నోటిఫికేషన్స్‌

ఇండియన్‌ బ్యాంక్‌ దేశవ్యాప్తంగా ఉన్న ఐబీ శాఖల్లో స్కేల్‌ 1, 2, 3, 4లలో స్పెషలిస్ట్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్‌ దరఖాస్తులు కోరుతోంది.

Updated : 22 Mar 2024 03:02 IST

గవర్నమెంట్‌ జాబ్స్‌
ఇండియన్‌ బ్యాంక్‌లో స్పెషలిస్ట్‌ ఆఫీసర్‌ పోస్టులు

ఇండియన్‌ బ్యాంక్‌ దేశవ్యాప్తంగా ఉన్న ఐబీ శాఖల్లో స్కేల్‌ 1, 2, 3, 4లలో స్పెషలిస్ట్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్‌ దరఖాస్తులు కోరుతోంది.

  • మొత్తం పోస్టుల సంఖ్య: 146.

1. చీఫ్‌ మేనేజర్‌ 2. సీనియర్‌ మేనేజర్‌
3. అసిస్టెంట్‌ మేనేజర్‌ 4. మేనేజర్‌

విభాగాలు: క్రెడిట్‌, ఎన్‌ఆర్‌ బిజినెస్‌ రిలేషన్‌షిప్‌, సెక్యూరిటీ, ఎంఎస్‌ఎంఈ రిలేషన్‌షిప్‌, డిజిటల్‌ మార్కెటింగ్‌, ఎస్‌ఈవో అండ్‌ వెబ్‌సైట్‌ స్పెషలిస్ట్‌, సోషల్‌ మీడియా స్పెషలిస్ట్‌, క్రియేటివ్స్‌ ఎక్స్‌పర్ట్‌, ఫారెక్స్‌/ ట్రేడ్‌ ఫైనాన్స్‌, ట్రెజరీ డీలర్‌, ట్రేడింగ్‌/ ఆర్బిట్రేజ్‌ ఇన్‌ కరెన్సీ ఫ్యూచర్స్‌, ట్రేడింగ్‌ ఇన్‌ ఇంటర్‌బ్యాంక్‌, ఈక్విటీ డీలర్‌ తదితరాలు.

అర్హత: సంబంధిత విభాగంలో సీఏ/ సీడబ్ల్యూఏ/ ఐసీడబ్ల్యూఏ, డిగ్రీ, పీజీ డిగ్రీ/ డిప్లొమా ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం.

ఎంపిక విధానం: దరఖాస్తుల షార్ట్‌లిస్ట్‌, రాత/ ఆన్‌లైన్‌ టెస్ట్‌, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా. దరఖాస్తు రుసుము: రూ.1000. ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగ అభ్యర్థులకు రూ.175. ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 01-04-2024.

వెబ్‌సైట్‌: https://www.indianbank.in/


కేంద్ర శాఖల్లో వివిధ పోస్టులు

దేశవ్యాప్తంగా కేంద్ర విభాగాలు/ శాఖల్లో డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (యూపీఎస్సీ) దరఖాస్తులు కోరుతోంది.

  • మొత్తం పోస్టుల సంఖ్య: 28.

1. ఆంత్రోపాలజిస్ట్‌ (ఆంత్రోపాలాËజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా): 08 పోస్టులు
2. అసిస్టెంట్‌ కీపర్‌ (ఆంత్రోపాలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా): 01 పోస్టు
3. సైంటిస్ట్‌-బి (కంప్యూటర్‌ సైన్స్‌/ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ): 03 పోస్టులు
4. రిసెర్చ్‌ ఆఫీసర్‌/ ప్లానింగ్‌ ఆఫీసర్‌ (డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ ఎంప్లాయ్‌మెంట్‌): 01 పోస్టు
5. అసిస్టెంట్‌ మైనింగ్‌ జియాలజిస్ట్‌ (ఇండియన్‌ బ్యూరో ఆఫ్‌ మైన్స్‌): 01 పోస్టు
6. అసిస్టెంట్‌ మినరల్‌ ఎకనామిస్ట్‌ (ఇండియన్‌ బ్యూరో ఆఫ్‌ మైన్స్‌): 01 పోస్టు
7. ఎకనమిక్‌ ఆఫీసర్‌ (రూరల్‌ డెవలప్‌మెంట్‌ డిపార్ట్‌మెంట్‌): 09 పోస్టులు
8. సీనియర్‌ లెక్చరర్‌/ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ (అనస్థీషియాలజీ): 03 పోస్టులు
9. సీనియర్‌ లెక్చరర్‌/ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ (రేడియో-డయాగ్నోసిస్‌): 01 పోస్టు

అర్హత: సంబంధిత విభాగంలో డిగ్రీ, మాస్టర్స్‌ డిగ్రీ, డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: రిక్రూట్‌మెంట్‌ టెస్ట్‌, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా.
దరఖాస్తు రుసుము: రూ.25. ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులు/ మహిళా అభ్యర్థులకు ఫీజు లేదు.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 28-03-2024.

వెబ్‌సైట్‌: https://upsc.gov.in/recruitment/recruitmentnadvertisement


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని