ఏది భిన్నం?

వీటిలో భిన్నమైనదేదో కనిపెట్టండి

Updated : 22 Aug 2022 02:06 IST

వీటిలో భిన్నమైనదేదో కనిపెట్టండి


నేనెవర్ని?

1. నేను మూడు అక్షరాల పదాన్ని. ‘పావు’లో ఉన్నాను. ‘ఆవు’లో లేను. ‘గోవు’లో ఉన్నాను. ‘గోడ’లో లేను. ‘రంగు’లో ఉన్నాను. ‘హంగు’లో లేను. ఇంతకీ నేనెవర్ని?

2. నేనో నాలుగక్షరాల పదాన్ని. ‘మేడ’లో ఉన్నాను. ‘పేడ’లో లేను. ‘కలం’లో ఉన్నాను. ‘హలం’లో లేను. ‘పోరు’లో ఉన్నాను. ‘ఆరు’లో లేను. ‘కవాతు’లో ఉన్నాను. ‘కవాటం’లో లేను. ఇంతకీ నేనెవర్నో చెప్పగలరా?


పొడుపు కథలు

1. కొండకు గిరగిర, నేలకు టకటక, నోటికి సైసై ఏంటది?
2. చూసింది ఇద్దరు, కోసింది అయిదుగురు. తిన్నది 32 మంది. ఏంటో చెప్పుకోండి చూద్దాం?
3. ఇక్కడ ఉండవు. అక్కడ ఉండవు. దొరవారి తోటలో ఉండవు. తింటే తీపి ఉండవు. ఉమ్మేస్తే గింజలుండవు. ఏమిటవి?


క్విజ్‌.. క్విజ్‌...

1. ప్రపంచంలోకెల్లా అతిపెద్ద పక్షి పేరేంటి?
2. ప్రాణవాయువు అని దేన్ని అంటారు?

3. వెనక్కి ఎగరగల ఒకే ఒక పక్షి ఏది?
4. ఏ జంతువు వేలి ముద్రలు మనుషుల వేలిముద్రలను పోలి ఉంటాయి?

5. చైనా దేశంలో ఏ ప్రాంతాన్ని ‘చికాగో ఆఫ్‌ చైనా’ అని పిలుస్తారు?


వాక్యాల్లో కూరగాయలు!

ఈ వాక్యాల్లో కొన్ని కూరగాయల పేర్లు దాగి ఉన్నాయి. జాగ్రత్తగా చదివి కనిపెట్టండి చూద్దాం?
1. ఏంటసలు.. జమున గది నుంచి బయటకు రావడం లేదు.
2. ఆ వంకా.. ఈ వంకా.. యమునా.. ఎందుకలా దిక్కులు చూస్తావు?

3. నిజానికి ఇదో సమోసాల దుకాణం తెలుసా?
4. ఇందుకా కరకర నములుతున్నావు?

5. ఇదిగో... బిగ్గరగా అరిచి గోల చేయకు సరేనా!
6. నిన్నే బేబీ.. రవ్వదోస తింటావా.. తినవా?






సమాధానాలు:

పదమేది?: IDENTIFICATION

గజిబిజి బిజిగజి: 1.సాహసోపేతం 2.మహారాజు 3.అరటిగెల 4.వనవిహారం 5.నగరవనం 6.మహాసాగరం 7.వాతావరణం 8.మానవహారం

తప్పులే తప్పులు: 1.శతాబ్దం 2.ఆణిముత్యం 3.సంఘర్షణ 4.ఆకర్షణ 5.ఆలోచన 6.కపోతం 7.యుద్ధం 8. మేఘం

క్విజ్‌.. క్విజ్‌.: 1.ఆస్ట్రిచ్‌ 2.ఆక్సిజన్‌ను 3.హమ్మింగ్‌ బర్డ్‌ 4.కోలాబేర్‌ 5.వూహాన్‌ నగరాన్ని

నేనెవర్ని?: 1.పావురం 2.మేకపోతు

ఏది భిన్నం?: 2

వాక్యాల్లో కూరగాయలు: 1.మునగ 2.వంకాయ 3.దోస 4.కాకర 5.గోబి 6.బీర

పొడుపు కథలు: 1.వెలగపండు 2.కళ్లు, వేళ్లు, పళ్లు 3.వడగళ్లు


 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని