నోటీస్‌బోర్డు

నోయిడాలోని ఎడ్యుకేషనల్‌ కన్సల్టెంట్స్‌ ఇండియా లిమిటెడ్‌... ఒప్పంద ప్రాతిపదికన శ్రీలంకలోని పాఠశాలల్లో 50 టీజీటీ, పీజీటీ ట్రెయినీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

Updated : 19 Mar 2024 00:16 IST

ప్రభుత్వ ఉద్యోగాలు

ఎడ్‌సిల్‌లో టీచర్‌ ట్రెయినీలు

నోయిడాలోని ఎడ్యుకేషనల్‌ కన్సల్టెంట్స్‌ ఇండియా లిమిటెడ్‌... ఒప్పంద ప్రాతిపదికన శ్రీలంకలోని పాఠశాలల్లో 50 టీజీటీ, పీజీటీ ట్రెయినీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
సబ్జెక్టులు: ఇంగ్లిష్‌, మ్యాథమెటిక్స్‌, బయాలజీ, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ.
అర్హత: సంబంధిత విభాగంలో మాస్టర్‌ డిగ్రీ, బీఈడీ, పని అనుభవంతో పాటు తమిళం/ ఆంగ్ల భాషల్లో బోధన ప్రావీణ్యం.
వయసు: 65 ఏళ్లు మించకూడదు.
జీతం: నెలకు రూ.1,25,000.
ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ: 20-04-2024.
వెబ్‌సైట్‌:https://hcicolombo.gov.in/edu_consult


239 ఇండస్ట్రియల్‌ ట్రెయినీ పోస్టులు

తమిళనాడు రాష్ట్రం నైవేలిలోని నైవేలి లిగ్నైట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌... 239 ఇండస్ట్రియల్‌ ట్రెయినీ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
1. ఇండస్ట్రియల్‌ ట్రెయినీ/ ఎస్‌ఎంఈ అండ్‌ టెక్నికల్‌): 100
2. ఇండస్ట్రియల్‌ ట్రెయినీ (మైన్స్‌ అండ్‌ సపోర్ట్‌ సర్వీసెస్‌): 139
అర్హత: టెన్త్‌, ఐటీఐ, సంబంధిత ట్రేడ్‌లో డిప్లొమా.
వయసు: యూఆర్‌/ ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులు 37 ఏళ్లు; ఓబీసీలకు 40 ఏళ్లు, ఎస్సీ/ఎస్టీలకు  42 సంవత్సరాలు మించకూడదు.
స్ట్టైపెండ్‌: నెలకు ఇండస్ట్రియల్‌ ట్రైనీ/ ఎస్‌ఎంఈ అండ్‌ టెక్నికల్‌ అభ్యర్థులకు రూ.18,000 - రూ.22,000. ఇండస్ట్రియల్‌ ట్రెయినీ (మైన్స్‌ అండ్‌ సపోర్ట్‌ సర్వీసెస్‌) అభ్యర్థులకు రూ.14,000 - రూ.18,000.
ఎంపిక: రాత పరీక్ష, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా.
దరఖాస్తు ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ ప్రారంభం: 20/03/2024.
దరఖాస్తు ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ ముగింపు: 19/04/2024.
వెబ్‌సైట్‌: www.nlcindia.in/new_website/index.htm


ఫోరెన్సిక్‌ సైన్స్‌ యూనివర్సిటీలో ...

గాంధీనగర్‌లోని కేంద్ర హోం మంత్రిత్వశాఖకు చెందిన నేషనల్‌ ఫోరెన్సిక్‌ సైన్స్‌ యూనివర్సిటీ 39 టీచింగ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
1. ప్రొఫెసర్‌ 2. అసోసియేట్‌ ప్రొఫెసర్‌ 3. అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌
విభాగాలు: ఫోరెన్సిక్‌ సైకాలజీ, న్యూరోసైకాలజీ, క్లినికల్‌ సైకాలజీ, క్రిమినాలజీ, సైబర్‌ సెక్యూరిటీ, డిజిటల్‌ ఫోరెన్సిక్‌, ఫోరెన్సిక్‌ బయాలజీ/ బయోటెక్నాలజీ/ డీఎన్‌ఏ, ఫోరెన్సిక్‌ సైన్స్‌, జనరల్‌ కెమిస్ట్రీ, లా, ఫోరెన్సిక్‌ కెమిస్ట్రీ/ టాక్సికాలజీ, జనరల్‌ మేనేజ్‌మెంట్‌, అకౌంట్స్‌ అండ్‌ ఫైనాన్స్‌, డేటా అనాలసిస్‌, సైబర్‌/ ఐటీ/ డిజిటల్‌ ఫోరెన్సిక్స్‌/ పోలీస్‌ అడ్మినిస్ట్రేషన్‌/ సైన్స్‌.
అర్హత: కనీసం 60% మార్కులతో సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీతో పాటు పని అనుభవం.
జీతం: నెలకు ప్రొఫెసర్‌ పోస్టుకు రూ.1,59,100. అసోసియేట్‌ ప్రొఫెసర్‌ పోస్టుకు రూ.1,39,600. అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుకు రూ.70,900.
ఎంపిక: రాత పరీక్ష, స్కిల్‌ టెస్ట్‌, ఇంటర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు ఫీజు: రూ.1000. ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఉంటుంది.
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 14-04-2024.
వెబ్‌సైట్‌:https://www.nfsu.ac.in/


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని