ఆస్క్‌ ది ఎక్స్‌పర్ట్‌

నేను గ్రూప్‌-1కి దరఖాస్తు చేసినప్పుడు కుల ధ్రువీకరణ సాఫ్ట్‌ కాపీని సబ్మిట్‌ చేశాను. తర్వాత చూసుకుంటే నా దగ్గర ఉన్న హార్డ్‌ కాపీ మిస్‌ అయ్యింది. వెరిఫికేషనప్పుడు సాఫ్ట్‌ కాపీని చూపిస్తే సరిపోతుందా?

Published : 24 Jun 2022 01:33 IST

నేను గ్రూప్‌-1కి దరఖాస్తు చేసినప్పుడు కుల ధ్రువీకరణ సాఫ్ట్‌ కాపీని సబ్మిట్‌ చేశాను. తర్వాత చూసుకుంటే నా దగ్గర ఉన్న హార్డ్‌ కాపీ మిస్‌ అయ్యింది. వెరిఫికేషనప్పుడు సాఫ్ట్‌ కాపీని చూపిస్తే సరిపోతుందా?

- స్వరూప

జ: వెరిఫికేషన్‌ సమయానికి కచ్చితంగా హార్డ్‌కాపీ ఉండాలి. కుల ధ్రువీకరణ పత్రం కోసం మళ్లీ దరఖాస్తు చేసుకోండి.

నేను ఒకటో తరగతి నుంచి అయిదో తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలలో చదివాను. కానీ ఇప్పుడు ఆ స్కూల్‌ రికార్డులు లేవు. వారు నాకు బోనఫైడ్‌ సర్టిఫికెట్‌లు ఇవ్వలేదు. ఇప్పుడు వాటిని పొందడం ఎలా?

- ఒక అభ్యర్థి

జ: మీరు సంబంధిత ప్రాంత ఎంఈఓ లేదా డీఈఓ కార్యాలయం నుంచి బోనఫైడ్‌ సర్టిఫికెట్లను తెచ్చుకోవచ్ఛు●

గ్రూప్‌-3 సర్వీస్‌ పేపర్‌-2 చరిత్ర విభాగంలో తెలంగాణ చరిత్రతోపాటు భారతదేశ చరిత్ర కూడా చదవాలా?

- పి. నరసింహన్‌

జ: గ్రూప్‌-3 సర్వీస్‌ పేపర్‌-2 చరిత్ర విభాగంలో యాభైశాతం తెలంగాణ చరిత్ర, యాభై శాతం భారతదేశ చరిత్ర ఉంటాయి. కాబట్టి మీరు తెలంగాణతోపాటు భారతదేశ చరిత్రను కూడా చదవాల్సి ఉంటుంది.

మీ సందేహాలను పోస్ట్‌ చేయడానికి క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేయండి.

ప్రిపరేషన్‌ టెక్నిక్‌

మిగతా సబ్జెక్టులతో పోలిస్తే రీజనింగ్‌లో ఒక ప్రత్యేక సౌకర్యం ఉంది. ఇందులో కంఠస్థం చేయాల్సినవి, గుర్తుపెట్టుకోవాల్సినవి తక్కువ ఉంటాయి. వీలైనంత ఎక్కువ ప్రాక్టీస్‌ చేసి లాజిక్‌ నేర్చుకుంటే చాలు, ఎలాంటి ప్రశ్నలకైనా జవాబులు కనుక్కోవచ్చు మంచి మార్కులు పొందవచ్చు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని