బిజినెస్‌ అనలిటిక్స్‌ కెరియర్‌ మెరుగేనా?

ప్రస్తుత ఉద్యోగ మార్కెట్‌లో డేటా సైన్స్‌ సంబంధిత రంగాల్లో  డిప్లొమా, డిగ్రీ, పీజీ ఉన్నవారికి ఉద్యోగావకాశాలు మెరుగ్గా ఉన్నాయి.

Published : 16 May 2024 00:18 IST

పీజీడీఎం (బిజినెస్‌ అనలిటిక్స్‌) పూర్తిచేసిన తర్వాత ఏ కంపెనీల్లో ఉద్యోగావకాశాలు ఉంటాయి?

ఎం.నాగరాజు

ప్రస్తుత ఉద్యోగ మార్కెట్‌లో డేటా సైన్స్‌ సంబంధిత రంగాల్లో  డిప్లొమా, డిగ్రీ, పీజీ ఉన్నవారికి ఉద్యోగావకాశాలు మెరుగ్గా ఉన్నాయి. బిజినెస్‌ అనలిటిక్స్‌ ప్రోగ్రాంలో వ్యాపార రంగంలో డేటా సైన్స్‌ అప్లికేషన్స్‌ గురించి చదువుతారు. అందుకని బిజినెస్‌ అనలిటిక్స్‌లో పీజిడీఎం/ఎంబీఏ చేసినవారికి ఉద్యోగావకాశాలు ఎక్కువే. బిజినెస్‌ అనలిటిక్స్‌ చదివినవారు జూనియర్‌ డేటా సైంటిస్ట్‌, జూనియర్‌ డేటా ఇంజినీర్‌, జూనియర్‌ డేటా కన్సల్టెంట్‌ లాంటి ఉద్యోగాలతో కెరియర్‌ను ప్రారంభించవచ్చు. ఉబర్‌, ఓలా, సింక్రోనీ, టీసీఎస్‌, డెలాయిట్‌, బిగ్‌ బాస్కెట్‌, అమెజాన్‌, ఫ్లిప్‌ కార్ట్‌, యాక్సెంచర్‌, మైక్రోసాఫ్ట్‌, ఐబీఎం, సెల్స్‌ ఫోర్స్‌, క్యాప్‌ జెమినీ, కాగ్నిజెంట్‌, ఇన్ఫోసిస్‌, విప్రో, గూగుల్‌ లాంటి కంపెనీల్లో, అంతర్జాతీయ బ్యాంకుల్లో బిజినెస్‌ అనలిస్టుల అవసరం అధికం. బిజినెస్‌ అనలిటిక్స్‌ రంగంలో ఉద్యోగం పొందాలంటే డిగ్రీతో పాటు ఎస్‌క్యూఎల్‌, మెషిన్‌ లెర్నింగ్‌, డేటా విజువలైజేషన్‌, స్టాటిస్టిక్స్‌, పైతాన్‌, ఆర్‌ ప్రోగ్రామింగ్‌, ఎంఎస్‌ ఎక్సెల్‌, పవర్‌ బీఐ, బిగ్‌ డేటా, డేటా వేర్‌   హౌసింగ్‌, డేటా ఎథిక్స్‌, మ్యాథమెటిక్స్‌లపై మంచి పట్టుండాలి. వీటితో  పాటు కమ్యూనికేషన్‌, ప్రాబ్లం సాల్వింగ్‌, టీం బిల్డింగ్‌, డెసిషన్‌ మేకింగ్‌ నైపుణ్యాలు కూడా చాలా అవసరం.
ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్‌, కెరియర్‌ కౌన్సెలర్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని