స్పైసీ స్వీట్‌కార్న్‌ పులావ్‌

పులావ్‌.. పేరు వింటే చాలు ఎప్పుడెప్పుడు తిందామా అనిపిస్తుంది కదూ! నేను మొక్కజొన్నలతో చేస్తాను. దీనికి పావు కిలో బియ్యం; రెండు చెంచాల చొప్పున నెయ్యి, నూనె; అర కప్పు చొప్పున ఉల్లి, క్యారెట్‌, బీన్స్‌, క్యాప్సికం, టొమాటో ముక్కలు

Published : 21 Apr 2024 00:21 IST

పులావ్‌.. పేరు వింటే చాలు ఎప్పుడెప్పుడు తిందామా అనిపిస్తుంది కదూ! నేను మొక్కజొన్నలతో చేస్తాను. దీనికి పావు కిలో బియ్యం; రెండు చెంచాల చొప్పున నెయ్యి, నూనె; అర కప్పు చొప్పున ఉల్లి, క్యారెట్‌, బీన్స్‌, క్యాప్సికం, టొమాటో ముక్కలు; పావు కప్పు స్వీట్‌కార్న్‌; నాలుగు యాలకులు; మూడు లవంగాలు; రెండు బిర్యానీ ఆకులు; ఒక స్టార్‌మొగ్గ; ఏడెనిమిది వెల్లుల్లి రెబ్బలు; చెంచా చొప్పున షాజీరా, జీలకర్ర, మిరియాల పొడి, గరం మసాలా, కశ్మీరీ కారం; 15 జీడిపప్పులు; ఐదు పచ్చిమిర్చి; రుచికి సరిపోయేంత ఉప్పు; చారెడు కొత్తిమీర తరుగు అవసరమవుతాయి. ఎలా చేయాలంటే.. ముందుగా అన్నం పొడిపొడిలాడేలా వండి పక్కనుంచాలి. కడాయిలో నూనె కాగనిచ్చి యాలకులు, బిర్యానీ ఆకులు, స్టార్‌మొగ్గ, లవంగాలు, జీలకర్ర, షాజీరా, మిరియాల పొడి వేయాలి. అవి వేగాక.. వెల్లుల్లి తరుగు, జీడిపప్పు, ఉల్లి, క్యారెట్‌, బీన్స్‌, క్యాప్సికం, టొమాటో ముక్కలు, సగానికి కట్‌ చేసిన పచ్చిమిరపకాయలు వేసి.. వేగనివ్వాలి. కొన్ని క్షణాల తర్వాత స్వీట్‌కార్న్‌, అన్నం, ఉప్పు, గరం మసాలా, కశ్మీరీ కారం, నెయ్యి వేసి.. మూతపెట్టి సన్న సెగ మీద కొన్ని నిమిషాలు ఉడికించాలి. దించిన తర్వాత కొత్తిమీర తరుగు వేసి కలియ తిప్పాలి. అంతే.. ‘స్పైసీ స్వీట్‌కార్న్‌ పులావ్‌’ తిని ఆనందించడమే తరువాయి.

శోభారాణి మండిగ హ్యూస్టన్‌, టెక్సాస్‌, అమెరికా


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు