UPSC CDS Result: యూపీఎస్సీ సీడీఎస్‌ (I) పరీక్ష ఫలితాలు విడుదల

యూపీఎస్సీ సీడీఎస్‌ ఫలితాలు వచ్చేశాయి. అభ్యర్థులు ఈ కింద ఇచ్చిన లింక్‌ ద్వారా ఫలితాలు తెలుసుకోవచ్చు.

Updated : 04 May 2023 17:39 IST

దిల్లీ: ఇటీవల జరిగిన యూపీఎస్సీ(UPSC) కంబైన్డ్‌ డిఫెన్స్‌ సర్వీసెస్‌(CDS 1) రాత పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాలను యూపీఎస్సీ గురువారం తన అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. ఏప్రిల్‌ 16న రాత పరీక్ష  జరగ్గా.. వేలాది మంది అభ్యర్థులు హాజరయ్యారు. వీరిలో  6,518మంది అర్హత సాధించి ఇంటర్వ్యూలకు ఎంపికైనట్టు యూపీఎస్సీ వెల్లడించింది. క్వాలిఫై కాని అభ్యర్థుల మార్కుల షీట్లను 15 రోజుల్లోపు తమ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నట్టు పేర్కొంది.  సీడీఎస్ ద్వారా రక్షణ రంగంలో మొత్తం 341 ఉద్యోగాలకు గతేడాది డిసెంబర్‌లో నోటిఫికేషన్‌ విడుదల చేసిన విషయం తెలిసిందే. 

ఫలితాల కోసం క్లిక్‌ చేయండి 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు