Drinking Water: నీరు తాగటానికి దాహం వేసేంతవరకు ఆగాలా?
నీటితోనే ఆరోగ్యం (Health) అంటుంటారు నిపుణులు. మంచి ఆరోగ్యం కావాలంటే రోజుకు మన శరీరానికి అవసరమైన నీళ్లు (Drinking Water) తాగాలనేది వారి మాట. ఆ వివరాలు మీ కోసం...
మంచి ఆరోగ్యానికి నీరు (Drinking Water) అత్యంత అవసరం. మరి రోజుకు ఎంత నీరు తాగాలి? తేలికైన ప్రశ్నే గానీ దీనికి సమాధానం చెప్పటమే కష్టం. ఇది రకరకాల అంశాల మీద ఆధారపడి ఉంటుంది. అందరికీ ఒకే నియమం సరిపోదు.
- మన శరీరానికి ద్రవాలు ఎందుకు అవసరమనేది తెలుసుకుంటే రోజుకు ఎంత నీరు తాగాలనే అంచనాకు రావొచ్చు. ప్రతీ కణం, కణజాలం, అవయవం సరిగా పనిచేయటానికి నీరు తప్పనిసరి.
- మూత్రం, చెమట, మలం ద్వారా మలినాలు బయటకు పోవటానికి.. శరీర ఉష్ణోగ్రత నార్మల్‌గా ఉండటానికి.. కీళ్లు తేలికగా కదలటానికి.. సున్నితమైన కణజాలాలు దెబ్బతినకుండా ఉండటానికి నీరు తోడ్పడుతుంది.
- ఒంట్లో నీటి శాతం తగ్గితే ఇలాంటి పనులన్నీ మందగిస్తాయి. కొద్దిపాటి నీరు తగ్గినా శక్తి, ఉత్సాహం సన్నగిల్లుతాయి. అలసట ముంచుకొస్తుంది. కాబట్టి తగినంత నీరు తాగటం ప్రధానం.
- రోజుకు కనీసం 8 గ్లాసుల నీరు తాగాలనేది సాధారణ సిఫారసు. అయితే ఎంత నీరు అవసరమనేది మన ఆరోగ్యంతో పాటు ఉష్ణోగ్రత, మన శారీరక శ్రమ, పనుల వంటి వాటి ఆధారపడి ఉంటుంది.
- తగినంత నీరు తాగుతున్నామా? లేదా? అనేది గుర్తించటానికి తేలికైన మార్గం మూత్రం రంగు. మామూలుగానైతే ఇది లేత పసుపు రంగులో ఉండాలి. ఏమాత్రం ముదురు రంగులోకి మారినా తగినంత నీరు తాగటం లేదనే అర్థం.
- నీరు తాగటానికి దాహం వేసేంతవరకు ఆగటం సరికాదు. మనకు దాహం వేసే సరికే ఒంట్లో నీటి శాతం తగ్గిపోయి ఉంటుందని తెలుసుకోవాలి. కాబట్టి అప్పుడప్పుడు గొంతు తడిచేసుకుంటూ ఉండాలి.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ముందు మీరు రాయ్‌బరేలీలో గెలవండి.. రాహుల్‌కు సలహా ఇచ్చిన చెస్ దిగ్గజం
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (04/05/24)
-
పాలస్తీనా మద్దతుదారులకు హిమ్స్ సంస్థ సీఈఓ గుడ్‌న్యూస్
-
‘తుపాకీతో బెదిరించి.. అత్యాచారం చేసి..’ - ప్రజ్వల్‌పై మహిళ ఫిర్యాదు
-
అషు ‘సూపర్ డీలక్స్ బాడీ’.. సాగరకన్యలా నోరా ఫతేహి!
-
3 నెలల్లో 2 కోట్ల ఖాతాలపై వాట్సప్ నిషేధం