చిత్రమైన రుచితో కలాతప్పమ్‌!

కేరళవాసుల తీపి వంటల్లో కలాతప్పమ్‌ ప్రత్యేకమైంది. దీనికి ఏమేం కావాలంటే.. జార్‌లో కొబ్బరికోరు అర కప్పు, అర చెంచా జీలకర్ర, యాలకులు ఆరు, అర కప్పు నీళ్లు పోసి గ్రైండ్‌ చేయాలి.

Published : 05 May 2024 00:25 IST

కేరళవాసుల తీపి వంటల్లో కలాతప్పమ్‌ ప్రత్యేకమైంది. దీనికి ఏమేం కావాలంటే.. జార్‌లో కొబ్బరికోరు అర కప్పు, అర చెంచా జీలకర్ర, యాలకులు ఆరు, అర కప్పు నీళ్లు పోసి గ్రైండ్‌ చేయాలి. అందులో రెండు కప్పుల బియ్యప్పిండి, ఒకటిన్నర కప్పు నీళ్లు, పావు చెంచా చొప్పున ఉప్పు, బేకింగ్‌ సోడా వేసి ఇంకోసారి గ్రైండ్‌ చేయాలి. మరో పాత్రలో కప్పున్నర బెల్లం, ముప్పావు కప్పు నీళ్లు పోసి మరిగించాలి. ఈ పాకాన్ని టీ నెట్టుతో వడకట్టి బియ్యప్పిండిలో పోసి కలపాలి. ప్రెషర్‌ కుక్కర్‌లో ఒక టేబుల్‌ స్పూన్‌ నూనె, ఇంకో టేబుల్‌స్పూన్‌ నెయ్యి వేసి.. చారెడు కొబ్బరి ముక్కలను వేయించాలి. అవి కాస్త వేగాక.. కొంచెం పెద్దగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు అర కప్పు జతచేర్చి దోరగా వేయించాలి. తర్వాత బెల్లం పాకం కలిపిన బియ్యప్పిండి వేసి మూత పెట్టి.. మీడియం సెగ మీద ఉడికించాలి. కుక్కర్‌కు వెయిట్‌ పెట్టకూడదు. బంగారు రంగు వచ్చే వరకూ ఉడికించాలి. ఇందుకు సుమారు ఏడెనిమిది నిమిషాలు పడుతుంది. చల్లారాక.. నచ్చిన ఆకృతిలో కట్‌ చేసుకుంటే సరి.. ‘కలాతప్పమ్‌’ తయారైపోతుంది. చిత్రమైన రుచితో పిల్లలూ, పెద్దలూ అందరికీ నచ్చేస్తుందీ వంటకం. మనమూ చేద్దామా మరి!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు