సెక్యూరిటీ ప్రింటింగ్‌ ప్రెస్‌లో అవకాశాలు

హైదరాబాద్‌లోని సెక్యూరిటీ ప్రింటింగ్‌ ప్రెస్‌ 96 జూనియర్‌ టెక్నీషియన్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

Updated : 19 Mar 2024 00:15 IST

హైదరాబాద్‌లోని సెక్యూరిటీ ప్రింటింగ్‌ ప్రెస్‌ 96 జూనియర్‌ టెక్నీషియన్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఆన్‌లైన్‌ పరీక్ష, ఇంటర్వ్యూ, ధృవపత్రాల పరిశీలనతో అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 

ఏ పోస్టులు.. ఎన్ని?

  • సూపర్‌వైజర్‌ (టీవో-ప్రింటింగ్‌)-2 
  • సూపర్‌వైజర్‌ (టెక్‌-కంట్రోల్‌)-5
  • సూపర్‌వైజర్‌ (ఓఎల్‌)-1
  • జూనియర్‌ ఆఫీస్‌ అసిస్టెంట్‌-12
  • జూనియర్‌ టెక్నీషియన్‌ (ప్రింటింగ్‌/ కంట్రోల్‌): 68
  • జూనియర్‌ టెక్నీషియన్‌ (ఫిట్టర్‌): 3
  • జూనియర్‌ టెక్నీషియన్‌ (వెల్డర్‌): 1
  • జూనియర్‌ టెక్నీషియన్‌ (ఎలక్ట్రానిక్స్‌/ ఇన్‌స్ట్రుమెంటేషన్‌):3 బీఫైర్‌మ్యాన్‌:1

ప్రింటింగ్‌/ కంట్రోల్‌, ఇంజినీరింగ్‌, రిసోర్స్‌ మేనేజ్‌మెంట్‌ విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.

వయసు: సూపర్‌వైజర్‌/ సూపర్‌వైజర్‌ (టెక్నికల్‌ కంట్రోల్‌) పోస్టులకు 18-30 సంవత్సరాలు, జూనియర్‌ టెక్నీషియన్‌ (ప్రింటింగ్‌/ కంట్రోల్‌) జూనియర్‌ టెక్నీషియన్‌ - ఫిట్టర్‌/ వెల్డర్‌/ ఎలక్ట్రానిక్స్‌/ ఇన్‌స్ట్రుమెంటేషన్‌ పోస్టులకు 18-25 ఏళ్లు, జూనియర్‌ ఆఫీస్‌ అసిస్టెంట్‌ పోస్టులకు 18-28 ఏళ్ల మధ్య ఉండాలి.
గరిష్ఠ వయసులో ఎస్సీ/ఎస్టీలకు 5 ఏళ్లు, ఓబీసీలకు 3 ఏళ్లు, పీడబ్ల్యూబీడీలకు 10-15 ఏళ్లు, ఎక్స్‌సర్వీస్‌మెన్‌కు 3 ఏళ్ల సడలింపు ఉంటుంది. డిపార్ట్‌మెంటల్‌ అభ్యర్థులకు గరిష్ఠ వయసు లేదు.
దరఖాస్తు రుసుము రూ.600. ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగ అభ్యర్థులకు రూ.200.
1. జూనియర్‌ టెక్నీషియన్‌ (ప్రింటింగ్‌/కంట్రోల్‌)-68: ప్రింటింగ్‌ ట్రేడ్‌లో ఎన్‌సీవీటీ/ ఎస్‌సీవీటీ గుర్తింపు పొందిన ఫుల్‌టైమ్‌ ఐటీఐ సర్టిఫికెట్‌ ఉండాలి. లిథో ఆఫ్‌సెట్‌ మెషీన్‌ మైండర్‌/ లెటర్‌ ప్రెస్‌ మెషీన్‌ మైండర్‌/ ఆఫ్‌సెట్‌ ప్రింటింగ్‌/ ప్లేట్‌మేకింగ్‌/ ఎలక్ట్రో ప్లేటింగ్‌/ ఫుల్‌టైమ్‌ ఐటీఐ ఇన్‌ ప్లేట్‌ మేకర్‌ కమ్‌ ఇంపోజిటర్‌/ హ్యాండ్‌ కంపోజింగ్‌ ఉండాలి. లేదా ప్రింటింగ్‌ టెక్నాలజీలో ఫుల్‌టైమ్‌ డిప్లొమా ఉండాలి.  
2. జూనియర్‌ ఆఫీస్‌ అసిస్టెంట్‌-12: 55 శాతం మార్కులతో డిగ్రీ పాసవ్వాలి. కంప్యూటర్‌పైన టైపింగ్‌ స్పీడ్‌ ఇంగ్లిష్‌లో నిమిషానికి 40 పదాలు/ హిందీలో 30 పదాలు.  
ఎంపిక: జూనియర్‌ టెక్నీషియన్‌ (ప్రింటింగ్‌/ కంట్రోల్‌/ ఫిట్టర్‌/ వెల్డర్‌/ ఎలక్ట్రానిక్స్‌/ ఇన్‌స్ట్రుమెంటేషన్‌), ఫైర్‌మెన్‌ పోస్టులకు..

  • ప్రశ్న పత్రంలో పార్ట్‌-ఎ, బి ఉంటాయి. 120 ప్రశ్నలకు, 150 మార్కులు. వ్యవధి 120 నిమిషాలు.
  • పార్ట్‌-ఎలో: జనరల్‌ అవేర్‌నెస్‌ 15 ప్రశ్నలు - 15 మార్కులు, అరిథ్‌మెటిక్‌ 15 ప్రశ్నలు - 15 మార్కులు, బేసిక్‌ ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ స్కిల్స్‌ - 15 ప్రశ్నలు - 15 మార్కులు, జనరల్‌ ఇంటెలిజెన్స్‌ అండ్‌ రీజనింగ్‌ 15 ప్రశ్నలు - 15 మార్కులు.
  • పార్ట్‌-బిలో: టెక్నికల్‌ సబ్జెక్ట్‌ (విద్యార్హతలకు సంబంధించిన) 60 ప్రశ్నలకు 90 మార్కులు.

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 15.04.2024
వెబ్‌సైట్‌: https://spphyderabad.spmcil.com/en/


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని