గోడలు దాటి స్లాబ్‌ల దాకా వచ్చాయ్
నగర నిర్మాణాల్లో క్రమంగా పెరుగుతున్న ప్రీకాస్టింగ్ హాలో కోర్ స్లాబ్‌ల వాడకం
పనిలో వేగం.. కాంక్రీట్ వినియోగంలో 30 శాతం తగ్గుదల
ఈనాడు, హైదరాబాద్
ప్రీకాస్ట్ గోడలను ప్రహరీ కోసం విరివిగా వాడటం చూస్తున్నాం. రెండు మూడురోజుల్లోనే దీనిని నిర్మించుకునే వెసులుబాటు ఉండటంతో బాగా ప్రాచుర్యంలోకి వచ్చాయి. ప్రీకాస్ట్ టెక్నాలజీలోని సానుకూలతల దృష్ట్యా భవన నిర్మాణంలో ప్రధానమైన కోర్ స్లాబుల్లోనూ వినియోగించడం నగర నిర్మాణ రంగంలో మొదలైంది. ఇటీవల కాలంలో వాణిజ్య నిర్మాణాల్లో ఎక్కువగా వీటిని ఉపయోగిస్తున్నారు. హాలో కోర్ రిబ్బ్‌డ్ స్లాబుల వాడకంతో చాలా ప్రయోజనాలు ఉన్నాయని నిర్మాణదారులు, తయారీదారులు చెబుతున్నారు. భారీ భవనాన్ని సైతం నెలల వ్యవధిలోనే పూర్తిచేయవచ్చు. ఇందులో సమయం, డబ్బు ఆదా కావడమే కాదు స్ట్రక్చర్ బరువు గణనీయంగా తగ్గుతోంది. అగ్నికి తట్టుకోవడమే కాదు.. రబ్బర్ స్ట్రిప్‌తో శబ్దనిరోధకంగానూ బాగా పనిచేస్తుంది. ఎలక్ట్రికల్, ప్లబ్లింగ్ కోసం స్లాబులకు డ్రిల్ చేయాల్సిన పనిలేదు. ముందుగానే సూచిస్తే ఆ మేరకు స్లాబులో విద్యుత్తు, ప్లంబింగ్ పైపుల అమరిక ఉండేలా పోత పోస్తారు. తక్కువ మంది కార్మికులతో సులువుగా బిగించుకోవచ్చు.
విదేశాల్లో ఎక్కువగా..
హాలో కోర్ స్లాబ్ ఉత్తర ఐరోపా, తూర్పు యూరప్ దేశాలలో, బెల్జియంలో ఎక్కువగా వినియోగిస్తుంటారు. మనం ఇప్పుడు వాడుతున్న స్లాబ్ పూర్తిగా కాంక్రీట్‌తో నిండి ఉంటుంది. హాలో కోర్‌లో స్లాబ్ మధ్యలో ఖాళీ ఉంటుంది. దీంతో బరువు తగ్గుతుంది. మందం, కాంక్రీట్ దృఢత్వం మాత్రం సాధారణ స్లాబ్ మాదిరే ఉంటుంది. సాధారణంగా 120 సెం.మీ. వెడల్పుతో ప్రామాణిక మందం 15 సెంమీ. నుంచి 50 సెం.మీ. మధ్యలో ఉంటాయి. ఉక్కు తీగతో ఒకదానితో ఒకటి బలోపేతం చేస్తారు.
వృథా తగ్గుతుంది
ప్రీకాస్టింగ్‌లో సిమెంట్, ఇతర మెటీరియల్స్ వృథా గణనీయంగా తగ్గుతుంది. 30 శాతం తక్కువ కాంక్రీట్ వినియోగంతో ఖర్చు గణనీయంగా తగ్గుతుందని తయారీదారులు చెబుతున్నారు. వనరుల ఆదా అవుతుంది.
పర్యావరణహితం కూడా
తక్కువ కాంక్రీట్ వినియోగంతో ఆ మేరకు వాతావరణంలో కలిసే కాలుష్యకారకాలను తగ్గించినట్లు అవుతుంది. 28 శాతం కార్బన్ డై యాక్సైడ్ ఉద్గారాల విడుదలను నిలువరిస్తుంది.
* ఈ తరహా స్లాబ్‌లతో ఇళ్లలో ఇంధన వినియోగం తగ్గుతుందని చెబుతున్నారు. ఏసీలో 55 శాతం.. మొత్తంగా విద్యుత్తు వాడకంలో 30 శాతం తగ్గుతుందని స్పష్టం చేస్తున్నారు.
జాగ్రత్తగా బిగించకపోతే..
హాలో కోర్ స్లాబ్‌లు సాధారణంగా ఫ్యాక్టరీలో ఎక్కడో తయారై పని ప్రదేశం దగ్గరికి తరలిస్తారు. రవాణా సమయంలో జాగ్రత్తలు తీసుకోకపోతే అమరిక దెబ్బతినే అవకాశం ఉంటుంది. * వీటి బిగింపునకు నైపుణ్యం కలిగిన సిబ్బంది, ప్రత్యేక పరికరాలు, యంత్రాల అవసరం ఉంటుంది. * చిన్న స్పాన్‌లు ఆర్థికంగా లాభసాటి కాదు. పెద్ద ప్రాజెక్టులో చాలా పొడవైన స్పాన్‌ల వాడకంతో ప్రాజెక్ట్ వ్యయంలో కలిసి వస్తుంది.
క్యూరింగ్ చిక్కులుండవు..
స్లాబ్‌లను ఫ్యాక్టరీలో అచ్చు యంత్రాల్లో తయారు చేస్తారు కాబట్టి నాణ్యతపై పూర్తి నియంత్రణ ఉంటుంది. ఇక్కడ క్యూరింగ్ చేస్తారు. దీంతో భవనంలో స్లాబ్ నిర్మాణం తర్వాత క్యూరింగ్ చిక్కులు ఉండవు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
WHO Vs Musk: మస్క్ X టెడ్రోస్.. ట్విటర్ వార్..!
-
Politics News
KTR: ఒక్క తెలంగాణలోనే పెట్టుబడికి రూ.10 వేలు.. పంట నష్టపోతే రూ.10 వేలు : కేటీఆర్
-
Politics News
Bandi Sanjay: నాకెలాంటి నోటీసూ అందలేదు.. నేను ఇవాళ రాలేను: సిట్‌కు బండి సంజయ్ లేఖ
-
India News
Amritpal Singh: అమృత్‌పాల్ ఉత్తరాఖండ్‌లో ఉన్నాడా..? నేపాల్ సరిహద్దుల్లో పోస్టర్లు..
-
Sports News
Shashi Tharoor: సంజూను జట్టులోకి ఎందుకు తీసుకోవడం లేదు?: శశిథరూర్
-
Movies News
Ajith Kumar: హీరో అజిత్ ఇంట విషాదం