మ.. మ.. మాల్స్‌

హైదరాబాద్‌ రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్‌లో మాల్స్‌ పెరుగుతున్నాయి. రిటైల్‌ విభాగంలో కీలకమైన మాల్స్‌ 17 నిర్మాణంలో ఉన్నాయి.

Updated : 25 Nov 2023 09:23 IST

రిటైల్‌ డిమాండ్‌తో పలు ప్రాంతాల్లో నిర్మాణం 

ఈనాడు, హైదరాబాద్‌: హైదరాబాద్‌ రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్‌లో మాల్స్‌ పెరుగుతున్నాయి. రిటైల్‌ విభాగంలో కీలకమైన మాల్స్‌ 17 నిర్మాణంలో ఉన్నాయి. ఇప్పటికే పూర్తైన మాల్స్‌ 25 ఉండగా.. మరికొన్ని ప్రణాళిక దశలో ఉన్నాయని స్థిరాస్తి కన్సల్టెన్సీ సంస్థ సీబీఆర్‌ఈ నివేదిక వెల్లడించింది. హైదరాబాద్‌లో షాపింగ్‌ తీరుతెన్నుల్లో వేగంగా మార్పులు వచ్చాయి. షాపింగ్‌కు మాల్స్‌, హైస్ట్రీట్‌లకు డిమాండ్‌ ఉండటంతో వీటి మార్కెట్‌ విస్తరిస్తోంది.

  • ఇప్పటికే అందుబాటులోకి వచ్చిన 25 మాల్స్‌లో ఇనార్బిట్‌ మాల్‌, శరత్‌సిటీ మాల్‌, నెక్సస్‌ మాల్‌ డెస్టినేషన్‌ మాల్స్‌గా ఉన్నాయి. ఈ మూడు కలిపి 2.9 మిలియన్‌ చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్నాయి.
  •  మిగతా 22 నైబర్‌హుడ్‌ మాల్స్‌. ఇవి 5.9 మి.చ.అడుగుల్లో విస్తరించి ఉన్నాయి.

పశ్చిమాన అధికం..

మాల్స్‌ పరంగా పశ్చిమ హైదరాబాద్‌లోనే ఎక్కువగా ఉన్నాయి. ఈ ప్రాంతంలో 10 ఉండగా.. మధ్య హైదరాబాద్‌ సైతం 10తో పోటీపడుతోంది.

తూర్పు వైపు కేవలం 3 మాత్రమే ఉన్నాయి. దక్షిణం వైపు రెండు ఉండగా.. ఉత్తరంలో ఇప్పటివరకు చెప్పుకోదగ్గవి లేవు.

ఖాళీలు తక్కువే..

వీటికున్న డిమాండ్‌ దృష్ట్యా ఖాళీల శాతం తక్కువగానే ఉంది. 14 శాతం మాత్రమే ఖాళీలు ఉన్నాయి.

ప్రణాళిక దశలో..

 కొవిడ్‌ సమయంలో మాల్స్‌ ఇబ్బంది పడినా.. ఆ తర్వాత కోలుకున్నాయి. కొత్త మార్కెట్లకు వీటి నిర్మాణాలు విస్తరిస్తున్నాయి. మరో 12 చోట్ల మాల్స్‌ ఏర్పాటుకు ప్రణాళికలు ఉన్నాయి.

నిర్మాణంలో ఉన్నవి..

ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న 17లో 11 నైబర్‌హుడ్‌ మాల్సే. వీటి విస్తీర్ణం 2.8 మి.చ.అ.గా ఉంది.

  • ఆరింటిని గ్రేడ్‌ ‘ఏ’ మాల్స్‌గా నిర్మిస్తున్నారు.
  • 2024 నాటికి 2.41 మిలియన్‌ చ.అ. విస్తీర్ణం రిటైల్‌లో అందుబాటులోకి రాబోతుంది.
  • కొంపల్లిలో టీఎన్‌ఆర్‌ నార్త్‌సిటీ, నల్లగండ్లలో అపర్ణ, కర్మన్‌ఘాట్‌లో టీఎన్‌ఆర్‌ ప్రిస్టన్‌, మూసాపేటలో లేక్‌షోర్‌ మాల్స్‌, మదీనగూడలో బ్రాడ్‌వే మాల్స్‌ నిర్మాణం చివరి దశలో ఉంది.
  • శంషాబాద్‌లో జీఎంఆర్‌ ఇంటర్‌ఛేంజ్‌ మాల్‌, హైస్ట్రీట్‌ కలిపి 2025 నాటికి, రాయదుర్గంలో ఎల్‌ అండ్‌ టీ రాయదుర్గ్‌ 2027 నాటికి అందుబాటులోకి రాబోతున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని