కరెంట్‌ అఫైర్స్‌

దక్షిణ అమెరికా తీర ప్రాంత దేశం సురినామ్‌ తమ దేశ అత్యున్నత పౌర పురస్కారం ‘ఆనరరీ ఆర్డర్‌ ఆఫ్‌ ది ఎల్లో స్టార్‌’ను 2022, జులైలో ఎవరికి ప్రదానం చేసింది?

Updated : 07 Aug 2022 03:57 IST

మాదిరి ప్రశ్నలు

* దక్షిణ అమెరికా తీర ప్రాంత దేశం సురినామ్‌ తమ దేశ అత్యున్నత పౌర పురస్కారం ‘ఆనరరీ ఆర్డర్‌ ఆఫ్‌ ది ఎల్లో స్టార్‌’ను 2022, జులైలో ఎవరికి ప్రదానం చేసింది?

జ : ప్రముఖ ఆధ్యాత్మిక గురువు, ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ సంస్థ వ్యవస్థాపకుడు శ్రీ శ్రీ రవిశంకర్‌

* చెస్‌లో గ్రాండ్‌ మాస్టర్‌ హోదా దక్కించుకున్న 74వ భారత క్రీడాకారుడిగా, తెలంగాణ నుంచి నాలుగో గ్రాండ్‌ మాస్టర్‌గా ఇటీవల ఎవరు వార్తల్లో నిలిచారు?

జ : పెద్ది రాహుల్‌ శ్రీవాస్తవ్‌

* రూ.24 వేల కోట్ల భారీ పెట్టుబడితో రాజేష్‌ ఎక్స్‌పోర్ట్స్‌ సంస్థ దేశంలోనే తొలి డిస్‌ప్లే ఫ్యాబ్‌ ప్లాంట్‌ (ల్యాప్‌టాప్‌, ట్యాబ్‌, మొబైల్స్‌లో ఉపయోగించే స్క్రీన్లు తయారు చేస్తారు)ను ఏ నగరంలో ఏర్పాటు చేయడానికి ఆ రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది?

జ : హైదరాబాద్‌

* ఆహార ధరల పెరుగుదలతో దేశంలో, ప్రపంచంలో వరుసగా ఎంత శాతం మంది పౌష్ఠికాహారాన్ని తీసుకోలేకపోతున్నారని సెంటర్‌ ఫర్‌ సైన్స్‌ అండ్‌ ఎన్విరాన్‌మెంట్‌ (సీఎస్‌ఈ) తాజా నివేదికలో వెల్లడించింది?

జ : 71 శాతం, 42 శాతం

ఈ ఏడాది యాసంగి ధాన్యం కొనుగోళ్లలో తెలంగాణలో ఏ జిల్లా మొదటిస్థానంలో నిలిచింది?

జ : నిజామాబాద్‌

* భారత్‌లో ఇంటిగ్రేటెడ్‌ ఫుడ్‌ పార్కుల అభివృద్ధికి 200 కోట్ల డాలర్ల పెట్టుబడి పెట్టేందుకు భారత్‌తో ఏ దేశం ఒప్పందం కుదుర్చుకుంది?

జ : యూఏఈ


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని