దారేది?
పాపం కోతి పిల్లకు బాగా ఆకలి వేస్తోంది. దానికి అరటిపండ్లు తినాలనిపిస్తోంది. మీరు దానికి దారి చూపి కొంచెం సాయం చేయరూ!
క్విజ్.. క్విజ్..!
1. మేఘాలయ రాజధాని ఏది?
2. గౌతమబుద్ధుడి అసలు పేరు ఏంటి?
3. చేప.. వేటి సాయంతో ఊపిరి పీల్చుకుంటుంది?
4. కరోనా వ్యాక్సిన్‌ను కనుగొన్న తొలిదేశం ఏది?
5. ‘ది ల్యాండ్ ఆఫ్ మిడ్‌నైట్ సన్’ అని ఏ దేశాన్ని పిలుస్తారు?
6. ‘పార్లే-జి’ బిస్కెట్ ప్యాకెట్‌పై కనిపించే అమ్మాయి చిత్రం ఎవరిది?
పట్టికలో పదాలు
ఇక్కడి పదాలు పట్టికలో ఉన్నాయి. కనుక్కోండి చూద్దాం.
క్రమశిక్షణ, శిక్ష, శిల, తక్షణం, క్షణం, కణం, క్షమాగుణం, ఔదార్యం, ధైర్యం, దైవం, వందనం, వనం, జామపండు, దాగుడుమూతలు, పట్టుదల, విజయం
నేనెవరో తెలుసా?
నేను అయిదక్షరాల ఆంగ్ల పదాన్ని. 1, 3, 2, 4 అక్షరాలను కలిపితే ‘ఉప్పు’ అని అర్థం. 2, 3, 4, 5 అక్షరాలను కలిపితే ఆలస్యం అని, 5, 3, 4 అక్షరాలను కలిపితే ‘తిను’ అని అర్థం. ఇంతకీ నేనెవరో తెలుసా?
అక్షరాల చెట్టు
ఇక్కడ ఓ చెట్టుంది. దానికి కొన్ని అక్షరాలున్నాయి. వీటిని సరైన క్రమంలో రాస్తే మనకందరికీ ఎంతో ఇష్టమైన ఓ వ్యక్తి పేరు వస్తుంది. ఇంకేం ప్రయత్నించి చూడండి.
ఒక చిన్నమాట
Opportunities don't happen. You create them.
అవకాశాలు వాటంతట అవే రావు. మనమే సృష్టించుకోవాలి.
ఏది భిన్నం?
వీటిలో భిన్నమైనదేదో కనిపెట్టండి
నేను గీసిన బొమ్మ
జవాబులు
క్విజ్.. క్విజ్...: 1.షిల్లాంగ్ 2.సిద్ధార్థుడు 3.మొప్పలు 4.రష్యా 5.నార్వే 6.నీరుదేశ్‌పాండే
నేనెవరో తెలుసా?: slate
అక్షరాల చెట్టు: Mahatma Gandhi
ఏది భిన్నం: 2
Advertisement