ప్రాక్టీస్‌ బిట్లు

అటల్‌ బిహారి వాజ్‌పేయీ ఏ లోక్‌సభ కాలంలో 13 నెలలు ప్రధానిగా పనిచేసి తదుపరి అధికారాన్ని కోల్పోయారు?

Published : 17 Aug 2022 02:03 IST

ఇండియన్‌ పాలిటీ

1. అటల్‌ బిహారి వాజ్‌పేయీ ఏ లోక్‌సభ కాలంలో 13 నెలలు ప్రధానిగా పనిచేసి తదుపరి అధికారాన్ని కోల్పోయారు?
1) 12వ   2) 13వ      3) 11వ   4) 10వ
2. డాక్టర్‌ మన్మోహన్‌ సింగ్‌ ప్రభుత్వకాలంలో రూపొందించిన చట్టాలకు సంబంధించి సరైంది?
ఎ) జాతీయ సమాచార హక్కు చట్టం, 2005    
బి) జాతీయ ఆహార భద్రతా చట్టం, 2010  
సి) వృద్ధుల సంరక్షణ చట్టం, 2009  డి) నిర్భయ చట్టం, 2013
1) ఎ, సి, డి   2) ఎ, బి, డి  3) ఎ, బి, సి, డి 4) ఎ, బి, సి
3. మనదేశంలో సమాంతర కేబినెట్‌గా దేన్ని పేర్కొంటారు?
1) పార్లమెంటరీ కమిటీలు  2) ప్రధానమంత్రి కార్యాలయం  
3) అంతర్‌రాష్ట్ర మండలి   4) జాతీయాభివృద్ధి మండలి
4. 1953లో హిందూకోడ్‌ బిల్లు విషయంలో నెహ్రూ ప్రభుత్వంతో విభేదించి కేంద్రమంత్రి పదవికి రాజీనామా చేసినవారు?
1) అనంతశయనం అయ్యంగార్‌  2) డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌  
3) మొరార్జీ దేశాయ్‌ 4) సి.డి.దేశ్‌ముఖ్‌
5. కేంద్ర కార్యనిర్వాహక వర్గం గురించి రాజ్యాంగంలోని 5వ భాగంలో ఉన్న ఏ ఆర్టికల్స్‌ వివరిస్తున్నాయి?
1) ఆర్టికల్స్‌ 52 - 76 2) ఆర్టికల్స్‌ 52 - 78
3) ఆర్టికల్స్‌ 50 - 78 4) ఆర్టికల్స్‌ 51 - 78
6. కేంద్ర కార్యనిర్వాహక వర్గంలో అంతర్భాగం కానిది ఎవరు?
1) రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి   2) అటార్నీ జనరల్‌
3) ప్రధాని నేతృత్వంలోని కేంద్ర మంత్రి మండలి  
4) అడ్వకేట్‌ జనరల్‌

సమాధానాలు: 1-1; 2-1; 3-2; 4-1; 5-2; 6-4.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని