Telangana: పోస్ట్ మెట్రిక్ ఉపకారవేతనాల నమోదుకు మరో అవకాశం

గడచిన విద్యాసంవత్సరంలో పోస్ట్ మెట్రిక్ ఉపకారవేతనాల కోసం నమోదు చేసుకోకుండా మిగిలిన విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది.

Published : 31 May 2023 21:19 IST

హైదరాబాద్: గడచిన విద్యాసంవత్సరంలో పోస్ట్ మెట్రిక్ ఉపకారవేతనాల కోసం నమోదు చేసుకోకుండా మిగిలిన విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. 2022-23 విద్యా సంవత్సరంలో మిగిలిన విద్యార్థులు ఉపకారవేతనాల కోసం రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చు. ఈసెట్, ఎంసెట్, ఐసెట్, ఎడ్ సెట్, సీపీగెట్‌కు సంబంధించి కుత్బుల్లాపూర్‌లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ఉస్మానియా, కాళోజీ విశ్వవిద్యాలయాల పరిధిలోని విద్యార్థులు వివిధ కారణాల వల్ల నమోదు చేసుకోలేదని ప్రభుత్వం తెలిపింది. జూన్‌ 1 నుంచి 15వ తేదీ వరకు ఈ-పాస్ పోర్టల్‌ http://telangana epass.cgg.gov.in ద్వారా రిజిస్ట్రేషన్లకు అవకాశం కల్పించింది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు