ఇది కట్టడాల 'మాయ'!
చూసొచ్చా! చిచెన్ ఇట్జా
హల్లో నేస్తాలూ! చిన్నూనొచ్చేశా! ఈసారి ఎక్కడికి వెళ్లొచ్చాననుకుంటున్నారూ...? చిచెన్ ఇట్జాకు... పేరు ఎప్పుడూ విననట్టున్నా... ఇక్కడున్న కట్టడం బొమ్మ చూస్తే మీరూ గుర్తుపట్టేస్తారు. ఎందుకంటే ఇది కొత్త ప్రపంచ వింతల్లో ఒకటి. నా టూర్ కబుర్లు మొదలెట్టెయ్యనా మరి?
అసలు ఏంటిది? బోలెడు మెట్లతో ఉండే ఈ పిరమిడ్‌లాంటి కట్టడం చాలా మందికి పరిచయమే. దీన్ని టెంపుల్ ఆఫ్ కకుల్కన్‌గా పిలుస్తారు. మెక్సికోలోని యుకటన్ రాష్ట్రంలో ఉంది. ఈచుట్టుపక్కల అంటే నాలుగు చదరపు మైళ్ల విస్తీర్ణంలో ఇలాంటివే ఇంకా కొన్ని కట్టడాలుఉన్నాయి. ఆ ప్రాంతాన్నంతా కలిపి చిచెన్ ఇట్జా సిటీ లేకపోతే చిచెన్‌ఇట్జా కాంప్లెక్స్ అంటూ పిలిచేస్తారు. |
వింతల్లో ఒకటి! చిచెన్ ఇట్జా.. పేరు కాస్త చిత్రంగా ఉంది కదూ. ప్రపంచ కొత్త ఏడు వింతల్లో ఇదీ ఒకటి. 1988లో దీన్ని యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది. అద్భుతమైన మాయన్ల వాస్తు కళకు ఇది ప్రసిద్ధి. ఇక్కడున్న బోలెడు కట్టడాల్లో దేనికదే ప్రత్యేకం. |
ఇంకా ఏమేం కట్టడాలున్నాయి? అప్పట్లోనే అద్భుతమైన ప్రణాళికతో కట్టిన కట్టడాలట ఇవన్నీ. గ్రేట్ నార్త్ ఫ్లాట్‌ఫాం, ఒస్సారియో గ్రూప్, సెంట్రల్ గ్రూప్, ఓల్డ్ చిచెన్, గ్రేట్ బాల్ కోర్ట్, టెంపుల్ ఆఫ్ ద జాగ్వర్స్ అనేవీ ప్రముఖమైనవే. వీటిలో ఒస్సారియో.. పిరమిడ్ ఆకారంలోనే ఉంటుంది. |
ఎవరిదిది? దీని పేరు చూసి ఇదేమన్నా చైనీయులదా? అని నాకు డౌటొచ్చేసింది. అదే అక్కడున్న గైడు అంకుల్‌ని అడిగాను. ఆయనేం చెప్పారంటే..? మెక్సికో, మధ్య అమెరికాల్లో పూర్వం మాయన్లు ఎక్కువగా నివసిస్తుండేవారట. మెక్సికోపై మాయ నాగరికత ప్రభావం |
పిరమిడ్ కాదిది ఆలయం! కకుల్కన్ .. ఓ సర్ప దేవతామూర్తికి సంబంధించిన గుడి. దీన్ని 11 నుంచి 13వ శతాబ్దాల మధ్య కాలంలో నిర్మించారు. పిరమిడ్ ఆకారంలో గుడిని కట్టడం దీని ప్రత్యేకత. నాలుగువైపులా తొంభై ఒక్క మెట్లతో ఉందిది. ఈ అంకె మాయన్ల పురాణాల్లో ప్రముఖమైనదట. మాయ క్యాలెండర్ విశేషాలూ ఈ గుడి గోడల మీద కనిపించాయి. ఈ కట్టడాలు, శిల్పాలు అంతా కలిసి ఈ ప్రాంతం ఎంతో ప్రత్యేకంగా అనిపించింది. ఈ కాలంలో ఎవరూ ఇలాంటి నిర్మాణాలు చెయ్యలేరేమో కదా. అందుకనే ఈ కబుర్లన్నీ మీతో పంచుకున్నా. |
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Crime News
AI Chatbot: వాతావరణ మార్పులపై ఏఐ చాట్‌బాట్ రిజల్ట్.. ఆందోళనతో వ్యక్తి ఆత్మహత్య!
-
Politics News
Karnataka polls: ఎన్నికల వేళ జేడీఎస్‌కు షాక్.. మరో ఎమ్మెల్యే రాజీనామా!
-
Movies News
SIR: ‘సార్’ని అలా చూపించుంటే ఇంకా బాగుండేది: పరుచూరి గోపాలకృష్ణ
-
General News
Top Ten News @ 9PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
World News
Zelensky: ‘బుచా’ హత్యాకాండకు ఏడాది.. దోషులను ఎప్పటికీ క్షమించం!
-
Politics News
అలా మాట్లాడితే.. కేజ్రీవాల్‌పై పరువు నష్టం దావా వేస్తా: సీఎం హిమంత హెచ్చరిక