JNTU: పాలేరు, మహబూబాబాద్‌లో జేఎన్‌టీయూ కాలేజీల ఏర్పాటుకు అనుమతి

ఖమ్మం జిల్లాలోని పాలేరు, ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని మహబూబాబాద్‌లో జేఎన్‌టీయూ కాలేజీల (JNTU Colleges) ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం (TS Govt) అనుమతినిచ్చింది.

Updated : 14 Aug 2023 20:45 IST

హైదరాబాద్‌: ఖమ్మం జిల్లాలోని పాలేరు, ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని మహబూబాబాద్‌లో జేఎన్‌టీయూ కాలేజీల (JNTU Colleges) ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం (TS Govt) అనుమతినిచ్చింది. బీటెక్‌ (Btech)లో మొత్తం అయిదు కోర్సులతో ఆయా ప్రాంతాల్లో జేఎన్‌టీయూ కాలేజీలు ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఒక్కో కోర్సులో 60 సీట్లతో కాలేజీల ఏర్పాటుకు అవకాశం కల్పించింది. ప్రభుత్వ ఉత్తర్వులకు అనుగుణంగా.. సీఎస్‌ఈ (CSE), డేటా సైన్స్ (Data science), ఈసీఈ (ECE), ఈఈఈ (EEE), మెకానికల్ (Mech) కోర్సులతో కొత్త జేఎన్టీయూ కాలేజీలు ఏర్పాటు కానున్నాయి.

ఈ విద్యా సంవత్సరం నుంచే పాలేరు, మహబూబాబాద్ జేఎన్టీయూల్లో ప్రవేశాలు కల్పించనున్నారు. ఈ నెల 17 నుంచి 19 వరకు జరగనున్న ప్రత్యేక విడత వెబ్ ఆప్షన్ల నాటికి ఈ సీట్లు అందుబాటులోకి రానున్నాయి. కొత్త వాటితో కలిపి రాష్ట్రంలో జేఎన్టీయూ బీటెక్‌ కాలేజీలు ఎనిమిదికి చేరాయి. హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి, సిరిసిల్ల, జగిత్యాల, మంథని, సుల్తాన్‌పూర్, వనపర్తిలో ఇప్పటికే జేఎన్టీయూ కాలేజీలు ఉన్నాయి. 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు