కరెంట్‌ అఫైర్స్‌

మొదటి రోహిణి నయ్యర్‌ స్మారక పురస్కారాన్ని ఎవరికి ప్రకటించారు? (ప్రణాళికా సంఘంలో పనిచేసిన ప్రముఖ ఆర్థికవేత్త రోహిణి నయ్యర్‌ పేరిట ఏర్పాటు చేసిన ఈ పురస్కారాన్ని గ్రామీణాభివృద్ధి కోసం పాటుపడిన నాగాలాండ్‌

Published : 26 Jan 2023 05:54 IST

మాదిరి ప్రశ్నలు

* మొదటి రోహిణి నయ్యర్‌ స్మారక పురస్కారాన్ని ఎవరికి ప్రకటించారు? (ప్రణాళికా సంఘంలో పనిచేసిన ప్రముఖ ఆర్థికవేత్త రోహిణి నయ్యర్‌ పేరిట ఏర్పాటు చేసిన ఈ పురస్కారాన్ని గ్రామీణాభివృద్ధి కోసం పాటుపడిన నాగాలాండ్‌ వాసికి ప్రకటించారు)
జ: సెతిరిచెమ్‌ సంగ్టమ్‌

*టెస్టు క్రికెట్‌లో తొలిరోజే 500 పరుగులకు పైగా చేసి ప్రపంచ రికార్డు సృష్టించిన జట్టు ఏది? (పాకిస్థాన్‌లోని రావల్పిండిలో పాకిస్థాన్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో ఈ జట్టు ఈ ఘనత సాధించింది) 
జ: ఇంగ్లండ్‌

* ‘క్లైమేట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఆపర్చునిటీస్‌ ఇన్‌ ఇండియాస్‌ కూలింగ్‌ సెక్టార్‌’ పేరిట ఇటీవల ఏ సంస్థ నివేదికను విడుదల చేసింది? (‘ఇండియా క్లైమేట్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ పార్ట్‌నర్స్‌ మీట్‌’ పేరిట కేరళలో రెండు రోజుల పాటు జరిగిన సదస్సులో సంస్థ ఈ నివేదికను విడుదల చేసింది)   
జ:ప్రపంచ బ్యాంకు (ఐబీఆర్‌డీ)

* 2022, డిసెంబరు 9న  అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవాన్ని ఏ థీమ్‌తో నిర్వహించారు?
జ: యునైటింగ్‌ ద వరల్డ్‌ ఎగైనెస్ట్‌ కరప్షన్‌

* ఏ రాష్ట్ర/కేంద్ర పాలిత ప్రాంతం లబ్ధిదారులకు త్వరితగతిన సంక్షేమ పథకాలను అందించేందుకు 8 అంకెలు/అక్షరాలతో కూడిన గుర్తింపు కార్డును ఇవ్వాలని నిర్ణయించింది?
జ:జమ్ము-కశ్మీర్‌

* పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ కోర్సులు చదివే విద్యార్థినులకు సంవత్సరానికి రూ.10 వేల చొప్పున స్టైపెండ్‌ అందించే పథకాన్ని ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది?
జ: అస్సాం


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని