పనీర్‌ భుర్జీభలే టేస్టీ

పాఠకవంటఇతర ప్రాంతాలవారు చేసే కొన్ని కొన్ని వంటలు మనకు కుదరవు అనుకుంటారు కొందరు. నిజానికి అవేమంత కష్టం కాదు.

Published : 12 May 2024 00:35 IST

పాఠకవంటఇతర ప్రాంతాలవారు చేసే కొన్ని కొన్ని వంటలు మనకు కుదరవు అనుకుంటారు కొందరు. నిజానికి అవేమంత కష్టం కాదు. రోజూ చేసుకునే అలవాటైన వంటలతో పాటు అప్పుడప్పుడూ ఇలాంటివి ప్రయత్నిస్తుంటే.. ప్రత్యేకంగా అనిపిస్తాయి. పిల్లలూ, పెద్దలూ అందరికీ నచ్చేస్తాయి. నేను వారానికోసారైనా కొంచెం స్పెషల్‌ డిషెస్‌ చేస్తుంటాను. వాటిల్లో ‘అమృత్‌సర్‌ పనీర్‌ భుర్జీ’ ఒకటి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది.

తయారీ ఎలా అంటే.. కడాయి వేడయ్యాక.. రెండు స్పూన్ల నూనె, ఒక స్పూన్‌ నెయ్యి, టేబుల్‌స్పూన్‌ శనగపిండి వేసి వేయించాలి. కొన్ని క్షణాల తర్వాత అర కప్పు చొప్పున ఉల్లి, టొమాటో తరుగు, చెంచా చొప్పున పచ్చిమిర్చి, అల్లం ముక్కలు వేసి నాలుగు నిమిషాలు వేయించాలి. అందులో ఉప్పు, పసుపు, గరం మసాలా, కశ్మీరీ కారం జతచేసి కలియ తిప్పాలి. మూడు నిమిషాల తర్వాత.. తగినన్ని నీళ్లు పోసి ఉడికించాలి. ఇంకో రెండు నిమిషాలయ్యాక.. కప్పు పనీర్‌ తురుము, చెంచా చొప్పున మెంతి ఆకుల పొడి, క్రీమ్‌ వేసి.. దగ్గరపడనివ్వాలి. చివర్లో కొత్తిమీర తరుగు వేసి.. దించేస్తే సరిపోతుంది. వహ్వా అనిపించే పనీర్‌ భుర్జీ రెడీ. ఇది చపాతీ, పరోటా, బ్రెడ్‌ ఎందులోకైనా భలే రుచిగా ఉంటుంది. మీరూ చేసి చూడండి.

 

_ బండి మల్లీశ్వరి, హైదరాబాద్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని