అనుకోకుండా కలిస్తే.. bump into 

ఎక్కడో ఒకచోట కొందరిని అనూహ్యంగా కలుస్తుంటాం. దాని గురించి బలంగా చెప్పడానికి ఇంగ్లిష్‌లో ఒక వ్యక్తీకరణ ఉంది. అదేమిటో, దాన్ని సంభాషణల్లో ఎలా ఉపయోగించవచ్చో ఉదాహరణల సాయంతో తెలుసుకుందామా! 

Published : 06 Dec 2018 00:42 IST

PHRASAL VERBS

అనుకోకుండా కలిస్తే.. bump into 

ఎక్కడో ఒకచోట కొందరిని అనూహ్యంగా కలుస్తుంటాం. దాని గురించి బలంగా చెప్పడానికి ఇంగ్లిష్‌లో ఒక వ్యక్తీకరణ ఉంది. అదేమిటో, దాన్ని సంభాషణల్లో ఎలా ఉపయోగించవచ్చో ఉదాహరణల సాయంతో తెలుసుకుందామా! 
అనుకోకుండా కలిస్తే.. bump into Ramanath: How are you, Sravan? Long since we met. Are you very busy? (శ్రవణ్‌, ఎలా ఉన్నావు? మనం కలుసుకుని చాలా రోజులైంది. తీరిక లేకుండా ఉన్నావా ఏంటి?) 
Sravan: Yes, I am. I don’t find a minute’s rest at the office. I am quite busy. I know it is long since we met (అవును. అసలు తీరికే ఉండటం లేదు. ఆఫీసులో కొంచెం వెసులుబాటు కల్పించుకునే వీలు కూడా ఉండటం లేదు. మనం కలుసుకుని చాలా కాలమైందని నాకు తెలుసు). 
Ramanath: I forgot to tell you. Yesterday I bumped into Gopal, our classmate at school. He hasn’t changed at all. He looks still youngish (నీతో చెప్పడం మరిచిపోయా. నేను నిన్న మన స్కూలు సహాధ్యాయి గోపాల్‌ను అనుకోకుండా కలుసుకున్నా. అతనిలో ఏ మార్పూ లేదు. ఇప్పటికీ యువకుడిగానే కనిపించాడు). 
Sravan: Oh, Did you? He is quite reliable and someone we can count on (అవునా? అతను బాగా ఆధారపడదగినవాడు. ఎప్పుడు మనకు సాయం కావాల్సినా చేస్తాడు). 
Ramanath: You can say that again and again. Long since we met him. He was moving faster ahead and I found it difficult to catch up with him (నువ్వు మళ్లీ మళ్లీ ఆ మాట అనొచ్చు. చాలా కాలమైంది అతన్ని కలుసుకుని. అతను చాలా వడివడిగా నడుస్తున్నాడు, అతన్ని కలుసుకోవడం నాకు చాలా కష్టం అనిపించింది). 
Sravan: He is such a nice guy.  Always dependable – someone who definitely helps us in times of need (అతను ఎంత మంచివాడో! ఎప్పుడూ ఆధారపడదగినవాడు. ఎప్పుడు మనం అవసరంలో ఉన్నా కావాల్సిన సాయం చేసిపెట్టేవాడు). 
Ramanath: His sister, it seems, was blown off in an explosion. He is very sad about it (అతని చెల్లెలు ఏదో పేలడం వల్ల చనిపోయిందట. ఆ విషయంలో అతను చాలా దుఃఖంలో ఉన్నాడు). 
Sravan: That is really unfortunate. She was very good and was always helpful (అది చాలా దురదృష్టకరం. ఆమె చాలా మంచిది, ఎప్పుడూ సాయం అందిస్తుంటుంది). 
Ramanath: Ok, then. I will see you later  (సరేలే. నిన్ను తరువాత కలుసుకుంటా). 
Bumped into – the past tense of bump into = Meeting people unexpectedly or by accident  (అనుకోకుండా ఎవరినైనా కలుసుకోవడం). 
Jagannath: Yesterday I was walking along the street, and then I saw our friend Anand  (నిన్న నేను వీధిలో నడుస్తుంటే మన స్నేహితుడు ఆనంద్‌ను చూశాను). 
Ramesh: Long since we met him. I am sure he is not in town. He is doing a job elsewhere. You bumped into him, didn’t you? (చాలా కాలమైంది అతన్ని కలుసుకుని. అతను ఇప్పుడు ఊళ్లో లేడు. ఉద్యోగం కూడా మరెక్కడో చేస్తున్నాడు. నువ్వు అతన్ని అనుకోకుండా కలుసుకున్నావు కదా?) 
Count on = depend on / rely on (ఆధారపడదగిన) 
Ramana: Our friend Jayaram is always highly reliable. He never lets us down (మన స్నేహితుడు జయరాం చాలా ఆధారపడతగినవాడు. మనకెప్పుడు సాయం కావాల్సినా చేస్తాడు). 
Lakshmipathi: Yes, he is someone who you can always count on. He is always very helpful (అవును. అతనెప్పుడూ ఆధారపడ తగినవాడే. ఎప్పుడూ సాయపడతాడు).


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని