గోవా షిప్‌యార్డ్‌లో నాన్‌-ఎగ్జిక్యూటివ్‌ ఉద్యోగాలు

మినీరత్న కేటగిరీకి చెందిన గోవా షిప్‌యార్డ్‌  లిమిటెడ్‌ (జీఎస్‌ఎల్‌) 106 నాన్‌-ఎగ్జిక్యూటివ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. రాత పరీక్ష/ ధ్రువపత్రాల పరిశీలన/ స్కిల్‌/ ట్రేడ్‌ టెస్ట్‌ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

Published : 20 Mar 2024 00:11 IST

మినీరత్న కేటగిరీకి చెందిన గోవా షిప్‌యార్డ్‌  లిమిటెడ్‌ (జీఎస్‌ఎల్‌) 106 నాన్‌-ఎగ్జిక్యూటివ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. రాత పరీక్ష/ ధ్రువపత్రాల పరిశీలన/ స్కిల్‌/ ట్రేడ్‌ టెస్ట్‌ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

పోస్టులకు ఎంపికై]నవారిని ఫిక్స్‌డ్‌ టర్మ్‌ కాంట్రాక్ట్‌ ప్రాతిపదికన మూడేళ్ల కాలానికి ఉద్యోగంలోకి తీసుకుంటారు. ఆ తర్వాత మరో రెండేళ్లు పొడిగిస్తారు.

1. అసిస్టెంట్‌ సూపరింటెండెంట్‌ (హెచ్‌ఆర్‌)-2: బ్యాచిలర్‌ ఆఫ్‌ బిజినెస్‌ అడ్మినిస్ట్రేషన్‌ పాసవ్వాలి. లేదా ఏదైనా డిగ్రీతోపాటు పీజీ డిప్లొమా/డిగ్రీ ఇన్‌ పర్సనల్‌ మేనేజ్‌మెంట్‌/ ఇండస్ట్రియల్‌ రిలేషన్స్‌/ లేబర్‌ లా అండ్‌ లేబర్‌ వెల్ఫేర్‌/ బీఎస్‌డబ్ల్యూ/ బీఏ (సోషియాలజీ) ఉత్తీర్ణులవ్వాలి. హెచ్‌ఆర్‌/అడ్మిన్‌లో ఐదేళ్ల అనుభవం ఉండాలి. గరిష్ఠ వయసు 36 ఏళ్లు.

2. అసిస్టెంట్‌ సూపరింటెండెంట్‌ (హిందీ ట్రాన్స్‌లేటర్‌)-1: ఇంగ్లిష్‌ తప్పనిసరి సబ్జెక్టుగా హిందీ డిగ్రీ చదవాలి. హిందీ నుంచి ఇంగ్లిష్‌లోకి, ఇంగ్లిష్‌ నుంచి హిందీలోకి అనువాదం చేయడంలో ఏడాది డిప్లొమా ఉండాలి. రెండేళ్ల అనుభవం ఉండాలి. వయసు 33 ఏళ్లు మించకూడదు.

3. అసిస్టెంట్‌ సూపరింటెండెంట్‌ (సీఎస్‌) -1: ఇంటర్‌ కంపెనీ సెక్రటరీ కోర్సు పూర్తిచేయాలి. రెండేళ్ల పని అనుభవం ఉండాలి. గరిష్ఠ వయసు 33 సంవత్సరాలు.

4. టెక్నికల్‌ అసిస్టెంట్‌ (ఎలక్ట్రికల్‌) -4: ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌ డిప్లొమా పూర్తిచేయాలి. రెండేళ్ల పని అనుభవం ఉండాలి. ఆటోక్యాడ్‌ పరిజ్ఞానం ఉండాలి. వయసు 33 ఏళ్లు మించకూడదు.

5. టెక్నికల్‌ అసిస్టెంట్‌ (ఇన్‌స్ట్రుమెంటేషన్‌) -1: ఇన్‌స్ట్రుమెంటేషన్‌ ఇంజినీరింగ్‌ డిప్లొమా పూర్తిచేయాలి. రెండేళ్ల పని అనుభవం ఉండాలి. వయసు 33 ఏళ్లు.

6. టెక్నికల్‌ అసిస్టెంట్‌ (మెకానికల్‌)-4: మెకానికల్‌ ఇంజినీరింగ్‌ డిప్లొమా పాసవ్వాలి. రెండేళ్ల పని అనుభవం ఉండాలి. ఆటోక్యాడ్‌ పరిజ్ఞానం ఉండాలి. గరిష్ఠ వయసు 33 ఏళ్లు.

7. టెక్నికల్‌ అసిస్టెంట్‌ (షిప్‌బిల్డింగ్‌)-20: షిప్‌బిల్డింగ్‌ ఇంజినీరింగ్‌ డిప్లొమా పాసై.. రెండేళ్ల అనుభవం ఉండాలి. ఆటోక్యాడ్‌ పరిజ్ఞానం ఉండాలి. వయసు 33 ఏళ్లు మించకూడదు.

8. టెక్నికల్‌ అసిస్టెంట్‌ (సివిల్‌)-1: సివిల్‌ ఇంజినీరింగ్‌ డిప్లొమా పాసై.. రెండేళ్ల అనుభం ఉండాలి. వయసు 33 సంవత్సరాలు.

9. టెక్నికల్‌ అసిస్టెంట్‌ (ఐటీ)-1: ఐటీ/ కంప్యూటర్‌ ఇంజినీరింగ్‌ డిప్లొమా పాసై.రెండేళ్ల అనుభవం ఉండాలి. హార్డ్‌వేర్‌, నెట్‌వర్క్‌ సమస్యా పరిష్కార నైపుణ్యం ఉండాలి. వయసు 33 ఏళ్లు మించకూడదు.

10. ఆఫీస్‌ అసిస్టెంట్‌ - క్లరికల్‌ స్టాఫ్‌-32: ఏదైనా డిగ్రీ పాసై.. కంప్యూటర్‌ అప్లికేషన్స్‌లో ఏడాది సర్టిఫికెట్‌ కోర్సు పూర్తిచేయాలి. నాలుగేళ్ల పని అనుభవం ఉండాలి. గరిష్ఠ వయసు 36 ఏళ్లు.

11. ఆఫీస్‌ అసిస్టెంట్‌ (ఫైనాన్స్‌/ఇంటర్నల్‌ ఆడిట్‌)-6: కామర్స్‌ డిగ్రీ పాసై.. కంప్యూటర్‌ అప్లికేషన్స్‌లో ఏడాది సర్టిఫికెట్‌ కోర్సు చేయాలి. గరిష్ఠ వయసు 33 ఏళ్లు.

12. పెయింటర్‌-20: పదోతరగతి, ఐదేళ్ల పని అనుభవం ఉండాలి.గరిష్ఠ వయసు 36 ఏళ్లు.

13. వెహికల్‌ డ్రైవర్‌-5: పదో తరగతి పాసై హెవీ వెహికల్‌ డ్రైవింగ్‌ లైసెన్స్‌, ఐదేళ్ల పని అనుభవం ఉండాలి. గరిష్ఠ వయసు 36 ఏళ్లు..

14. రికార్డ్‌ కీపర్‌-3: పదోతరగతి పాసై.. కంప్యూటర్‌ అప్లికేషన్స్‌లో 6 నెలల కంప్యూటర్‌ కోర్సు చేయాలి. రికార్డ్‌ కీపింగ్‌ పరిజ్ఞానం ఉండాలి. వయసు 33 ఏళ్లు..

15. కుక్‌-3: పదోతరగతితో పాటు కనీసం ఐదేళ్ల పని అనుభవం ఉండాలి. ఇండియన్‌/ కాంటినెంటల్‌/ చైనీస్‌ ఫుడ్‌ తెలిసినవారికి ప్రాధాన్యం. గరిష్ఠ వయసు 33 ఏళ్లు..

16. ప్లంబర్‌-1: ప్లంబర్‌ ట్రేడ్‌లో ఐటీఐ పూర్తిచేయాలి. ఐదేళకల పని అనుభవం ఉండాలి. గరిష్ఠ  వయసు 36 ఏళ్లు.

17. సేఫ్టీ స్టివార్డ్‌-1: పదో తరగతిపాటు ఇండస్ట్రియల్‌ సేఫ్టీ/ ఫైర్‌ అండ్‌ సేఫ్టీ/ సేఫ్టీ మేనేజ్‌మెంట్‌లో ఏడాది డిప్లొమా పూర్తిచేయాలి. ఐదేళ్ల అనుభవం ఉండాలి. గరిష్ఠ వయసు 36 ఏళ్లు.


గమనించండి

  • హిందీ, ఇంగ్లిష్‌తోపాటు కొంకణి/మరాఠీ తెలిసిన అభ్యర్థులకు ప్రాధాన్యమిస్తారు.
  • రాత పరీక్ష.. కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌ (సీబీటీ) లేదా పెన్‌ పేపర్‌ బేస్డ్‌ టెస్ట్‌ (పీబీటీ) విధానంలో ఉంటుంది.
  • జనరల్‌ ఆప్టిట్యూడ్‌ ప్రశ్నలు 25 శాతం, సబ్జెక్ట్‌/ ట్రేడ్‌ సంబంధిత ప్రశ్నలు 75 శాతం ఉంటాయి.
  • రాత, స్కిల్‌ టెస్ట్‌లో జనరల్‌/ ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులు 40 శాతం, ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూబీడీ/ ఓబీసీ (ఎన్‌సీఎల్‌) అభ్యర్థులు 35 శాతం కనీసార్హత మార్కులు సంపాదించాలి.

దరఖాస్తుకు చివరి తేదీ: 27.03.2024
వెబ్‌సైట్‌:www.goashipyard.in


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని