కన్నీళ్లకు కసరత్తు

అదేపనిగా కంప్యూటర్లు, మొబైల్‌ఫోన్ల వంటి వాటిని చూస్తుంటే కళ్ల మీద ఒత్తిడి పెరుగుతుంది. దీంతో కన్నీటి గ్రంథి మార్గాలు సన్నబడి, కళ్లు పొడిబారే ప్రమాదముంది.

Updated : 04 Jul 2023 00:47 IST

అదేపనిగా కంప్యూటర్లు, మొబైల్‌ఫోన్ల వంటి వాటిని చూస్తుంటే కళ్ల మీద ఒత్తిడి పెరుగుతుంది. దీంతో కన్నీటి గ్రంథి మార్గాలు సన్నబడి, కళ్లు పొడిబారే ప్రమాదముంది. దీన్ని తగ్గించుకోవటానికి తేలికైన చిట్కా ఒకటుంది. చీకటి గదిలో దీపం లేదా కొవ్వొత్తి వెలిగించి తదేకంగా దాన్ని చూడాలి. వెన్ను నిటారుగా, దీపం కళ్లకు సమాన ఎత్తులో ఉండాలి. అలాగే చూస్తుంటే కన్నీరు వస్తుంది. తర్వాత కళ్లు మూసుకొని కాసేపు విశ్రాంతి తీసుకోవాలి. ఇలా కనీసం రెండు మూడు సార్లయినా చేయాలి. ఇదీ ఒకరకంగా ఏడ్వటం లాంటిదే. కానీ మనసును బాధించేది కాదు. ఒకవేళ దీపం, కొవ్వొత్తి లేకపోతే ఏదో ఒకదాని మీద దృష్టిని కేంద్రీకరించి, కన్నీరు వచ్చేలా చేసుకోవచ్చు. ఇది కళ్లకు మంచి వ్యాయామాన్ని కలిగిస్తుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని