చిట్టి చెవులు భద్రం!
చెవి ఇన్‌ఫెక్షన్లు ఏ వయసులోనైనా రావొచ్చు. కానీ పిల్లల్లో ఎక్కువ. మూడేళ్ల వయసు వచ్చేసరికి ప్రతి ఆరుగురిలో ఐదు మంది కనీసం ఒక సారైనా చెవి ఇన్‌ఫెక్షన్‌కు గురవుతుంటారని అంచనా.
చెవి ఇన్‌ఫెక్షన్లు ఏ వయసులోనైనా రావొచ్చు. కానీ పిల్లల్లో ఎక్కువ. మూడేళ్ల వయసు వచ్చేసరికి ప్రతి ఆరుగురిలో ఐదు మంది కనీసం ఒక సారైనా చెవి ఇన్‌ఫెక్షన్‌కు గురవుతుంటారని అంచనా. దీనికి చాలావరకు బ్యాక్టీరియానే కారణం. కొన్నిసార్లు వైరస్‌తోనూ రావొచ్చు. సాధారణంగా గొంతునొప్పి, జలుబు, ఫ్లూ, ఇతర శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్ల అనంతరం కర్ణభేరి వెనకాల ద్రవం పోగుపడటం, ఉబ్బుతో చెవి ఇన్‌ఫెక్షన్ మొదలవుతుంటుంది. ఫలితంగా చెవి నొప్పి, జ్వరం, చిరాకు, ఏడుపు, నిద్ర పోకపోవటం వంటివి ఇబ్బంది పెడతాయి. దీన్ని నిర్లక్ష్యం చేయొద్దు. వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి. ఓటోస్కోప్ సాయంతో కర్ణభేరిని చూసి చెవి ఇన్‌ఫెక్షన్‌ను నిర్ధారిస్తారు. చెవిలోకి గాలిని పంప్ చేసి కర్ణభేరి వెనకాల ద్రవం ఉందో లేదో తెలుసుకుంటారు. బ్యాక్టీరియా ఇన్‌ఫెక్షన్ అయితే యాంటీబయాటిక్స్‌తో నయమైపోతుంది. నొప్పి, జ్వరం తగ్గటానికి పారాసిటమాల్ మాత్రలు, చుక్కల మందు సూచిస్తారు. చెవి ఇన్‌ఫెక్షన్ వచ్చాక బాధపడటం కన్నా నివారించుకోవటమే మంచిది. ఇందుకు ఉత్తమమైన మార్గం పిల్లలను జలుబు, ఫ్లూ బారినపడకుండా చూసుకోవటం. కుటుంబ సభ్యులంతా తరచూ చేతులను శుభ్రంగా కడుక్కుంటే సూక్ష్మక్రిములు వ్యాపించకుండా కాపాడుకోవచ్చు. ఏటా పిల్లలకు ఫ్లూ టీకా ఇప్పించాలి. జలుబు, ఫ్లూ లక్షణాలు గల పిల్లలతో కలిసి ఆడుకోకుండా చూసుకోవాలి.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Laddu Auction: బండ్లగూడ లడ్డూ @ రూ.1.26 కోట్లు
-
Virat In ODI WC 2023: ‘మీరేమన్నారో విరాట్‌కు తెలిస్తే.. మీ పని అంతే’.. కివీస్ మాజీకి శ్రీశాంత్ కౌంటర్
-
Stock Market: లాభాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు
-
Flipkart: ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ వచ్చేశాయ్.. ప్రత్యేక ఆఫర్లతో పండగ సేల్
-
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Asian Games: షూటింగ్లో మరో గోల్డ్.. వుషూలో రజతం