కరెంట్‌ అఫైర్స్‌

అంతర్జాతీయ నర్సుల దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహిస్తారు? (అంతర్జాతీయ నర్సుల మండలి ‘అవర్‌ నర్సెస్‌ అవర్‌ ఫ్యూచర్‌’ అనే థీమ్‌తో ఈ ఏడాది అంతర్జాతీయ నర్సుల దినోత్సవాన్ని నిర్వహించింది.

Updated : 04 Jun 2023 03:02 IST

నమూనా ప్రశ్నలు

* అంతర్జాతీయ నర్సుల దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహిస్తారు? (అంతర్జాతీయ నర్సుల మండలి ‘అవర్‌ నర్సెస్‌ అవర్‌ ఫ్యూచర్‌’ అనే థీమ్‌తో ఈ ఏడాది అంతర్జాతీయ నర్సుల దినోత్సవాన్ని నిర్వహించింది. ‘లేడీ విత్‌ ద ల్యాంప్‌’ గా పేరుగాంచిన ఆధునిక నర్సింగ్‌ స్థాపకురాలు ఫ్లోరెన్స్‌ నైటింగేల్‌ పుట్టిన రోజున ఈ
దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు.)

జ: మే 12

* ప్రపంచంలోనే తొలి ద్రవరూప నానో డీఏపీని భారత్‌కు చెందిన ఎరువుల సహకార సంస్థ ఇండియన్‌ ఫార్మర్స్‌ ఫర్టిలైజర్‌ కో-ఆపరేటివ్‌ లిమిటెడ్‌ (ఇఫ్కో)  ఆవిష్కరించింది. ఈ ఏడాది ఎన్ని కోట్ల నానో డీఏపీ లిక్విడ్‌ బాటిళ్లను ఉత్పత్తి చేయాలని ఇఫ్కో లక్ష్యంగా నిర్దేశించుకుంది? (ఇది 25 లక్షల టన్నుల సంప్రదాయ డీఏపీతో సమానం. ఇఫ్కో గుజరాత్‌లోని కలోల్‌, కాండ్లా; ఒడిశాలోని పారాదీప్‌లలో ద్రవరూప డీఏపీ ఉత్పత్తి కేంద్రాలను ఏర్పాటు చేసింది.)

జ: అయిదు కోట్లు

* అంతర్జాతీయ బెరైటీస్‌ అసోసియేషన్‌ వెల్లడించిన గణాంకాల ప్రకారం అమెరికా బెరైటీస్‌ మార్కెట్‌లో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎంత శాతం వాటాను సొంతం చేసుకుంది? (అమెరికా మార్కెట్‌లో ఒక దేశం లేదా సంస్థ ఇంత శాతం మార్కెట్‌ను చేజిక్కించుకోవడం ఇదే ప్రథమం. అన్నమయ్య జిల్లా మంగంపేట బెరైటీస్‌కు అంతర్జాతీయ బ్రాండింగ్‌ తీసుకొచ్చేందుకు అమెరికాలోని పలు చమురు ఉత్పత్తి సంస్థలతో ఏపీఎండీసీ ద్వారా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఒప్పందాలు చేసుకుంది.)

జ:44 శాతం

* కేంద్ర హోం మంత్రిత్వ శాఖ తాజా గణాంకాల ప్రకారం దేశంలో మహిళా పోలీసులు అత్యధికంగా ఉన్న రాష్ట్రాల్లో ఏ రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచింది? (దేశంలోని 28 రాష్ట్రాలతో పోల్చి చూస్తే ఈ రాష్ట్రంలో అత్యధికంగా 21.76 శాతం మంది మహిళా పోలీసులు ఉన్నారు. బిహార్‌, తమిళనాడు, మహారాష్ట్ర, గుజరాత్‌, హిమాచల్‌ప్రదేశ్‌ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. జాతీయ స్థాయిలో మహిళా పోలీసులు కేవలం 11.75 శాతమే ఉన్నారు.)

జ: ఆంధ్రప్రదేశ్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని