చిత్రాల్లో ఏముందో!

ఈ బొమ్మల పేర్లను తెలుగులో గడుల్లో రాయండి. రంగు గడుల్లోని అక్షరాలను సరిచేసి రాస్తే అర్థవంతమైన పదం వస్తుంది.

Updated : 01 Dec 2022 00:40 IST

ఈ బొమ్మల పేర్లను తెలుగులో గడుల్లో రాయండి. రంగు గడుల్లోని అక్షరాలను సరిచేసి రాస్తే అర్థవంతమైన పదం వస్తుంది. అదేంటో కనిపెట్టండి. 


నేనెవర్ని?

1. మూడు అక్షరాల పదాన్ని నేను. ‘ప్రథమ’లో ఉంటాను కానీ ‘అథమ’లో లేను. ‘గస్తీ’లో ఉంటాను కానీ ‘సుస్తీ’లో లేను. ‘తిక్క’లో ఉంటాను కానీ ‘ముక్క’లో లేను. ఇంతకీ నేను ఎవరిని?

2. నేను నాలుగు అక్షరాల పదాన్ని. ‘సొట్ట’లో ఉంటాను కానీ ‘బుట్ట’లో లేను. ‘రచ్చ’లో ఉంటాను కానీ ‘మచ్చ’లో లేను. ‘కాలు’లో ఉంటాను కానీ ‘కీలు’లో లేను. ‘యత్నం’లో ఉంటాను కానీ ‘వినూత్నం’లో లేను. నేను ఎవరినో తెలిసిందా?


అది ఏది?

మొదటి బొమ్మను పోలి ఉన్నదేది?


రాయగలరా?

ఇక్కడ కొన్ని తెలుగు పదాలున్నాయి కదా! ఒక్కో పదానికి మరో పర్యాయపదం కూడా ఉంది. వాటిని కనిపెట్టండి చూద్దాం.


అక్షరాల చెట్టు

ఇక్కడ ఓ చెట్టుంది. దానికి కొన్ని అక్షరాలున్నాయి. వాటిని సరైన క్రమంలో రాస్తే అర్థవంతమైన పదం వస్తుంది. ఓసారి ప్రయత్నించండి.


 


జవాబులు :

చిత్రాల్లో ఏముందో!: 1.జీడిమామిడి 2.లవంగాలు 3.జింక 4.చేతికర్ర (దాగి ఉన్న పదం: జీలకర్ర)

రాయగలరా?: 1.పిల్లి- మార్జాలం 2.దారి- తోవ 3.విరి- పువ్వు 4.రుధిరం- రక్తం 5.స్వేదం- చెమట 6.కప్ప- మండూకం 7.గాలి- వాయువు 8.జలం- నీరు 9.పాలు- క్షీరం 10.మర- యంత్రం 11.బంగారం- స్వర్ణం 12.కడలి- సముద్రం 13.పావురం- కపోతం 14.గుర్తు- సంకేతం 15.ఆనందం- సంతోషం

అది ఏది?: 3

నేనెవర్ని? : 1.ప్రగతి 2.సొరకాయ

అక్షరాల చెట్టు : CONTRIBUTION


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని