కరెంట్‌ అఫైర్స్‌

హుగ్లీ నదిలో భారత నౌకాదళానికి చెందిన ‘దునగిరి’ అనే స్టెల్త్‌ యుద్ధ నౌకను భారత రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ప్రారంభించారు. కోల్‌కతాలోని గార్డెన్‌ రీచ్‌ షిప్‌ బిల్డర్స్‌ అండ్‌ ఇంజినీర్స్‌ సంస్థ దీన్ని నిర్మించింది. ఈ శ్రేణి కింద రూపొందే మూడు యుద్ధ నౌకల్లో ఇది రెండోది. మొదటిదైన హిమగిరి, 2020 డిసెంబరులో సిద్ధమైంది.

Published : 17 Jul 2022 02:29 IST

‘దునగిరి’ స్టెల్త్‌ యుద్ధ నౌక ప్రారంభం

హుగ్లీ నదిలో భారత నౌకాదళానికి చెందిన ‘దునగిరి’ అనే స్టెల్త్‌ యుద్ధ నౌకను భారత రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ప్రారంభించారు. కోల్‌కతాలోని గార్డెన్‌ రీచ్‌ షిప్‌ బిల్డర్స్‌ అండ్‌ ఇంజినీర్స్‌ సంస్థ దీన్ని నిర్మించింది. ఈ శ్రేణి కింద రూపొందే మూడు యుద్ధ నౌకల్లో ఇది రెండోది. మొదటిదైన హిమగిరి, 2020 డిసెంబరులో సిద్ధమైంది.

ఫెడరేషన్‌ ఆఫ్‌ తెలంగాణ ఛాంబర్స్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ (ఎఫ్‌టీసీసీఐ) నూతన అధ్యక్షుడిగా జీవకా ఇండస్ట్రీస్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ అనిల్‌ అగర్వాల్‌ ఎన్నికయ్యారు. ఈ పదవిలో ఈయన ఏడాదిపాటు కొనసాగనున్నారు.

రష్యా నుంచి ఎస్‌-400 క్షిపణి రక్షణ వ్యవస్థను కొనుగోలు చేసిన భారత్‌కు ‘క్యాట్సా’ ఆంక్షల నుంచి మినహాయింపు ఇచ్చే ఒక చట్ట సవరణకు అమెరికా ప్రతినిధుల సభ మూజువాణి ఓటుతో ఆమోదం తెలిపింది.

దక్షిణ అమెరికా తీరప్రాంత దేశమైన సురినామ్‌ తమ దేశ అత్యున్నత పౌర అవార్డు ‘ఆనరరీ ఆర్డర్‌ ఆఫ్‌ ది ఎల్లో స్టార్‌’తో భారత ఆధ్యాత్మిక గురువు, ‘ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌’ సంస్థ వ్యవస్థాపకులు శ్రీశ్రీ రవిశంకర్‌ను సత్కరించింది. ఇప్పటి వరకు దేశాధిపతులకు మాత్రమే ఇచ్చిన ఈ అవార్డును మొదటిసారి ఒక ఆధ్యాత్మిక వేత్త, ఆసియావాసి అందుకున్నారు.

శ్రీలంక తాత్కాలిక అధ్యక్షుడిగా ప్రధాన మంత్రి రణిల్‌ విక్రమసింఘె బాధ్యతలు చేపట్టారు. కార్యనిర్వాహక అధ్యక్షుడి కంటే పార్లమెంటుకే ఎక్కువ అధికారాలు కల్పించే 19వ రాజ్యాంగ సవరణను పునరుద్ధరిస్తామని తెలిపారు.


ప్రిపరేషన్‌ టెక్నిక్‌

చదవడం ప్రారంభించే ముందు సిలబస్‌ ప్రకారం సబ్జెక్టు పరిధిని తెలుసుకోవాలి. దీని వల్ల అనవసరమైన వాటిని వదిలేసే వీలు కలుగుతుంది. తర్వాత సబ్జెక్టును చాప్టర్లు, అంశాల వారీగా విడగొట్టుకొని ఒక ప్రణాళిక ప్రకారం అధ్యయనం చేయాలి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని