హ్హ..హ్హ..హ్హ!

తండ్రి: టింకూ.. ఏం చేస్తున్నావు రా..టింకు: మన ఇంటి బయట టులెట్‌ బోర్డు పెడుతున్నా నాన్నా!

Published : 20 Aug 2020 01:11 IST

తండ్రి: టింకూ.. ఏం చేస్తున్నావు రా..

టింకు: మన ఇంటి బయట టులెట్‌ బోర్డు పెడుతున్నా నాన్నా!

తండ్రి: ఎందుకురా! మనం ఉన్నాంగా!

టింకు: దోమలకు ఆ సంగతి తెలియదుగా.. మన ఇంట్లో ఎవరూ లేరనుకొని వెళ్లిపోతాయి!

- మా.శ్రీ.రాజు, పాల్వంచ


టీచర్‌: గ్రామ్‌ఫోన్‌ అంటే ఏంటో తెలుసా?

చిట్టి: ఓ.. నాకు తెలుసు టీచర్‌.

టీచర్‌: వెరీ గుడ్‌.. చెప్పు చిట్టి..

చిట్టి: గ్రామాల్లో ఉండే ఫోన్లనే గ్రామ్‌ఫోన్లు అంటారు టీచర్‌.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని