Nothing phone 2a: భారత్‌లో నథింగ్‌ ఫోన్‌ 2ఏ స్పెషల్‌ ఎడిషన్‌.. ధర, ఫీచర్లివే..!

Nothing phone 2a: నథింగ్‌ ఫోన్‌ 2ఏ ప్రత్యేక ఎడిషన్‌ భారత్‌లో విడుదలైంది. నేవీ బ్లూ రంగులో దీన్ని తీసుకొచ్చారు.

Published : 29 Apr 2024 13:42 IST

Nothing phone 2a | ఇంటర్నెట్‌ డెస్క్‌: సోషల్‌ మీడియాలో అనేక ఊహాగానాలు, లీకుల అనంతరం ఎట్టకేలకు నథింగ్‌ ఫోన్‌ 2ఏ ప్రత్యేక ఎడిషన్‌ సోమవారం భారత్‌లో విడుదలైంది. నేవీ బ్లూ రంగులో దీన్ని తీసుకొచ్చారు. ఫ్లిప్‌కార్ట్‌లో విక్రయానికి అందుబాటులో ఉంది. దీన్ని కేవలం భారత కస్టమర్ల కోసమే రూపొందించారు. మే 2 నుంచి దీని విక్రయాలు ప్రారంభం కానున్నాయి.

నథింగ్‌ ఫోన్‌ 2ఏ ప్రత్యేక ఎడిషన్‌ 6.7 అంగుళాల అమోలెడ్‌ డిస్‌ప్లేతో వస్తోంది. 120 రీఫ్రెష్‌ రేటు, 1,300 నిట్స్‌ గరిష్ఠ బ్రైట్‌నెస్‌ దీని సొంతం. మీడియాటెక్‌ డైమెన్సిటీ 7,200 ప్రో ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. 8జీబీ/12జీబీ ర్యామ్‌, 128 జీబీ/256జీబీ స్టోరేజ్‌తో వస్తోంది. 45వాట్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీని పొందుపర్చారు. బ్లూటూత్‌ 5.3, వైఫై 6, ఎన్‌ఎఫ్‌సీ వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి. ఆండ్రాయిడ్‌ 14 ఆధారిత నథింగ్‌ 2.5 ఓఎస్‌తో పనిచేస్తుంది.

కెమెరా విషయానికి వస్తే 50ఎంపీ మెయిన్‌, 50ఎంపీ అల్ట్రావైడ్‌ కెమెరా సెటప్‌ను ఇచ్చారు. సెల్ఫీల కోసం ముందుభాగంలో 32ఎంపీ కెమెరాను పొందుపర్చారు. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఫోన్‌ 8జీబీ + 128జీబీ వేరియంట్‌ ధర రూ.23,999గా.. 8జీబీ + 256జీబీ ధర రూ.25,999గా.. 12జీబీ + 256జీబీ వేరియంట్‌ ధర రూ.27,999గా ఉంది. ఫ్లిప్‌కార్ట్‌ యాక్సిస్‌ బ్యాంక్‌ కార్డుతో కొనుగోలు చేస్తే ఐదు శాతం క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. సిటీ బ్రాండెడ్‌ క్రెడిట్‌ కార్డు ఈఎంఐ లావాదేవీలపై 10 శాతం రాయితీ లభిస్తుంది. నథింగ్‌ ఫోన్‌ 2ఏలో నలుపు, తెలుపు రంగుల ఎడిషన్లు గత నెలలోనే విడుదలైన విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని