
  • ప్రాజెక్ట్‌ టెక్నికల్‌ సపోర్ట్‌ 2 (ల్యాబొరేటరీ టెక్నీషియన్‌): 03
  • ప్రాజెక్ట్‌ టెక్నికల్‌ సపోర్ట్‌ 2 (ఎక్స్‌-రే టెక్నీషియన్‌): 02
  • ప్రాజెక్ట్‌  టెక్నికల్‌ సపోర్ట్‌ 1 (హెల్త్‌ అసిస్టెంట్‌): 05
  • ప్రాజెక్ట్‌ డేటా ఎంట్రీ ఆపరేటర్‌: 01
  • సీనియర్‌ ప్రాజెక్ట్‌ అసిస్టెంట్‌: 01
  • ప్రాజెక్ట్‌ డ్రైవర్‌ కమ్‌ మెకానిక్‌: 01
  • ప్రాజెక్ట్‌ మల్టీ-టాస్కింగ్‌ స్టాఫ్‌ (హెల్పర్‌): 01

అర్హత: ఇంటర్‌, డిగ్రీ, ఎంబీబీఎస్‌, లైఫ్‌ సైన్సెస్‌/ క్లినికల్‌ అండ్‌ పారా క్లినికల్‌ సైన్సెస్‌లో డిగ్రీ, (ఎమ్‌ఎల్‌టీ/ డీఎంఎల్‌టీ) ఇంటర్‌, డిప్లొమా (ఎమ్‌ఎల్‌టీ/ డీఎంఎల్‌టీ)తో పాటు పని అనుభవం.
వయసు: పోస్టును అనుసరించి 25 నుంచి 35 ఏళ్లు మించరాదు.
ఇంటర్వ్యూ తేదీలు: మార్చి 20, 21. వేదిక: ఐసీఎంఆర్‌ - నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ న్యూట్రిషన్‌, మెట్రో స్టేషన్‌, తార్నాక పక్కన, ఉస్మానియా యూనివర్సిటీ, పీఓ, హైదరాబాద్‌
వెబ్‌సైట్‌:https://www.nirt.res.in/


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని