అరచేయంత ఆర్మడిల్లో!
హాయ్ ఫ్రెండ్స్.... ఏంటి అలా చూస్తున్నారు. ‘భలే ఉందే... ఏదైనా బొమ్మేమో’ అనుకుంటున్నారేమో! కానే కాదు. ఇదో ఆర్మడిల్లో. మరేంటి ఇంత చిన్నగా ఉంది. ఇదేమైనా పిల్ల ఆర్మడిల్లోనా అనుకునేరు. చిన్నదేమీ కాదు.. ఎదిగిన ఆర్మడిల్లోనే... మరి దీని సంగతులు, విశేషాలేంటో తెలుసుకుందామా!
చూడ్డానికి బుజ్జిబుజ్జిగా.. ముద్దుముద్దుగా.. ఉన్న దీని పేరు పింక్ ఫెయిరీ ఆర్మడిల్లో. ఈ జాతి జీవుల్లో ఇదే అతిచిన్న రకం. ఇది ఎక్కువగా అర్జెంటీనాలో కనిపిస్తుంది. ఇది ఓ ఎడారి జీవి. గడ్డి భూముల్లోనూ ఇది జీవనం సాగించగలదు. కానీ వీటిని ఎవరైనా బంధిస్తే కేవలం రెండురోజుల్లోనే తన ప్రాణాలను కోల్పోతుంది. కొత్త వాతావరణంలో మనుగడ సాధించలేదు ఇది.
దొందూ.. దొందే!
పింక్ ఫెయిరీ ఆర్మడిల్లోకు దాని రంగువల్ల ఆ పేరు వచ్చింది. వీటిలో మళ్లీ రెండు రకాలున్నాయి. అయితే వీటి గురించి బాహ్యప్రపంచానికి పెద్దగా వివరాలు తెలియవు. మొత్తంమీద వీటి సంఖ్య ఎంతో కూడా కచ్చితంగా ఇంత అనే లెక్కలు లేవు. కానీ శాస్త్రవేత్తలు మాత్రం వీటిని అరుదైన జీవులుగా చెబుతుంటారు.
కరకరలాడించేస్తుంది...
ఈ బుజ్జి జీవికి చీమలు, లార్వాలు కనిపిస్తే చాలు.. కరకరలాడించేస్తుంది. కీటకాలతో తన బొజ్జ నింపుకొంటుంది. నత్తల్ని కూడా ఎంతో ఇష్టంగా తింటుంది. అలా కేవలం మాంసాహార జీవి మాత్రమే అనుకునేరు చెట్ల ఆకులు, వేర్లను కూడా ఇది తింటుంది. కానీ ఎక్కువగా మాత్రం పురుగులనే తిని బతుకుతుంది. ఈ జీవి ఎక్కువగా బొరియల్లోనే జీవిస్తుంది. అక్కడే తన ఆహారాన్ని సంపాదించుకుంటుంది. అప్పుడప్పుడు మాత్రమే నేల మీదకు వస్తుంది. వేరే ఆహారమేదీ దొరకనప్పుడు పుచ్చకాయలు, అవకాడోలకు కూడా తన మెనూలో చోటిస్తుంది ఇది.
గ్రాముల్లోనే...
ఇది కేవలం 120 గ్రాముల బరువు తూగుతుంది అంతే. 3.5 నుంచి 4.5 అంగుళాల పొడవు మాత్రమే పెరుగుతుంది. సరిగ్గా మన అరచేతిలో అమరిపోతుంది. అందుకే ఇది అర్మడిల్లోలలోనే అతిచిన్న జీవి ఇది. ఇది కూడా తనకేదైనా ప్రమాదం ఉందని గ్రహిస్తే బంతిలా చుట్టుకుపోతుంది.
తెగ తవ్వేస్తుంది...
చిన్న జీవి అయినప్పటికీ దీనికి శక్తిమంతమైన గోర్లుంటాయి. వీటితో అది చాలా వేగంగా మట్టిని తవ్వి బొరియల్ని చేస్తుంది. అందుకే దీనికి ‘ఇసుక ఈతగాడు’ (శాండ్ స్విమ్మర్) అనే పేరు కూడా ఉంది. ఇది ఇసుకలో దూరి చాలా వేగంగా పారిపోగలదు. ఇతర జంతువులు, ఇసుక తుపానుల నుంచి తనను తాను రక్షించుకునేందుకు ఈ జీవి ఇలాగే ఇసుకలో దూరిపోతుంది.
అందమే శత్రువు...
ఇవి చూడ్డానికి ముద్దుగా, లేత గులాబీ రంగులో అందంగా ఉండటమే వీటి పాలిట శాపంగా మారుతోంది. వీటిని పెంచుకునేందుకు చాలా మంది ఆసక్తి చూపిస్తుంటారు. అందుకే స్మగ్లర్లు వీటిని బ్లాక్‌మార్కెట్లో చాలా ఎక్కువ ధరకు అమ్ముతుంటారు. కానీ ఇవి కొత్త ప్రాంతంలో ఎక్కువ రోజులు బతకలేవు. రవాణా చేసే సమయంలోనే చాలా వరకు చనిపోతుంటాయి. మామూలుగా కూడా వీటి జీవిత కాలం తక్కువే. ఇవి కేవలం నాలుగు సంవత్సరాల వరకు మాత్రమే జీవిస్తాయి. నేస్తాలూ.. మొత్తానికి ఇవీ ఈ బుజ్జి జీవి విశేషాలు. భలే ఉన్నాయి కదూ!
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Social Look: సముద్రంలో హన్సిక షికారు.. ఆండ్రియా శారీ పిక్!
-
Sports News
IND vs AUS: మూడో వన్డేలో సూర్యకుమార్ని తప్పిస్తారా? రోహిత్ ఏమన్నాడంటే..
-
Movies News
Salman khan: సల్మాన్ ఖాన్కు బెదిరింపు ఈ- మెయిల్.. భద్రత మరింత పెంపు!
-
India News
Parliament: ఇంకెన్నాళ్లీ ప్రతిష్టంభన.. అడ్డంకులు సృష్టించొద్దు: ఓం బిర్లా
-
India News
Delhi Liquor Scam: ముగిసిన ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణ.. రేపు మళ్లీ రావాలని చెప్పిన అధికారులు!
-
Sports News
MIW vs DCW: ముగిసిన ముంబయి ఇన్నింగ్స్.. దిల్లీ లక్ష్యం 110