కరెంట్‌ అఫైర్స్‌

ప్రపంచ తేనెటీగల దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహిస్తారు? (మానవుడితో పాటు ఇతర జీవుల ఆహార భద్రతకు, కొన్ని జాతుల మొక్కల మనుగడకు తేనెటీగలు, కందిరీగలు వంటి తుమ్మెద జాతులే ఆధారం.

Published : 29 May 2023 02:14 IST

మాదిరి ప్రశ్నలు

ప్రపంచ తేనెటీగల దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహిస్తారు? (మానవుడితో పాటు ఇతర జీవుల ఆహార భద్రతకు, కొన్ని జాతుల మొక్కల మనుగడకు తేనెటీగలు, కందిరీగలు వంటి తుమ్మెద జాతులే ఆధారం. అవి క్రమంగా కనుమరుగవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. తేనెటీగలు, తుమ్మెదలు అదృశ్యమైతే సుమారు 25వేల రకాల పండ్లు, కూరగాయలు, పుష్పించే మొక్కజాతుల్లో 60 శాతం నశిస్తాయని అంచనా. దీనివల్ల పంటల దిగుబడి తగ్గి ఆహార కొరత ఏర్పడుతుంది.)

జ: మే 20


ఉత్తర అట్లాంటిక్‌ మహాసముద్ర తీరంలో ఉన్న ఏ అమెరికా నగరం ఏటా 2 మి.మీ. మేర కుంగిపోతున్నట్లు యూనివర్సిటీ ఆఫ్‌ రోడ్‌ ఐలాండ్‌ సైంటిస్టుల తాజా అధ్యయనంలో వెల్లడైంది? (ఖరీదైన కలల నగరంగా, నిద్రపోని నగరంగా పేరుగాంచిన ఈ నగరంలో సముద్ర మట్టం పెరుగుదలకు  తోడు భారీ భవనాల వల్ల భూమిపై ఒత్తిడి పెరుగుతుందని, అందుకే నగరం మునిగిపోతోందని   పరిశోధకులు వెల్లడించారు.) 

జ: న్యూయార్క్‌


ప్రపంచంలో అత్యధికంగా వ్యవసాయ భూమి ఏ దేశంలో ఉంది? (ఈ దేశం తర్వాత అత్యధిక   వ్యవసాయ భూమి భారత్‌లోనే ఉంది. మనదేశంలో నేటికీ సుమారు 60 శాతం జనాభా ప్రత్యక్షంగా, పరోక్షంగా   వ్యవసాయ రంగంపైనే ఆధారపడి జీవిస్తోంది. భారత్‌లోని అన్నదాతల్లో 82 శాతం చిన్న, సన్నకారు రైతులే. దాదాపు 60 శాతం సాగు భూమి వర్షాధారమే. 37 శాతం రైతులు దారిద్య్రరేఖకు దిగువన నివసిస్తున్నారు.) 

జ: అమెరికా


భారత్‌లోని వివిధ ప్రాంతాల్లో తరచూ విజృంభిస్తున్న డెంగీని నిరోధించేందుకు ఏ రెండు భారతీయ సంస్థలు స్వదేశీ టీకా తయారీలో భాగంగా మూడో దశ క్లినికల్‌ ట్రయల్స్‌ నిర్వహించేందుకు భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్‌) ఆమోదం తెలిపింది? (ప్రపంచ ఆరోగ్య సంస్థ 2019లోనే ప్రపంచంలో ఇప్పుడున్న 10 ప్రమాదకర వ్యాధుల్లో ఒకటిగా డెంగీని గుర్తించింది.)

జ: సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా,  పానసీయ బయోటెక్‌ సంస్థ



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని