పసందైన జమ్ము-కశ్మీర్‌ శుఫ్తా

జమ్మూ కశ్మీర్‌ వాసుల ప్రసిద్ధ వంటకం ‘కశ్మీరీ శుఫ్తా’. ఈ వంటకాన్ని ఇతర రాష్ట్రాల వాళ్లు కూడా ఇష్టంగా తింటారు కనుక.. ఒకసారి రుచి చూద్దాం. దీనికి ఏమేం కావాలంటే..

Published : 09 Jun 2024 00:54 IST

మ్మూ కశ్మీర్‌ వాసుల ప్రసిద్ధ వంటకం ‘కశ్మీరీ శుఫ్తా’. ఈ వంటకాన్ని ఇతర రాష్ట్రాల వాళ్లు కూడా ఇష్టంగా తింటారు కనుక.. ఒకసారి రుచి చూద్దాం. దీనికి ఏమేం కావాలంటే.. పంచదార 2 కప్పులు; వాల్‌నట్స్, కిస్‌మిస్, జీడిపప్పు, పిస్తా, ఎండు ఖర్జూరం, బాదం, ఎండుకొబ్బరి, నెయ్యి, చీజ్‌ అర కప్పు చొప్పున; ఎండు గులాబీరేకలు 2 టేబుల్‌ స్పూన్లు; మిరియాలపొడి, డ్రైజింజర్‌ పౌడర్, దాల్చినచెక్క పొడి చెంచా చొప్పున; యాలకుల పొడి అర చెంచా; కుంకుమపువ్వు పావు చెంచా సిద్ధంగా ఉంచుకోవాలి. ఎలా చేయాలంటే.. డ్రైఫ్రూట్స్‌ను అరగంట నానబెట్టాలి. ఆ నీళ్లను తీసేసి, ఇంకో అరగంట నాననివ్వాలి. ఖర్జూరాల్లో విత్తనాలు తీసేసి, ముక్కలు చేయాలి. ఎండుకొబ్బరిని, చీజ్‌ని విడివిడిగా వేయించి, పళ్లెంలోకి తీయాలి. అదే కడాయిలో నెయ్యి వేడయ్యాక.. బాదం తదితర పప్పులను వేయాలి. అవి కాస్త వేగాక ఖర్జూరాలు, తర్వాత ఎండుకొబ్బరి, చీజ్‌ వేయాలి. అవీ వేగాక.. గులాబీరేకలు, మిరియాలపొడి, డ్రైజింజర్‌ పౌడర్, దాల్చినచెక్క పొడి, యాలకుల పొడి, కుంకుమపువ్వు, పంచదార వేసి కలియబెడుతూ వేయించాలి. పంచదార కరిగి, అన్నిటికీ పడుతుంది. సన్న సెగ మీద నాలుగు నిమిషాలు ఉంచి దించేయాలి. కశ్మీరీ అందాలు ఆకట్టుకున్నట్టే ఈ మిఠాయి పసందుగా ఉంటుంది. ఇది పోషకాల గని కూడా. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని