తేడాలు కనుక్కోండి

కింది బొమ్మల్లో ఆరు తేడాలున్నాయి. కనుక్కోండి చూద్దాం.

Published : 31 May 2022 00:43 IST

కింది బొమ్మల్లో ఆరు తేడాలున్నాయి. కనుక్కోండి చూద్దాం.


పదమాలిక!

ఆధారాల సాయంతో ఖాళీగడుల్లో సరైన అక్షరాలను రాయండి. అర్థవంతమైన పదాలు వస్తాయి.


ఏది వేరు?

ఇక్కడ కొన్ని పక్షుల చిత్రాలున్నాయి. ఇందులో ఒకటి మాత్రం మిగతావాటికి భిన్నం. అది ఏదో చెప్పుకోండి చూద్దాం.


చెప్పుకోండి చూద్దాం!

1. పచ్చని పెట్టెలో విచ్చుకుంటుంది. తెచ్చుకోబోతే గుచ్చుకుంటుంది. ఇంతకీ ఏంటది?
2. తోవలో పుట్టింది. తోవలో పెరిగింది. తోవలో పోయేవారిని అడ్డగించింది. ఏంటో తెలుసా?
3. పిడికెడు పొట్టోడు... కానీ కాపలాకు గట్టోడు. ఏంటో చెప్పుకోండి చూద్దాం?
4. ఆకాశంలో తేలుతుంది. మేఘం కాదు. తోకాడిస్తుంది.. పిట్టకాదు. పట్టుతప్పితే ఎటో పారిపోతుంది. ఇంతకీ అదేంటో తెలుసా?


నేనెవర్ని?

1. నేను ఆరక్షరాల ఆంగ్లపదాన్ని. 2, 3, 4 అక్షరాలను కలిపితే ‘వరుస’ అనే అర్థం వస్తుంది. 5, 6, 2, 3, 4 అక్షరాలను కలిపితే ‘విసరు’ అవుతుంది. 4, 3, 2, 5, 6 అక్షరాలను కలిపితే ‘విలువ’ అనే అర్థం వస్తుంది. ఇంతకీ నేనెవరో చెప్పుకోండి చూద్దాం?

2. నేనో ఏడక్షరాల ఆంగ్ల పదాన్ని. 4, 5, 6, 7 అక్షరాలను కలిపితే ‘కచ్చితంగా’ అనే అర్థం వస్తుంది. 4, 2, 3 అక్షరాలను కలిపితే ‘సముద్రం’ అవుతుంది. నేను ఎవరో తెలిసిందా?



నేను గీసిన చిత్రం


జవాబులు

తేడాలు కనుక్కోండి: 1.పక్షి 2.తాబేలు 3. టెడ్డీబేర్‌ చెవులు 4.పొద 5.ఆకు 6.చెట్టుకొమ్మ
చెప్పుకోండి చూద్దాం!: 1.మొగలిపువ్వు 2.ముళ్ల మొక్క 3.తాళం కప్ప 4.గాలిపటం  
పదమాలిక: 1.ఉంగరం 2.బొంగరం 3.వానరం 4.తగరం 5.సమరం 6.క్షవరం 7.సవరం 8.వివరం
ఏది వేరు: 6 (కివీ పక్షి. మిగతా అన్ని పక్షులకు మనం గుర్తించేలా రెక్కలుంటాయి. కానీ కివీకి చాలా చిన్నగా రెక్కలుంటాయి)
నేనెవర్ని?: 1. growth 2.measure


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని