తేడాలు కనుక్కోండి

కింది బొమ్మల్లో ఆరు తేడాలున్నాయి. కనుక్కోండి చూద్దాం.

Updated : 16 Sep 2022 00:42 IST

కింది బొమ్మల్లో ఆరు తేడాలున్నాయి. కనుక్కోండి చూద్దాం.


పద వలయం!

ఈ ఆధారాల సాయంతో వృత్తంలోని ఖాళీలను నింపండి. అన్నీ ‘స’ అక్షరంతోనే మొదలవుతాయి.

1. గాలికి మరోపేరు 2. చెరువులాంటిది 3. ఓ చిరుతిండి 4. సమావేశం లాంటిది 5. అన్నీ, మొత్తం 6. బలం, శక్తి 7. తెలుగు వ్యాకరణం 8. కాలం


వాక్యాల్లో వ్యక్తుల పేర్లు

ఇక్కడ కొన్ని వాక్యాలు ఉన్నాయి. వాటిలో కొన్ని పేర్లు దాగున్నాయి. కనుక్కోండి చూద్దాం.

1. ఇతను నా స్నేహితుడు.. మన దుకాణంలోని తరాజును బాగు చేసింది వీళ్ల నాన్నే..!  
2. మాటిమాటికీ సెలవులు అంటే అస్సలే కుదరదు. బయటికెళ్లే పనులేమైనా ఉంటే.. ఆదివారమే చూసుకోవాలి.
3. మా నిబంధనలకు అంగీకరిస్తే సరి. లేకపోతే ఎంత పిలిచినా మేం అస్సలే రాము.
4. నీ దాదాగిరి నా దగ్గర చూపిస్తే కుదరదు. బెదిరిస్తే భయపడేవాళ్లెవరూ లేరిక్కడ.
5. కొసరి కొసరి.. తను ఆహార పదార్థాలు వడ్డిస్తుంటే.. తినడానికి నీకేం అభ్యంతరం?
6. ‘అశాంతి’ రాజ్యమేలితే..  అది అభివృద్ధికి గొడ్డలిపెట్టవుతుంది.


అక్షరాల చెట్టు

ఇక్కడ ఓ చెట్టుంది. దానికి కొన్ని అక్షరాలున్నాయి. వాటిని సరైన క్రమంలో రాస్తే అర్థవంత పదంగా మారుతుంది. ఓసారి ప్రయత్నించండి.


చెప్పగలరా?

1. ఏడు అక్షరాల ఆంగ్ల పదాన్ని నేను. 6, 7, 3 అక్షరాలు కలిస్తే ‘చీమ’ అనీ.. 5,  6, 3 అక్షరాలు కలిస్తే ‘ఎలుక’ అనే అర్థాన్నిస్తా. ఇంతకీ నేనెవరినో తెలిసిందా?

2. నేను అయిదు అక్షరాల ఆంగ్ల పదాన్ని. 1, 3, 5 అక్షరాలు కలిస్తే ‘మంచం’ అనీ.. 3, 4, 2 అక్షరాలు కలిస్తే ‘చెవి’ అనే అర్థాన్నిస్తాయి. నేనెవరినో చెప్పగలరా?


జవాబులు :

తేడాలు కనుక్కోండి : 1.ఎలుగుబంటి కాలు 2.తోక 3.కిందపడిన చేప 4.గాలం 5.చెట్టు కొమ్మ 6.పొద

పద వలయం : 1.సమీరం 2.సరస్సు 3.సమోసా 4.సదస్సు 5.సకలం 6.సత్తువ 7.సమాసం 8.సమయం

చెప్పగలరా? : 1. VETERAN 2. BREAD

 అక్షరాల చెట్టు : CONCENTRATION

వాక్యాల్లో వ్యక్తుల పేర్లు : 1.రాజు 2.ఆది 3.రాము 4.గిరి 5.సరిత 6.శాంతి


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని