గర్భిణులకు టీకా శిశువులకూ రక్ష

కొవిడ్‌-19 ప్రస్తుతానికి తీవ్రంగా పరిణమించకపోతున్నా మున్ముందు ఎలా ఉంటుందన్నది తెలియదు. అందుకే జబ్బు ముప్పును తగ్గించుకోవటానికి ప్రాధాన్యం పెరుగుతోంది. ముఖ్యంగా కొవిడ్‌ ముప్పు ఎక్కువగా గలవారికిది

Updated : 15 Feb 2022 01:26 IST

కొవిడ్‌-19 ప్రస్తుతానికి తీవ్రంగా పరిణమించకపోతున్నా మున్ముందు ఎలా ఉంటుందన్నది తెలియదు. అందుకే జబ్బు ముప్పును తగ్గించుకోవటానికి ప్రాధాన్యం పెరుగుతోంది. ముఖ్యంగా కొవిడ్‌ ముప్పు ఎక్కువగా గలవారికిది అత్యవసరంగా మారింది. ఇక్కడే టీకా భరోసా కల్పిస్తోంది. పూర్తిగా టీకాలు తీసుకున్నవారికి కొవిడ్‌-19 తీవ్రం కాకపోవటం, ప్రాణాల మీదికి రాకపోవటం గమనార్హం. ఇది పుట్టబోయే పిల్లలకూ రక్షణ కల్పిస్తుండటం విశేషం. టీకాలు తీసుకున్న గర్భిణులతో పోలిస్తే- కొవిడ్‌ ఇన్‌ఫెక్షన్‌ బారినపడి, టీకాలు తీసుకోని గర్భిణులకు పుట్టిన పిల్లల్లో యాంటీబాడీల మోతాదులు తక్కువకాలం ఉంటున్నట్టు తేలింది మరి. రెండు మోతాదులు టీకా తీసుకున్న గర్భిణుల్లో కాన్పు సమయంలో వారి బొడ్డుతాడు రక్తంలో యాంటీబాడీల మోతాదులు ఎక్కువగా ఉంటున్నట్టు మసాచుసెట్స్‌ జనరల్‌ హాస్పిటల్‌ పరిశోధకులు గుర్తించారు. శిశువుల్లోనూ 57% మందిలో పుట్టిన ఆర్నెల్ల తర్వాత ఐజీజీ యాంటీబాడీలు గుర్తించదగిన స్థాయిలోనే ఉంటున్నాయి. అదే గర్భధారణ సమయంలో కొవిడ్‌ ఇన్‌ఫెక్షన్‌ బారినపడి, టీకాలు తీసుకోనివారికి పుట్టిన పిల్లల్లో 8% మందిలోనే యాంటీబాడీలు కనిపించాయి. టీకాలు గర్భిణులకు ఎక్కువ కాలం రక్షణ కల్పించటమే కాదు.. వీరికి పుట్టిన శిశువుల్లోనూ చాలామందికి ఆరు నెలల వరకూ కొవిడ్‌ నుంచి రక్షణ కల్పిస్తున్నట్టు అధ్యయన ఫలితాలు సూచిస్తున్నాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని