మీ కోసం.. గట్టే కీ సబ్జీ

రాజస్థానీయుల ‘గట్టే కీ సబ్జీ’ చక్కటి రుచీ పరిమళాలూ అందించే గ్రేవీ వంటకం.

Published : 12 May 2024 00:09 IST

రాజస్థానీయుల ‘గట్టే కీ సబ్జీ’ చక్కటి రుచీ పరిమళాలూ అందించే గ్రేవీ వంటకం.

కావలసినవి: శనగ పిండి, పెరుగు - కప్పు చొప్పున, జీలకర్ర, మిరియాల పొడి, కారం - చెంచా చొప్పున, పసుపు - అరచెంచా, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్‌ - 2 చెంచాల చొప్పున, వాము - పావు చెంచా, ఉప్పు - రుచికి తగినంత, నూనె - టేబుల్‌స్పూన్‌, నెయ్యి - 2 టేబుల్‌ స్పూన్లు, కరివేపాకు రెబ్బలు - 2, ఉల్లితరుగు - పావు కప్పు, లవంగాలు - 5, పచ్చిమిర్చి - 2, ఇంగువ - చిటికెడు

 గట్టే లేదా కుడుముల తయారీ

ఒక గిన్నెలో శనగపిండి, మిరియాలు, కారం, పసుపు, జీలకర్ర, ధనియాల పొడి, నెయ్యి, ఉప్పు వేసి బాగా కలపండి, 3 టేబుల్‌ స్పూన్ల నీళ్లు పోసి గట్టిపిండిని తయారుచేయండి. దాన్ని సాగదీసి.. 8 అంగుళాల కుడుములు చేయాలి. తక్కువ సెగలో వాటిని ఆవిరి మీద ఉడికించండి. స్టవ్వు కట్టేసి.. చల్లబడిన తర్వాత అంగుళమంత పొడవున కట్‌ చేసి ఉంచండి.

గ్రేవీ తయారీ

ఒక గిన్నెలో పెరుగు, కారం, పసుపు, ధనియాల పొడి, కాస్త శనగపిండి, ఉప్పు వేసి కలపండి. కడాయిలో నెయ్యి, నూనె వేడయ్యాక.. జీలకర్ర, ఇంగువ, అల్లం వెల్లుల్లి పేస్ట్‌లను దోరగా వేయించి, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు జోడించండి. కొన్ని క్షణాల తర్వాత.. ఉల్లితరుగు వేసి, గోధుమ రంగు వచ్చేవరకు వేయించాలి. అందులో పెరుగు వేసి కలియ తిప్పుతుండాలి. మూడు నిమిషాలయ్యాక.. కుడుములు వేసి, ఇంకాస్త ఉడికించాలి. దించేసి కొత్తిమీర చల్లితే సరిపోతుంది. ఇది అన్నం, పరోటాలు ఎందులోకైనా బాగుంటుంది.

- పవన్‌ సిరిగిరి, చెఫ్‌, హైదరాబాద్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని