క్యాన్సర్‌ బాధితులకు వ్యాయామ బలం

వ్యాయామం ఎవరికైనా అవసరమే. ఇది క్యాన్సర్‌ బాధితులకూ మేలు చేస్తున్నట్టు తాజాగా బయటపడింది. ఒక మాదిరి, తక్కువ తీవ్రతతో కూడిన వ్యాయామాలు చేసేవారు కీమోథెరపీ నుంచి త్వరగా, బాగా కోలుకుంటున్నట్టు

Published : 22 Feb 2022 00:54 IST

వ్యాయామం ఎవరికైనా అవసరమే. ఇది క్యాన్సర్‌ బాధితులకూ మేలు చేస్తున్నట్టు తాజాగా బయటపడింది. ఒక మాదిరి, తక్కువ తీవ్రతతో కూడిన వ్యాయామాలు చేసేవారు కీమోథెరపీ నుంచి త్వరగా, బాగా కోలుకుంటున్నట్టు పరిశోధకులు గుర్తించారు. క్యాన్సర్‌ చికిత్సలో వ్యాయామాన్ని సురక్షితంగా జోడించుకోవచ్చని అధ్యయన ఫలితాలు సూచిస్తున్నాయి. కీమోథెరపీ అనంతరం నిస్సత్తువ వేధిస్తుంటుంది. ఇన్‌ఫెక్షన్ల ముప్పూ పెరుగుతుంది. అయితే ఒక మాదిరి వ్యాయామం చేసేవారు ఇలాంటి దుష్ప్రభావాల నుంచి త్వరగా కోలుకుంటుండటం విశేషం. అంతేకాదు.. వీరిలో కణితుల సైజు తగ్గటమూ గమనార్హం. అంటే క్యాన్సర్‌ ముదిరే అవకాశమూ తగ్గుతోందన్నమాట. బరువు తగ్గకపోయినా వీరిలో కండరాలు పుంజుకోవటం, అవయవాల చుట్టూరా కొవ్వు తగ్గటం వంటి మంచి ఫలితాలూ కనిపిస్తున్నట్టు తేలింది. రోగనిరోధక ప్రతిస్పందన బలంగానూ తయారవుతోంది. వాపు ప్రక్రియను ప్రేరేపించే రసాయనాల మోతాదులూ తగ్గుముఖం పడుతున్నాయి. అందువల్ల క్యాన్సర్‌కు భయపడాల్సిన అవసరం లేదని, చికిత్సలో భాగంగా వ్యాయామాన్నీ కొనసాగిస్తే క్యాన్సర్‌ను జయించే అవకాశముందని పరిశోధకులు భరోసా ఇస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు